4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

 

తేటగీతి మాలిక 

భూమి భారంబు తగ్గించ పుడమి వేఁడ /

వసుధ కోర్కెకు దివ్యులు వంత పాడ /

దనుజుల దునుమాడుటకునై దానవారి /

దేవకీ దేవులకు పుట్టె తేజమలర /

కంసు భయముచే నిశరాత్రి కరుణతోడ /

తండ్రి బాలుని  వ్రేపల్లె తరలజేసె /

బాలుడంత పెరుగుచుండె వ్రజమునందు /

తల్లియై  యశోద శిశువుఁ దనుపుచుండ /

పిన్న వయసున పూతన పీచ మడఁచె /

పెక్కు దనుజుల బాలుడై యుక్కడంచె /

మన్ను తిన నోరు చూపించుమన్న చూపె /

తల్లికి పదునాల్గు జగము లెల్ల నోట /

మద్దులను గూల్చె , కాళియు మదమడంచె /

కొండనెత్తి యాఖండలు క్రొవ్వడంచె /

విశ్వగురుడైన గురునొద్ద విద్యనేర్చె /

మామకంసుని సమయించి మహిమ జూపె /

గొల్ల భామల మురిపించె పల్లెలోన /

ద్రౌపదికివలువ లొసఁగి రక్షచేసె /

ధర్మమునిలుప పార్థు రథమ్ము నడపె /

'గీత' నుడివె జనులతల  వ్రాత మార్చ /

ధరను దుష్టుల శిక్షించ తాను పుట్టె /

అట్టి కృష్ణునకనిశము నంజలింతు .



డా.కోమలరావు బారువ 

11, జులై 2026, శనివారం

 కాక చేష్టా బకధ్యానం శ్వాననిద్రా తథైవ చ

అల్పాహారీ గృహత్యాగే విద్యార్థీ పంచలక్షణమ్


తే. 

కాకచేష్టితములు శునకంపు నిద్ర /

కొంగ జపమింటి యందును బెంగలేక/

యుండుటయు మరియు పరిమితోగిరమ్ము /

ఐదు గుణములు చదువరి కవసరమ్ము .

7, జులై 2026, మంగళవారం

 తత్త్వము 

ఆ.వె 

వచ్చి నపుడు నీవు తెచ్చినదేమి రా ?

చచ్చు  నపుడు వెంట వచ్చు నేది ? 

నడుమ  స్వార్ధ మేల ? నాదినీదని యేల ?

తెలిసి బ్రతుకు మోయి తెలివి గలిగి .


కోమలరావు 

చక్కనిపద్యం వెలయించిన 

డా. శ్రీ కోమలరావుగారికి అభినందనలండి.


ఏదయినా ఒక సాహిత్యాంశాన్ని విశ్లేషణాత్మకంగా వ్యాఖ్యానించటమెలా?- యనే ఆలోచనలో కొంతసరదా యభ్యాసమిది:


మురువుగొల్పేచిన్నిఆటవెలఁది పద్యం.

ఆధ్యాత్మిక విషయసమా

లోచనలో నువ్వు-నేనే పాత్రలయితేబాగు.

ఎక్కువ మనకే అన్వయిస్తున్న 'ఫీల్' ఉంటుందండి.

ఏదో జీవాత్మ- పరమాత్మ లాగ!

ఒకపరి జననం ఒకపరి మరణం ("పునరపి..." బాపతే!)

ఆధ్యాత్మిక విషయాల్లో పెద్దపెద్ద సమోసాలు అక్కర్లేదండి.

అలఁతియలఁతిపదాలరచన చెప్పే- వినే హృదయాల్ని అలరిస్తుంది. కవిత్వానికి సరయినపదం

సరైనచోటపడాలి.అందులోనూ వేదాంతవిషయాల్లో మరీ అవసరం.

'స్వార్థం'- తప్ప ఈ పద్దెంలో సంస్కృత పదంమరొకటి

లేదండి.ఇదొకవిశేషం.

