26, జులై 2015, ఆదివారం

అనువాద పద్యాలు  

                     పెళ్ళి
                     -----
కన్యా వరయతే రూపం , మాతా విత్తం , పితా శృతం 
బాంధవాహః  కుల మిచ్ఛంతి ,మృష్టాన్న మితరే జనాః 


వలపగు రూపురేఖగల వానినికోరు కన్నె, విత్తస
ల్లలితుని గోరు తల్లి,శ్రుతి లక్ష్య రసజ్ఞుని కోరు ద౦డ్రి, స
త్కులజుని గోరు బ౦ధుతతి,కూరిమిశోభన వేళలో
కులు సరసాన్న భుక్తి మదిఁకోరుదురీధరలోననెల్లెడన్



జగతిని కన్నియల్ వరుని చక్కదన౦బె గణి౦తురమ్మలు౦
దగ ధనవ౦తునె౦చెదరు,ద౦డ్రులు కీర్తిని గోరు వారు,బ౦
ధుగణము సత్కులోన్నతగతుల్ గనుగొ౦దురితరేతరుల్స
పక్వగురుసు భోజ్యస౦పదలగా౦క్షయొనర్చెదరుద్వహ౦బునన్ - Sasirekhaparinayam

Taken from two different  kaavyaalu 

Meaning .. 
Bride expects handsome guy as husband 
Bride's mother expects a rich prosperous son in law,
Father expects  a guy with good intelligence and character as son in law
People from our clan expects same clan guy
Invitees expects good delicious feast.

                     -----
సుదతి భావి వరుని లోని సొగసు చూచు
తల్లి ధనమును,గుణమును త౦డ్రి చూచు
కులము వరుని గోత్రాది  లొసుగులు చూచు
జనము పె౦డ్లిలో వి౦దు భోజనము ఁజూచు.      (. By. Komalarao )



నీతి  పద్యం
శ్లో.   పుస్తకం వనితా విత్తం
      పర హస్తం గతం గతమ్ 
      అథవా పునరా యాతి 
      జీర్ణం భ్రష్టా చ  ఖండిశః  
తా.  పుస్తకము, ఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే  మరల
      తిరిగి రావు. ఒక వేళ తిరిగి వచ్చిన  చినిగి పోయి ,  చెడి పోయి గాని
     సగము గాని వస్తాయి.
దీనినే తెలుగు పద్య రూపము లో  వ్రాస్తే
ఇలా ఉంటుంది .

ఆ.వె.   అందమైన వనిత, అరుదైన పుస్తకం
            చేతి లోని సొమ్ము పోతె  రావు
            మగిడి వచ్చెనేని మలినమౌ చినుగును
            సగమె  వచ్చు ననుట అదియ నిజము

         తిరిగి  వచ్చెనేని  చెడినదౌ, చినుగును
           



దండం  (చేతి కర్ర)
విశ్వామిత్రాహి పశుషు కర్డమేషు జలేషు చ
అంధే తమసి వార్దక్యే చ దండం దశ గుణం భవేత్
తా. పక్షి, కుక్క ,శత్రువు ( కాని వాడు , దొంగ ),పాము ,పశువు,బురద ,నీటిలో ,చీకటిలో గ్రుడ్డి వానికి ,ముసలితనము లో ఇలా పది విషయాలలో    దండం  ఉపయోగకారిని .
వి=పక్షి ,శ్వ= కుక్క ,అమిత్ర = శత్రువు, అహి=పాము , పశుషు=పశువు ,
కర్డమేషు(కర్దమము)=బురద . జలేషు=నీరు , అంధే=గ్రుడ్డి వాడు , తమసి=తమము ,చీకటి , వార్దక్యే=ముసలి తనము
చేతి కర్ర గురించి  అందమైన ఆటవెలది
ఆ.వె    పాము, వేపి, పిట్ట ,పసుల పారగ దోలు  
         అంబు ,అడుసు లందు అండ గాను
        అహిత ,ముదిమి, అంధ తమములన్ తోడైన
        చేతి కర్ర  మహిమ చెప్ప తరమె 
       వేపి =కుక్క ,  అంబు = నీరు ,అడుసు = బురద


If I die in a war zone , Box me up and send me home Put my medals on my chest, Tell my mom I did my best. Tell my dad not to blow, He won't get tension from me now. Tell my bro to study perfectly, key of my bike will be his permanently . Tell my sister not to be upset, her bro will take a long sleep after sunset. Tell my nation not to cry , Because I'am a soldier born to die

సైనికుడి లేఖ
 తే.
చావు తధ్యము యోధకు చర్చ చేయ/
 నేను సమసిన వేళలో నేమముగను/
 పతకములను శవము పై పదిల పరచి/
 ఊరు చేర్చుడి పేటిక మీరు ప్రేమ.

 సీ.
 నియతి తప్పక మరి నియమానుసారముఁ గరపితి విధినని అమ్మ కనుము/
 కలత చెందక మరి కన్నీరు వెట్టక నాకయి క్రుంగకు నాన్న యనుము/
 బుద్ధిగా చదువుచూ , పొందిక నా వాహన మనుభవింపుము యనుజ యనుము/
 దిగులుతో బెంగతో బొగులుచు యన్నకై జీవితం వృథచేయకుము యని చెల్లి కనుము//

 తే.
 తీర్చ నైతి  మీఋణమును  నేర్పు మీర/తల్లి దండ్రుల ఋణమును కల్ల చేస్తి 
 తీరె జన్మ భూమి ఋణము తెగువ జూప/
  చావు తప్పదు యోధకు జగతి లోన/
 పోయి వచ్చెద సెలవిండు పోదు నమ్మ.

 జై హింద్    తెలుగు సేత డా.కోమలరావు బారువ. 18/2/2019  
Sent from my iPad

పుష్కర గోదావరి

పుష్కర గోదావరి

పరవళ్లు తొక్కింది గోదావరి 
పరవశించిపోయింది గోదావరి  
నాసిక్ లోపుట్టింది తెలుగింటికొచ్చింది
తెలుగు రాష్ట్రాలలో చక్కర్లు కొట్టింది ' 
గౌతముని పాపాలు కడు గంగ 
గౌతమి గ వచ్చింది గంగ .దివిజ గంగ . 
కవులకు కాణాచి గౌతమీ తీరం .
ప్రజలకందించింది మహాభారత సారం . .... పరవళ్లు తొక్కింది గోదావరి 

బాసరలో భారతికి పాదాలు కడిగింది .. 
రాణ్మహేంద్రంలో రాగాలు పలికింది
సప్తర్షి స్పర్శ చే సప్త గోదావరైంది
కవుల  ఘంటాలలో కావ్యమై నిలిచింది
పాడి పంటలనిచ్చి అన్నపూర్ణ అయింది  ....  పరవళ్లు తొక్కింది గోదావరి


ప్రకృతి మాతకు జీవధారగ నిలిచింది 
**పోల'వరమ్మ్మై' విద్యుత్తు  కాంతులీనేను 
చమురు వాయువులకు క్షేత్రమై పొంగింది
సగటు ఆంధ్రుని కొంగు బంగారమైంది.     పరవళ్లు తొక్కింది గోదావరి    ( by Komalarao ). 

** భవిష్యత్తు లో 

21, మే 2015, గురువారం

ఎన్నడు వేడరాని

ఉ. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి నిన్నునున్
   నన్నును నేడు పుట్టిన దినమ్మనియెంతయు ప్రేమ తోడ మృ
  ష్టాన్నములారగింప స్వగృహమ్మునకు దయజేయ వేడు చో
   కన్నడ జేయ బూ నెదవు కంజ దళాక్షి ఇదేటి న్యాయ మే    ౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
----  నెవ్వరు కాల్ చేయని రుక్మిణి సిస్టరొచ్చి నిన్నునున్
       నన్నును నేడు బర్తడే డి న్నరని ఎంతయు స్వీటుగా
      హోముకు  ఇనవైటు చేయ నో నో ఆని న్యూసెన్సు
        చేయ బూనెదవు లోటస్సు కల్లదాన ఈజిట్  న్యాయ మే

13, మే 2015, బుధవారం

తాటి కాయ ( ముంజి కాయ )



తాటి కాయ  ( ముంజి  కాయ  )



తాటి కాయ  ముంజి  కాయ  )


