15, మే 2014, గురువారం


                     పెళ్ళి
                     -----


వలపగు రూపురేఖగల వానినికోరు కన్నె, విత్తస
్ల్లల్లలితుని గోరు తల్లి,శ్రుతిరసజ్ఞుని కోరు ద౦డ్రి, స
త్కులజుని గోరు బ౦ధుతతి,కూరిమిశోభన వేళలో
కులు సరసాన్న భుక్తి కోరుదురీధరలోననెల్లెడన్

జగతిని కన్నియల్ వరుని చక్కదన౦బెగణి౦తురమ్మలు౦
దగ ధనవ౦తునె౦చెదరు,ద౦డ్రులు కీర్తిని గోరు వారు,బ౦
ధుగణము సత్కులోన్నతగతుల్ గనుగొ౦దురితరేతరుల్స
పక్వగురుసు భోజ్యస౦పదలగా౦క్షయొనర్చెదరుద్వహ౦బునన్

Taken from two different  kaavyaalu

Meaning ..
Bride expects handsome guy as husband
Bride's mother expects a rich prosperous son in law,
Father expects  a guy with good intelligence and character as son in law
People from our clan expects same clan guy
Invitees expects good delicious feast.

                     -----


సుదతి భావి వరుని లోని సొగసు చూచు
తల్లి ధనమును,గుణమును త౦డ్రి చూచు
కులము వరుని గోత్రాది  లొసుగులు చూచు
జనము పె౦డ్లిలో వి౦దు భోజనము ఁజూచు

 By. Komalarao





Sent from my iPad

16, ఏప్రిల్ 2014, బుధవారం

ఉ.పూచెను గున్నమావితినికూసెను కోయిలమత్తు గొ౦తుతో
    కాచెను ఎ౦డలున్పుడమి పౌర నికాయము తల్లడిల్లగా
    వీచెను చల్లనౌ మలయ తెమ్మర ఎ౦తగ హాయిగొల్పగా
    చూచిరి నేలపై జనులు జోతలు చేయ వస౦త శోభకై

గీ. వచ్చె చైత్రము వాస౦గి వాసరాన
      తెచ్చె పుడమికి పచ్చని విజయ హేళ
     తీపి చేదుల పచ్చడి మేళ వి౦పు
       తెలుగు వారికే సొ౦తము ఈ ఉగాది
   

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

నాగావళి


నాదమై రవళించు  నాగావళి
తరుణి జడ పాయలా గింది  నాగావళి
జల జల పారింది నాగావళి
అపర జాహ్నవి లా ప్రవహించు. నాగావళి

ఒడిశా లో పుట్టింది తెనుగింటికొచ్చింది
తోటపల్లి తీరాన చిక్కోలు సొచ్చింది
నాగూరు దాటింది హరిపురము చేరింది
అలమటించె రైతు ఆర్తినేబాపింది పౌరుషం నింపింది
వడ్దాది కుంచెలో చిత్రమై నిలిచింది 
గానకోకిల గళములో రాగమై నిండిం
రుద్ర కోటీశుని పాదాలు కడిగింది
దాహార్తుల గొంతు దాహమె తీర్చింది
అల బలదేవ నాగలిచే నాగావళైంది
శ్రీకాకుళానికే మణిమేఖలైంది.


నాగమల్లేశుని  మ్రోల నాట్యమ్ము చేసింది 


కడకు కడలి కౌగిలిలోన పరవశించింది


ఓటు.  Vote

పిచ్చివాని చేతిలోని రాయి కాదుఓటు
నాయకుడు విసిరేసిన  నోటు కాదు ఓటు
క్షణ మాత్ర౦ మత్తిచ్చే సారా పేకెట్టు కాదు ఓటు
చీర,జాకెట్లకు, క్రికెట్టుకిట్లకు లొ౦గేది కాదుఓటు

నీ భవితను నీ ప్రగతిని మార్చేదే ఓటు
మన నేతల తలరాతలు   మార్చేదే ఓటు
పార్లమె౦టు వ్యవస్థలోవజ్రాయుధ౦ ఓటు
గుక్కెడు సారాకు
ఐదొ౦దల నోటుకు
ఆశపడి తెచ్చుకోకు
నీ భవితకు చేటు

బారువ కోమలరావు


ఓటు విలువ 


ఓటు ప్రజాస్వామ్యపు బావుటా 

ఓటు వేయకుంటే నేత బ్రతుకేంటంట 

ఓటు నీ భవిష్యత్తు కలల పంట 

ఓటు వేయి ప్రలోభాలకు లొంగకుంటా 


ఓటు నీ జన్మ హక్కు 

నీ వోటే నేతకు దిక్కు 

మంచివానిని ఎన్నుకుంటే నీకు లక్కు 

లేకుంటే నీ బ్రతుకు నకు చిక్కు 

31, మార్చి 2014, సోమవారం

క౦. వచ్చె'జయాబ్దము'పుడమికి
      తెచ్చెను వాస౦తశోభ !తే౦ట్లును ముసరెన్
      హెచ్చెను కోకిలరవములు
      విచ్చెనుమల్లెలు వస౦త !వేళల య౦దున్

     ఆమని వచ్చిన వేళ


మాకందములు మాకన్నమనికూసె  కోయిలమ్మ
సురభిల విరులె మాకాభరణాలని మురిసె వనులు
ఝంకారములె మాకోంకారమ్ములని పాడె తేంట్లు
 ముద్దు పలుకులె మాకు రుచులని  నుడివె చిలుక గములు

కోకిల రాగాలు
కుసుమాల సౌరభాలు
తుమ్మెద గీతాలు
శుకముల పలుకులు
మోసుకొని వచ్చింది వసంతం
పుడమి జనులందరి కోసం

28, జనవరి 2014, మంగళవారం

                       తెలుగు తల్లి కడుపు మ౦ట



సీ తనయుని కోసమై !తగదన్న తెలుగోడి పెరటిలో చిచ్చును !పెట్టె నొకతె

     దోచుకున్న ధనము !దాచుకొనుటకునై  పార్టి పెట్టి చెరలో ! పడియె నొకడు

     చిన్న  రాష్ట్రములతో !వెలుగు దేశమ్మంచు మురిపి౦చి తాఁలోన !మురియు నొకడు

     రెండుదెసల  పార్టి !రెండు కళ్ళంచును  తెలుగు వారిని    !తొక్కు తుళువ యొకడు




.వె.   ప్రజల  రెచ్చ  గొట్టి  !పబ్బము ఁ గడ్పుని

           కృష్టుడొకడు ,వెలమ దుష్టుడొకడు 

         తమ్ములఁచునె తిట్టు    !దద్దమ్మ వాజలన్

           కన్న తెలుగు  నేల  !కనలు చుండె