వచ్చు- చచ్చు-తెచ్చు- నాది- నీది.... వీనికి నిఘంటువు చూస్తివా--- ''కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్ట్!"--కాదూ?!

మాతృగర్భంలోంచి ఈ లోకంలోకి ఊడిపడినపుడు

మనమేమి తేలేదు---!  అమ్మ స్తన్యమే‌ పాథేయం!

"పుట్టుటయు నిజము- గిట్టుటయు నిజము-!" నట్టనడిమి నాటకంలో

నీకున్నదేమి?- వట్టి భ్రాంతిమయాహారం!ఆహార్యం!

దానికై నరుడెంత స్వార్థపరతని ప్రదర్శిస్తాడు!

నాదేమి? నీదేమి?-

సర్వంశూన్యంశూన్యం!

సర్వం క్షణికం క్షణికం!


"వెంటవచ్చునేది?"-- మహానుభావులనిపించుకున్న భారతవీరులు-మహాపతివ్రత

ద్రోవది  మహాప్రస్థానం సాగిస్తున్నపుడు...పరిపూర్ణ

ధర్మమతులు కానికారణంగా ఒక్కొక్కరే పడిపోయారు. పరిపూర్ణధర్మజ్ఞుడగు ధర్మరాజు వెంట ఏమీ రాలేదు

-- కేవలం ఆయన నమ్మిన ధర్మగుణమొక్కటి విశ్వాసపాత్రమగుశునక రూపంలో వచ్చింది.

ఆ పరసుఖజగత్ ప్రవేశద్వారానుమతిపత్రం--- నువ్వాచరించినమంచియొక్కటే!

"The final robe we wear has no pockets!"-- అన్న ఆంగ్లోక్తి నాకు ఎంతోనచ్చిన సూక్తి!


ఇంక,నడుమ నాదినీదని ఏల గోల?!-అన్నారుకవికోమలంగా!


"తెలిసి బ్రతుకు మోయి!"--

ఒరేయ్ అబ్బాయ్! తెలిసి బ్రతుకుభారాన్నిమోయవయ్యా!--అంటే సరికదా!

కాని కవి అక్కడతోఊరుకుంటే పెద్దగాచెప్పుకోనక్కర్లేదుకదండి.

"తెలివి గలిగి"-- అని గొప్ప ముక్తాయింపు ఎంత యింపు

గానో వదిలారు!

జ్ఞానముంటే సరిపోదోయ్ పంతులూ! వివేకం చాల 

అవసరంసుమా! 

వివేకమంటే--ఆచరణ!

ఆచరించే బుద్ధి!

అది లేకపోతే ఎంత తెలిస్తే నేమి?

అంతా గడ్డిపోచంత తేలిక!


పద్యం క్రింద కోమలరావుగారి

పేరు లేకపోతే----

ఎవరి పద్యం అని అడిగితే

మకుటంలేని (వేమన) మహారాజు! అనేస్తాం!

(వేమనగారు రాజుగారి తమ్ములుంగారే!)

 

"ఏమి గొంచు వచ్చె? ఏమి తాఁ గొనిపోవు

పుట్టువేళ నరుడు గిట్టువేళ

ధనము లెచటి కేగు? తానేగు నెచటికి?

విశ్వదాభిరామ!వినురవేమ!!"


కోమలరావుగారు పద్యంలో

 'రా' కట్టారు!! సమంజసమేనా- అంటే......

"....కవితలోన యుద్ధములోనన్ 

వన్నెసుమీ రాకొట్టుట!...."!!


అభినందనలందుకోండి కోమలరావుజీ! మరొక్కమారు!!

