8, మార్చి 2022, మంగళవారం



 dfd2d61d-00a5-4dda-ba6b-53dd31d63204.jpeg



ఆ. 

అమ్మ ,చెల్లి, యాలి, అక్క యౌ మగువను /

మనిషి మరువ రాదు మనమునందు /

శక్తి   వోలె యింట సకల రూపములెత్తు /

ఆది శక్తి యతివ యరసి చూడ.



డా. కోమలరావు 

7, మార్చి 2022, సోమవారం

 రష్యా పై యుక్రెయిన్ సాహసము 


తే. 

తన బలమెరిగి తలపడ తప్పుకాదు  /

ఎదిరి  శక్తి నరసి పోరు టెందు నీతి /

పరుల మాట నమ్మి పగర పై కరుగట  /

పాడి కాదు ప్రపంచాన ప్రభువు కెపుడు .


తే. 

*కర్ణు*  బలముజూచియ కాదె *కౌరవాగ్ర* 

జుండు తొల్లి రణములోన పాండు సుతుల 

పోరె ; నవ్విధి   *జెలనస్కి*  పోరె నేడు

రష్య తోడ *వెస్టు* బలము లావు జూచి 



-డా. కోమలరావు 19/3/2022 


-డా. కోమలరావు 8/2/2022

3, మార్చి 2022, గురువారం

 భార్య 


ఆ.వె 


భార్య భారమనుచు భావించకెప్పుడు/

కష్ట సుఖము లందు  కలసి యుండు /

విధి యొసంగి నట్టి    ప్రియ వయస్య పతికి /

ఆధి వ్యాధు లందు నౌషధంబు.



డా. కోమలరావు బారువ  11/9/2021