ధనం – ఇంధనం 6/5/2011
ధనం లేకున్న కదలదు బ్రతుకు బండి
ఇంధనం లేకున్న కదలదు ఇంజను బండి
ధనమూలమిధం జగత్తు అన్నారు ఆనాడు
ఇంధనమే అన్నిటికి కీలకమన్నారీనాడు
ధనం దండిగా ఉంటే వచ్చి చేరు బందువుల్
ఇంధనంనిండుగా ఉంటే పెరుగు వాహనముల్
ధనం కొరకు జరిగాయి యుద్ధాలు ఆనాడు
ఇంధనంకొరకు యుద్ధాలు జరుతున్నయీనాడు
ధనం నకు మనిషి బానిసైనాడేనాడో
ఇంధనం నకు మనిసి బానిసైనాడీనాడు
ధనం ఎక్కువైతే పెరుగు దుర్య్వసనాలు
ఇంధనం ఎక్కువైతే పెరుగు వాయు కాలుష్యాలు
ధనం విలువ రాను రాను శూన్యం
ఇంధనం విలువ పోను పోను అనూహ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి