26, జులై 2015, ఆదివారం

అనువాద పద్యాలు  

                     పెళ్ళి
                     -----
కన్యా వరయతే రూపం , మాతా విత్తం , పితా శృతం 
బాంధవాహః  కుల మిచ్ఛంతి ,మృష్టాన్న మితరే జనాః 


వలపగు రూపురేఖగల వానినికోరు కన్నె, విత్తస
ల్లలితుని గోరు తల్లి,శ్రుతి లక్ష్య రసజ్ఞుని కోరు ద౦డ్రి, స
త్కులజుని గోరు బ౦ధుతతి,కూరిమిశోభన వేళలో
కులు సరసాన్న భుక్తి మదిఁకోరుదురీధరలోననెల్లెడన్



జగతిని కన్నియల్ వరుని చక్కదన౦బె గణి౦తురమ్మలు౦
దగ ధనవ౦తునె౦చెదరు,ద౦డ్రులు కీర్తిని గోరు వారు,బ౦
ధుగణము సత్కులోన్నతగతుల్ గనుగొ౦దురితరేతరుల్స
పక్వగురుసు భోజ్యస౦పదలగా౦క్షయొనర్చెదరుద్వహ౦బునన్ - Sasirekhaparinayam

Taken from two different  kaavyaalu 

Meaning .. 
Bride expects handsome guy as husband 
Bride's mother expects a rich prosperous son in law,
Father expects  a guy with good intelligence and character as son in law
People from our clan expects same clan guy
Invitees expects good delicious feast.

                     -----
సుదతి భావి వరుని లోని సొగసు చూచు
తల్లి ధనమును,గుణమును త౦డ్రి చూచు
కులము వారు గోత్రాది  లొసుగులు చూచు
జనము పె౦డ్లిలో వి౦దు భోజనము ఁజూచు.      (. By. Komalarao )



నీతి  పద్యం
శ్లో.   పుస్తకం వనితా విత్తం
      పర హస్తం గతం గతమ్ 
      అథవా పునరా యాతి 
      జీర్ణం భ్రష్టా చ  ఖండిశః  
తా.  పుస్తకము, ఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే  మరల
      తిరిగి రావు. ఒక వేళ తిరిగి వచ్చిన  చినిగి పోయి ,  చెడి పోయి గాని
     సగము గాని వస్తాయి.
దీనినే తెలుగు పద్య రూపము లో  వ్రాస్తే
ఇలా ఉంటుంది .

ఆ.వె.   అందమైన వనిత, అరుదైన పుస్తకం
            చేతి లోని సొమ్ము పోతె  రావు
            మగిడి వచ్చెనేని మలినమౌ చినుగును
            సగమె  వచ్చు ననుట అదియ నిజము

         తిరిగి  వచ్చెనేని  చెడినదౌ, చినుగును
           



దండం  (చేతి కర్ర)
విశ్వామిత్రాహి పశుషు కర్డమేషు జలేషు చ
అంధే తమసి వార్దక్యే చ దండం దశ గుణం భవేత్
తా. పక్షి, కుక్క ,శత్రువు ( కాని వాడు , దొంగ ),పాము ,పశువు,బురద ,నీటిలో ,చీకటిలో గ్రుడ్డి వానికి ,ముసలితనము లో ఇలా పది విషయాలలో    దండం  ఉపయోగకారిని .
వి=పక్షి ,శ్వ= కుక్క ,అమిత్ర = శత్రువు, అహి=పాము , పశుషు=పశువు ,
కర్డమేషు(కర్దమము)=బురద . జలేషు=నీరు , అంధే=గ్రుడ్డి వాడు , తమసి=తమము ,చీకటి , వార్దక్యే=ముసలి తనము
చేతి కర్ర గురించి  అందమైన ఆటవెలది
ఆ.వె    పాము, వేపి, పిట్ట ,పసుల పారగ దోలు  
         అంబు ,అడుసు లందు అండ గాను
        అహిత ,ముదిమి, అంధ తమములన్ తోడైన
        చేతి కర్ర  మహిమ చెప్ప తరమె 
       వేపి =కుక్క ,  అంబు = నీరు ,అడుసు = బురద


If I die in a war zone , Box me up and send me home Put my medals on my chest, Tell my mom I did my best. Tell my dad not to blow, He won't get tension from me now. Tell my bro to study perfectly, key of my bike will be his permanently . Tell my sister not to be upset, her bro will take a long sleep after sunset. Tell my nation not to cry , Because I'am a soldier born to die

సైనికుడి లేఖ
 తే.
చావు తధ్యము యోధకు చర్చ చేయ/
 నేను సమసిన వేళలో నేమముగను/
 పతకములను శవము పై పదిల పరచి/
 ఊరు చేర్చుడి పేటిక మీరు ప్రేమ.

 సీ.
 నియతి తప్పక మరి నియమానుసారముఁ గరపితి విధినని అమ్మ కనుము/
 కలత చెందక మరి కన్నీరు వెట్టక నాకయి క్రుంగకు నాన్న యనుము/
 బుద్ధిగా చదువుచూ , పొందిక నా వాహన మనుభవింపుము యనుజ యనుము/
 దిగులుతో బెంగతో బొగులుచు యన్నకై జీవితం వృథచేయకుము యని చెల్లి కనుము//

 తే.
 తీర్చ నైతి  మీఋణమును  నేర్పు మీర/తల్లి దండ్రుల ఋణమును కల్ల చేస్తి 
 తీరె జన్మ భూమి ఋణము తెగువ జూప/
  చావు తప్పదు యోధకు జగతి లోన/
 పోయి వచ్చెద సెలవిండు పోదు నమ్మ.

 జై హింద్    తెలుగు సేత డా.కోమలరావు బారువ. 18/2/2019  
Sent from my iPad

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి