30, ఆగస్టు 2020, ఆదివారం

 వినాయక చవితి శుభాకాంక్షలతో స్వీయ రచన  22/8/2020 


గణపతి ప్రార్థన


గీత మాలిక 


మేఘ వర్ణాభ నీలంపు   మేని తోడ /

కేతుభా రావ భయదమౌ గీఁక తోడ /

తటిత సదృశ తళుకు  దంతముల తోడ /

వర్ష ధార  పగిది మద వారితోడ /

వృష్టి వేళనాఁ జను కరి వేల్పుఁ గొల్తు / 

ననిశమునభీష్ట సిద్ధికి నార్తి తోడ


ననిశమున్ విఘ్న శాంతికి నార్తి  తోడ ) 


*** నన్నె చోడుని పద్య భావన స్ఫూర్తితో ***


ఆభ  =పోలిక , మేచక = నల్లని , కేతుభము = మేఘము , ఆరావముధ్వనిగర్జన , తటితు = మెఱుపు , గీఁక = ఘీంకారము , ( ఘీంకారము - ప్రకృతి , గీఁక వికృతి ), అనిశము = ఎల్లప్పుడునిత్యము .


భావము :-

మేఘము వలె నల్లని శరీముతో ,మేఘ గర్జనఁ బోలు ఘీంకారముతో , మెఱుపుల వంటి తళుకు మను దంతకాంతులతోవర్ష ధారలాగ చెక్కిలి నుండి కారుతున్న మద జలము తో వర్షా కాలమువలెనున్న 

ఏనుగు వేల్పును కోర్కెలు తీరుటకు నిత్యము ఆర్తితో కొలిచెదను .