💐💐🙏🙏

5, మే 2026, మంగళవారం

 కుక్కుట  విలాపము 


తన వలన లాభము పొంది తననే హరించు  ఈ మనుజులతో కోడి ఇట్లనుచున్నది.(వచనం )


 నేనొక అండమునుండి పుట్టి 

ఈ మానుష లోకమును మెట్టి 

రెక్కలు పెంచి ఒక కోడి రూపమెత్తితిన్ 


సూర్యుడు లేవకముందె లేచి 

కొక్కొరొకో యని కూత కూసి 

 ఈ...మానవ జాతిని నిత్యము మేలుకొల్పుదున్ 


నే పెట్టు గ్రుడ్లు ( మనుజుల ) చుట్టాలకాహారము కాగ 

నే పెట్టు గ్రుడ్లు రోగులకు పౌష్టికము కాగ 


( పండుగ పబ్బాలకు ) పండుగలలో మీ అల్లుళ్ళకు కూరగా మారెదము 

పండుగలలో మీరాడు పందెములలో ఆడి 

మా విలువైన ప్రాణాలు మీకై ఓడి 

కోట్లు రూకలు మీకు కుమ్మరింతుము ( కదా) 


మా మాంసము లేని పార్టీలు లేవు 

మా మాంసము లేని హోటళ్లు లేవు 

చికెన్ సిక్స్టీ చికెన్ మొగలాయి 

చెకెన్ జోయంట్లు చెకెన్ కబాబ్లు 

పెక్కు రూపాలలో మీకు రుచుల చూపించి 


ఇన్ని రకాలుగా మీకుపయోగపడుతున్న 

మీకు మామీఁద ఇంచుక కరుణ సున్న 

ఇంత చేసి కడకు మీకాహారమయ్యెదము 

స్వర్గలోక పతియే మమ్ము మోసమ్ము చేయగా 

నీచ మానవుల మిమ్మనగనేల 


ఇట్లు తన గోడునెల్ల  వినిపించి 

కడకు కుక్కుటము విరమించె .


-కోమలరావు 


కుక్కుట ( కోడి) విలాపము .


ఆ.వె 

గ్రుడ్డునుండి పుట్టి కోడిరూపమునెత్తి 

మనుజలోకమందు మనుచు నుండి 

మీకు నెల్లవేళ మేలుచేయుచునుందు 

కుక్కుటేశ్వరు కృప  నిక్కువముగ 


ఆ:వె:  

తెల్లవారెననుచు తెల్పుటకై నేను  

కొక్కొరొకొ యనుచును కూతవేసి,  

సోమరితనమున్న సోంబేరి నరులను   

మేల్కొలిపి నిరతము మేలు జేతు.    


ఆ.వె 

జడము నుండి లేపి జగతి చూపించిఁగ /

నీతి లేని నరులు భీతి మాని/

 తెల్ల వారి లేచి మెల్లగా నను జంపి /

కూర జేసి తినుచు కులుకు చుంద్రు .


తే. 

మేము పెట్టు గ్రుడ్లనుతిని మీరు బ్రతికి /

అల్లుడింటికి రాగ మా ఒళ్లు చూసి /

వారి సంతోషపెట్టఁగ మీరు జాలి /

యించుకయలేక మధువుతో నంచుకొంద్రు.


తే. 

మమ్ము ఁ బోలు కూతను కూసి మౌని వరుని /

మోసగించె కృతమమందు  కౌశికుండు /

సురలకే లేని నీతి మీ నరుల కుండు/

టన్న ఈకలికాలమునందు  సున్న 


ఆ.వె 

కోడి రూపమెత్తి కూసి గౌతమ యతి /

మోసపుచ్చి  చెడును చేసినట్టి /

 నాటి ఫలము గంటి నేటి కలియుగాన /

క్రూరులగు నరులకు కూర యగుచు .


డా. కోమలరావు 

@@@@@@@@@@@@@@@@




ఆ.వె 

కోడి రూపమెత్తి కూసి మోసము చేసె /కూసి కోడి నై నాడు మోసము 

నాడు గౌతమునిని*  నాక విభుడు /.            చేసి గౌతమ సతిని చెఱచినట్టి 

నాటి ఫలము పొందె నేటి కలియుగాన /ఫలము ననుభవించితి నేటికలియుగాన 

                                                              క్రూరులగు నరులకు  మంచి  కూర యగుచు .





పార్టి 

కోడి మాంసము దొరకని రెస్ట రెంట్లు 

మీ విలాసము లకై