దేవుడి సమాధానం 19/4/2015
ప్రియమైన జీవాత్మకు పరమాత్మ వ్రాయు లేఖ
నాయన, నీ లేఖకు నా సమాధానం 1 సం // ఆలస్యము గా
వ్రాస్తున్నాను . ఏమీ అనుకోకు , ఎందుకంటె నేరం నారదుడిది .( Postal Delay )
మీ భూమి మీద నా బిడ్డలు ( మీ ప్రజలు)
ఇక్కట్ట్లు పడుతున్నరని వ్రాసావు .
ఇందులో విశేషమేముంది .
మీ మీ కర్మ ఫలాలు అనుభవించటానికే
మిమ్మల్ని ఆ కర్మ భూమి యైన భరత వర్షంలో సృష్టించాను
భూమి మీద అకృత్యాలు కలియుగ ప్రభావమేయైన ఇంత రాక్షసత్వమా?
త్రేతాయుగ , ద్వాపర యుగ రాక్షససులనే మించి పోయారే
నరులై యుండి కౄరత్వంలో నా అవతారాన్నే (నర సింహము) మించిపోయారే.
పూర్వ కాలంలో మోక్షం కోసం తపస్సు చేస్తే
ఇప్పుడు మీరు ముల్లె ( ధనం ), మగువ, మద్యం కోసం తపిస్తున్నారే
గాలి ,నీరు, నిప్పు,నేల ,నింగి సృజించి
సమ తుల్యం పాటించి సామరస్యంగా గా బ్రతకండని చెప్తే
అభివృద్ధి మాటున పంచ భూతాలను కకావికలం చేసి
స్వచ్చ మైన గాలి నీరు లేక రోగాల బారిన పడుతున్నారు.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురుతెన్నులు చూసి ఎందుకు బా ధ పడతారు.
యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ః
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్"
అని వక్కణించిన నేనే చెప్తున్నాను
ధర్మో రక్షతి రక్షితః
వృక్షో రక్ష్తతి రక్షితః
అను వాక్యాలు తు.చ. తప్పకుండ పాటించడి
సద్ధర్మ సమాజం సాధించండి
లేకుంటే నా పునః సృష్ఠే కాదు
అసలు సృష్ఠే ఉండదు.
తస్మాత్ జాగ్రత్త
ఇట్లు
సృష్టి కర్త
C/Oవిశ్వం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి