19, డిసెంబర్ 2019, గురువారం

గరిమెళ్ళ సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని 
--------------------------------------------------------------------------

తే.గీ
ఎవడు సిక్కోలు సింగమై  , ఎద్రిచి వలదు/
తెల్ల దొరతనమ్మనుచును  తెల్ల వారి 
నెల్ల తూర్పాడె నెవ్వాడు , అల్ల వాడె/నెల్ల తూర్పాడి నట్టి వాడల్ల వాడె 
చూడు గరిమెళ్ళ తేజము వాడె వాడె/
అందు కోవయ్య గరిమెళ్ళ వందనమ్ము  


వినాయకుడు

ఆ.

ఏన్గు ముఖము తోటి యెల్లర కిష్టుఁడు/
ఎలుక వీపు నెక్కి చెలగు వాఁడు/
ఉండ్ర మన్న చాల ఉబలాట పడువాఁడు/
మమ్ము గాచులే ద్విమాత్రుకుండు   

 వినాయకచవితి శుభాకాంక్షలు.

డా.బారువ కోమలరావు- 2/9/2019


ద్విమాత్రుకుడు= ఇద్దరు తల్లులు కలవాడు. ఏనుగు, పార్వతి.





ఆ.
పద్యమైన నేమి  గద్యమైనను యేమి/
పెదవి దాటి ప్రజల హృదిని చేర/
పద్యమునకు చూడ ప్రాస విరతి యుండు/
వడి యు ప్రాస లేదు వచనమునకు.

25/11/2019


ఉల్లిపాయ

ఆ.
ఉల్లి పాయ కోయ కళ్ళు మండును బాగ/
తల్లి కంటె మేలు ఉల్లి చేయు/
ఉల్లి కూరఁ జిహ్వ జిల్ల ని పించును/
రేటు చూడ గుండె బీటు పెరుగు .

ధరలు చూడ గుండె దడ దడగును.

ఆ.
నాణ్య మైన వంగ నాజూకు గానుండ
పొట్ట కోసి చూడ పురుగు లుండు
కూరలందు వంగ కూర రుచిగ నుండు
ధరలు చూడ మిగుల సరస మండ్రు

డా. కోమలరావు