.వె 

కాయ బయట చూడ గట్టిగా ఉండును /

కోయ  మెత్తనైన  గుజ్జు ఉండు /

తిన్న వానికి రుచి తెల్లమగును కాదె /

దీని మరువ కోయి తెలుగు వాడ


-కోమలరావు 


కాయ బయట చూడ గట్టిగా ఉండును 
లోన మెత్త నైన  గుజ్జు (గుజురు) ఉండు
తిన్నవాని కడుపు చల్లగా ఉండును 
దీని మరువ కోయి తెలుగు వాడ
దీని సాటి ఏ Ice cream కు కుండు


19, ఏప్రిల్ 2015, ఆదివారం

దేవుడి సమాధానం

             దేవుడి  సమాధానం                19/4/2015
ప్రియమైన జీవాత్మకు పరమాత్మ  వ్రాయు లేఖ
నాయన, నీ లేఖకు నా సమాధానం  1 సం //  ఆలస్యము గా 
వ్రాస్తున్నాను . ఏమీ అనుకోకు , ఎందుకంటె నేరం నారదుడిది .( Postal Delay )

మీ భూమి మీద  నా బిడ్డలు ( మీ ప్రజలు)         
ఇక్కట్ట్లు పడుతున్నరని వ్రాసావు .
ఇందులో విశేషమేముంది .
మీ మీ కర్మ ఫలాలు అనుభవించటానికే 
మిమ్మల్ని  ఆ కర్మ  భూమి యైన భరత వర్షంలో  సృష్టించాను  
భూమి మీద అకృత్యాలు కలియుగ ప్రభావమేయైన ఇంత రాక్షసత్వమా?

త్రేతాయుగ , ద్వాపర యుగ రాక్షససులనే మించి పోయారే 
నరులై యుండి కౄరత్వంలో నా అవతారాన్నే (నర సింహము) మించిపోయారే.
పూర్వ కాలంలో మోక్షం కోసం తపస్సు చేస్తే 
ఇప్పుడు మీరు ముల్లె ( ధనం ), మగువ, మద్యం కోసం తపిస్తున్నారే 

గాలి ,నీరు, నిప్పు,నేల ,నింగి సృజించి
 సమ తుల్యం పాటించి సామరస్యంగా గా బ్రతకండని  చెప్తే 

అభివృద్ధి మాటున  పంచ భూతాలను  కకావికలం చేసి
 స్వచ్చ మైన గాలి నీరు లేక రోగాల బారిన పడుతున్నారు.
ఎవరో వస్తారని ఏదో  చేస్తారని 
ఎదురుతెన్నులు చూసి ఎందుకు  బా ధ పడతారు.

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి  భారత ః
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్"
అని వక్కణించిన  నేనే చెప్తున్నాను

ధర్మో రక్షతి రక్షితః 
వృక్షో రక్ష్తతి రక్షితః 
అను వాక్యాలు తు.చ. తప్పకుండ పాటించడి
సద్ధర్మ సమాజం సాధించండి 
లేకుంటే నా పునః సృష్ఠే కాదు 
అసలు సృష్ఠే ఉండదు.
తస్మాత్ జాగ్రత్త 

ఇట్లు
సృష్టి కర్త 
C/Oవిశ్వం 

18, ఏప్రిల్ 2015, శనివారం

వంశధార
వంపులు తిరిగే వంశధారకు వరదలెక్కువ
వయ్యారాల వంశధారకు ఉరవడెక్కువ
వం శ వనం లో ప్రభవించి
ఉత్తరాంధ్రలో ప్రవహించి
పుర్వాబ్ది నే పరిణయమాడిన వం శ ధార

గట్టు దాటి పుట్ట దాటి
‘గొట్టా’ బేరేజి దాటి
రైతు ఇక్కట్లను పోగొట్టే వం శ ధార             వంపులు--

కాళింగుల చరితమును  కనువిందుగా చూసి
ముఖలింగ   మూర్తిని (స్వామిని ) మ్రొక్కుతు సాగింది     వంపులు... 

బుద్ధం శరణం గచ్చామి 
స౦ఘ౦ శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
బుద్ధుని బోధలు ప్రబోధించుతు
సాలిహొండాని  పరిక్రమిస్తు
సాగర తీరం చేరె వం శ దార                వంపులు-...


www.krbaruva.blogspot.com
 
ధనం –   ఇంధనం     6/5/2011  
ధనం లేకున్న కదలదు బ్రతుకు బండి
ఇంధనం లేకున్న కదలదు ఇంజను బండి
ధనమూలమిధం జగత్తు అన్నారు ఆనాడు
ఇంధనమే అన్నిటికి కీలకమన్నారీనాడు
ధనం దండిగా ఉంటే వచ్చి చేరు బందువుల్
ఇంధనంనిండుగా ఉంటే పెరుగు వాహనముల్
ధనం కొరకు జరిగాయి యుద్ధాలు ఆనాడు
ఇంధనంకొరకు యుద్ధాలు జరుతున్నయీనాడు 
ధనం నకు మనిషి బానిసైనాడేనాడో
ఇంధనం నకు మనిసి బానిసైనాడీనాడు
ధనం ఎక్కువైతే పెరుగు దుర్య్వసనాలు
ఇంధనం ఎక్కువైతే పెరుగు వాయు కాలుష్యాలు
ధనం విలువ రాను రాను శూన్యం
ఇంధనం విలువ పోను పోను అనూహ్యం


వాన- జాణ    8/5/2013

పిలిస్తే వచ్చింది వాన 
పిలిచిన  రాలేదు జాణ
పయోదరములు కరిగితే కురుస్తుంది వాన
పైఅధరములు కలిస్తే కురుస్తుంది తేనె లసోన
వాన కురిస్తే  చెరువులు కప్పలతో నిండు
జాణ నవ్వితే వెన్నెలలు పండు
వాన సినిమా కవులకు స్పందన
జాణ మగనికి తీయని శిరోవేదన
వాన పుడమి పచ్చదనానికి , చల్లదనానికి మూలం
జాణ జాతి వృద్ధికి ,దేశ పురోభి వృద్ధికి మూలం


Komalarao 
            దేవుడికి లేఖ.     11/5/2013

   రచన  : బారువ  కోమలరావు
             శ్రీకాకుళం   
-------------------------


మహరాజశ్రీదేవుడు గారికి ,

జీవుడు నమస్కరించి వ్రాయు విన్నపము 

భూమి జనులు పెక్కు ఇక్కట్లు పడుచున్నారు.
తోటి ప్రజలను ఇక్కట్లు పెడుతున్నారు.
మానవత్వము మరిచి మృగాల వలె ప్రవర్తిస్తున్నారు.
ఇది యుగ ప్రభావమా? మనిషి రాక్షసత్వమా?లేక నీ లీలామనుష కృత్యమా?
డబ్బును ప్రేమించినంతగా మనిషి మనిషిని ప్రేమించలేటంలేదు.
డబ్బుకొరకు మానము ,అభిమానం అమ్ముకుంటున్నాము.
ఆదిలో నీ అనుగ్రహంకొరకు తపస్సు చేసేవాళ్ళము.
నేడు తప్పులు చేసి నీ అనుగ్రహం కోసం ముడుపులు కడుతున్నాము.    
కర్మభూమియైన భరత వర్షంలో
దుష్కర్మలు భరత నాట్యం చేస్తున్నాయి.
వేదాలు వల్లించాల్సిన భూసురులు   బూతులువల్లిస్తున్నారు.
రక్షణ కల్పించవలసిన  క్షత్రియులు (పరిపాలకులు) ప్రజలను భక్షిస్తున్నారు.
వ్యాపారము చేసె వైశ్యులు కల్తీ విక్రయం చేస్తున్నారు.
సేవలు చేయాల్సిన శూద్రులు సేవలు చేయించుకుంటున్నారు.
వర్ణాలు రంగులు మారాయి.
ఆశ్రమాలు  అశ్లీలాలైనాయి.

నీవు సృజించిన నీరు 'కొని' త్రాగుతున్నాము
నిషేధించిన మధువు త్రాగి తూలుతున్నాము.
కోట్లతో ఓట్లు కొని కోట్లకు పడగలెత్తుతున్నాము
ఓట్లు వేసిన వాడి నడుము విరుగ గొడుతున్నాము

రూక లేని వానికి రోగమొస్తె రోగముదే పైచేయి
డబ్బున్న వాడికి జబ్బొస్తే వాడిదేనోయ్ హాయి

వస్తువులధరలు వ్యోమనౌకలైనాయి.
సొమ్ములేమొ మరి చిల్లపెంకులైనాయి

ఋగ్యజుర్సామాధర్వణ వేదాలు నాలుగే నీకు
అతివాద,మతవాద,ఉగ్ర, వేర్పాటు వాదాలనేకం మాకు

ఏమిటి మా భవితవ్యం
చెప్పవోయి నీ ఆంతర్యం

"యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి  భారత ః
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్"

అని  చెప్పిన నీవు 

నిన్ను నీవు సృష్టించుకుంటావా
మమ్మల్ని పుట్టించటం ఆపుతావా
ఏదో ఒకటి చేయ్
నీవున్నావని ఋజువుచేయ్

ఇట్లు
వరాహకల్ప 
వైవస్వత మన్వంతర 
జంబూద్వీప 
భరత వర్ష
భరతఖండ 
కలియుగ  జీవి







21, మార్చి 2015, శనివారం



తే. పచ్చని  పటము గట్టిన  పడుచు  వోలె  
    కురుల  మల్లెలు  తురిమిన  కొమ్మ  వోలె. 
    చెలువు మీర  అళి చెలులు  బలసి  గొలువ  
    వచ్చె  పుడమికి  నూత్న  వసంత  లక్ష్మి 


కం.       డెందము నందు జనులకా
            నందము నింపగ పుడమికి మన్మథుడొచ్చెన్
            నందక ధారి కృపారస
            మందಱకున్ దొరకుగాత వత్సర మంతన్

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


మన్మథ నామ సంవత్సరానికి విన్నపం.  
_____________________________   

మన్మథ మన్మథస్వాగతం నీకు 
నిరుడు జయ నామ సంవత్సరం వచ్చింది 
నిలువునా రాష్ట్రాన్ని రెండు గా చీల్చింది 
ప్రజలకు ద్రవ్య లోటు, నీళ్ళ పాట్లు మిగిల్చింది

హుద్ హుద్ ఉత్పాతం రాష్ట్రా నికి శాపమయ్యె
మూలుగుతున్న నక్క పై తాటి కాయ చందమయ్యె

అరచేతిలో వైకుంఠం చూపించె నాయకులు
చిలక జ్యోస్యులను తలపిస్తున్నారు 

నల్ల కుబేరులఘనత చూసి
నల్ల కోయిల తెల్ల బోయింది

ఇక ఇసుక మాఫియా రాయల్లు
కాదేది మేత కనర్హం అన్నట్లు
సర్వ భక్షకున్ని  తలదన్నారు


ఈ కష్టాలన్ని గట్టెక్కి. ఆంధ్రప్రదేశ్ 
స్వర్ణాంధ్ర వైపు పరుగులు తీసేదెప్పుడు
సగటు ఆంధ్రుడి కష్టాలుతీరెదెప్పుడు

మన్మథా నీవైన మా మొరాలకించి

చెట్లను చిగిరింపజేసి ఫలభరితం జేసె మన్మథ
మాజీవితాలు సుఖ భరితం చేయవయ్యా
తుమ్మెదలకు మకరందాన్ని అందించే నువ్వు
చిలుకలచే కేరింతలు పెట్టించె నువ్వు 
గ్రీష్మతాపాన్ని తగ్గించి మలయ పవనాలు వీయించి
మాకు నందాన్ని  అందించవయ్యా

ఇదేనా విన్నపం




3, ఫిబ్రవరి 2015, మంగళవారం

CHANGING TRENDS

CHANGING TRENDS


ఒకప్పుడు       .........

కం. అప్పిచ్చు వాడు, వైద్యుడు 
        ఎప్పుడు నెడతెగక  పారు యేరున్, ద్విజుడున్
        చొప్పడిన యూరనుండుము 
        చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ 

-- బద్దెన


ఇప్పుడు. ..........

ఎప్పుడు మూయని బారును  
ఎప్పుడు యెడతెగక దొరకు ఈగిల్ బీరున్/ 
చొప్పడిన చోట నుండుము 
చొప్పడ కున్నట్టి  యూరు  చొరకుము వీరా

-- కోమలరావు