వంశధార
వంపులు తిరిగే వంశధారకు వరదలెక్కువ
వయ్యారాల వంశధారకు ఉరవడెక్కువ
వం శ వనం లో ప్రభవించి
ఉత్తరాంధ్రలో ప్రవహించి
పుర్వాబ్ది నే పరిణయమాడిన వం శ ధార
గట్టు దాటి పుట్ట దాటి
‘గొట్టా’ బేరేజి దాటి
రైతు ఇక్కట్లను పోగొట్టే వం శ ధార వంపులు--
కాళింగుల చరితమును కనువిందుగా చూసి
ముఖలింగ మూర్తిని (స్వామిని ) మ్రొక్కుతు సాగింది వంపులు...
బుద్ధం శరణం గచ్చామి
స౦ఘ౦ శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
బుద్ధుని బోధలు ప్రబోధించుతు
సాలిహొండాని పరిక్రమిస్తు
సాగర తీరం చేరె వం శ దార వంపులు-...
www.krbaruva.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి