12, ఫిబ్రవరి 2019, మంగళవారం


భోగి పండుగ


తే.గీ


చలిని పారదోలును భోగి చెలియ భంగి/


రేగు పండ్లు పోసెదరోయి భోగి నాఁడు


భోగి శయను పొందెను గోద భోగి నాడు/


భోగి మానవాళికి నిచ్చు భోగములను.


తా


భోగి సమయంలో ఉన్న చలిని భోగి మంటలు పోగొట్టును

అదెలాగంటే ప్రేయసి దగ్గర వెచ్చగా నున్నట్లు . భోగి నాడు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆనందిస్తారు . గోదాదేవి భోగినాడు శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీరంగ స్వామిని వివాహం చేసుకున్నదిభోగి మానవులందరకు భోగములనిచ్చు గాక



బారువ కోమలరావు