13, అక్టోబర్ 2011, గురువారం

స్నేహితుల దినోత్సవము సందర్భముగా స్నేహము గురించి


సీ.   

     ఏ చెల్మినా శించి ఇంద్రుడు కాతర తక్షకు ప్రేమతో రక్ష సేసె / 

     ఏ నెయ్యమర్కజుఁ డెంచి యవనిజాత నరయించి చెలికాని యార్తి బాపె /

    ఏ కూర్మిచే శౌరి యాకుచేలుని కౌగిలిపరవశించెనో లేమితొలఁ గ /

    ఏ నెయ్యమును కోరి కానీను కౌరవుండంగదేశమునకు నధిపుఁ జేసె //



 తే గీ.  నట్టి చెలిమికి లేవులే యెట్టి జాతి /

       భేదములు ఖేదమోదాదిభిన్న దశలు /

       కలిమిలేముల విడువక కలసి  మెలగి /

       యుండు వారెపో మిత్రులీ యుర్విలోన 


మిత్రులందరికి శుభాకాంక్షలు