27, జులై 2023, గురువారం

 

సమస్య పూరణ .


రామ పత్నిని మ్రుచ్చిలె రావణుండు /

కపివరు లు మీరు వెస  వెదకంగఁబొండ /

వాచి ప్రాచి యుధీచి ప్రతీచి దిశల /

నీవును మరియునీవును నీవు నీవు 


ఆ.వె 


రామ పత్నిని మ్రుచ్చిలె రావణుఁ డనె /

తరణిజు డు ; కీశులార వెదకఁగ ఁ బొండ /

వాచి ప్రాచి యుధీచి ప్రతీచి దిశల /

నీవును మరియునీవును నీవు నీవు .

18, జులై 2023, మంగళవారం

 సమస్య :


"పతికి గర్భ మాయె సతిని గవయ" ( కోమలరావు ) 


అవధానుల పూరణ .


ఆటవెలది .

పెండ్లి జరిగె నాడు పెద్దలందరు మెచ్చ /

వరుడు మోదమందె వధువు  గూడి /

అతివ చెప్పె గడచె యాఱైన నెలలని/

పతికిగర్భమాయె సతిని గవయ . ( శ్రీ సుసరాపు చంద్రశేఖర్ శర్మ గారు


ఆటవెలది

కాంక్ష దీర జరిగె కళ్యాణమానాడు/

కలియ రెండు మదులు కమ్ర గతిని/

వంశ కీర్తి నొంద వాసిగా మేటి భూ /

పతికి , గర్భ మాయె సతిని గవయ . (రంప సాయి కుమార్ )



నాపూరణ : 


కొడుకు లేని బ్రతుకు కొఱగానిదనుచును /

శివుని కొరకు తపము చేసె నిష్ఠ / 

కొడుకు కావలె నని కోరనా పార్వతీ /

పతికి ;గర్భమాయె సతిని గవయ .




కొడుకు లేని బ్రతుకు కొఱగానిదనుచును /

తపము చేయ శివుడు తారసిల్ల /

కొడుకు కావలె నని కోరఁగ పార్వతీ /

పతికి ;గర్భమాయె సతిని గవయ .



కవయు = కలియు 

10, జులై 2023, సోమవారం

 

కెనడా 

పంట వలంతి శిరంబున సీమంతంబు సరణి 

టొరోంటో నగరమ్ము కెనడాకు ఒప్పుమీరె 

రహదారులన్నియు రమణీయ రంగులీనుచు రాణనొప్పె 

ఎన్ని వాహనములున్న (నిసుమంతధ్వని కాలుష్యమ్ము హుళక్కి .

పాదచారులకు వికలాంగులకు పెద్దపీట వేసె 


విశాల పణ్య ప్రాంగణములు చూపరులకు  వింతగొల్పు 

వస్తు ధరలేమొ వినఁగ విస్తు గొల్పె / జాస్తిగుండె 


పణ్యాంగణ మధ్యంబున కలవు సూచికా ఫలకంబులు 

సులువుగా వస్తువుల కొనఁగ మార్గములు చూపు 


నగర మధ్యంబున పచ్చని నగములు కనగనయ్యె / కాననయ్యె 

 టొరోంటో పుర సుందరి పచ్చని చీర కట్టినట్టు 


ఎచట చూచిన పసందైన భోజన శాలలే 

రంగు రంగుల విద్యుద్దీపాల కాంతులే 

సోయగాలు చిందు నగరవీథులు  సంతోష మొదవ జేయ 

సొమ్ములున్న ను చాలు సోకులకేమి కొదువ యనరే 


మత్స్య ప్రదర్శన శాల వీక్షణంబు (Acuarium) 

మిక్కిలి సంతోషదాయకంబు 

అభ్రంకషాయిత టీవి శిఖరంబు 

చూడ గ్రీవా క్లేశ కారణంబు 



అట్టావా పయనము : 


వాహినీ ప్రవాహములా వాహన సముదాయము 


నాగుపామువలె  మెలికలు తిరుగు నేషనల్ హైవే కి

రెండు వైపుల పచ్చనిఎత్తైన  చెట్లు 

 పచ్చదనము జూచి కనులకు కలుగు  మిరుమిట్లు


రిడావ్ అట్టావ్ నదుల సంగమ స్థలము 

అట్టావ పుటభేదనమ్ము  కెనడా  రాజధానిగా యొప్పె 


కెథడ్రల్ ఆకారములో కెనడా పార్లమెంట్ 



కొలోనియల్ కాలమునాటి పాలనకు నిదర్శనంబు 


నగరము మధ్యలో నౌకల ప్రయాణము 

చూచువారి కనులకు కలిగించు వినోదము .




నయాగరా 


శివుని శిరమునుండి గారు చదలేఱు 

క్రిందికిజాతునురగల జల పాతము 

గంగవలె చిందులు త్రొక్కు నయాగరాను

ఎంతని పొగడనుసొగసు ఏమని చెప్పను 



కెనడా అమెరికాలను  విడదీయు జల ప్రవాహం 

రెండు దేశాలకు పసందైన పర్యాటక కేంద్రము 


ఈరి నది మాతృకగా నయగరా పయనం 

జలపాతమై లేక్ ఒంటారియా లో కలయిక 


మద్యాహ్నపు వేళ మార్తండుని రశ్మి సోకి వెండి వోలె 


తళ తళ మెరయు జలోపరితలము వింత గొలుపు 


ఆకాశ వీథిలో విహరించు జల విహంగాలు 

పోటీ పడి పై కెగయు జల పాత శీకరాలు 


ఆకాశ వీథిలో పక్షుల కోలాహలము 

నేల మీద ప్రేక్షక జన సందోహము 


ఆకుపచ్చ రంగులీనుచు అలరారు ఉదృత జలం 

పొంగులు వారుచు క్రిందికురికి చేరు నొంటారియో తటాకం 



బండ మీఁద పక్షులు కూర్చుండె . 


కాళ్ళు పీకి బల్లల మీద కూర్చుండె జనం


ఎంత మాటకారులనైనా నోరు

మూయించు నయాగరా హోరు 

---------