21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మను చరిత్ర

అంకముఁజేరి శైలతనయా స్తనదుగ్ధములానువేళ బా/
ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలిచన్ కబళింపఁబోయి యా/
వంకఁగుచంబుఁగానకహివల్లభ హారముఁగాంచి వే మృణా/
ళాంకురశంక నంటెడుగజాస్యునిఁ గొల్తునభీష్ట సిద్ధికిన్
.


చంపకమాల

అరయ నభేదరూపధరులౌ తలిదండ్రుల మ్రోల బాల్యమం/
దురమున నొక్క వంకఁగుచ మొక్క యెడ న్ఫణిహారము/
న్బరువడిఁజూచి మౌగ్ధ్యమున భవ్య కపిత్థ మృణాల శంకచేఁ/
గరమటుసాచు విఘ్నపతిఁగొల్తుఁమదీయ అభీష్ట సిద్ధికిన్.

---------
గరమటు సాఁచు విఘ్నపతి గావుత సత్కృతి నాథు నిత్యమున్.

స్వరుచి. వేట


1)
శా.
మట్టెల్ మ్రోయఁగ గబ్బిచన్నుఁగవ కంపంబంద వేణీభరం/
బట్టిట్టై కటిఁజిమ్మచీకటులు గా నశ్రువ్రజంబోడిక/
ల్గట్టన్ జూపులు చిమ్మరేఁగి దివి రోలంబాళిఁ గల్పింపఁగా/
మిట్టాడంగనరుండు లేనియడవిన్ మీనాక్షి దీనాకృతిన్.
Voice 001

గబ్బి= నిక్కినది, గర్వము
మిట్టాడ= తిరుగాడుటకు. మిట్టు= ఎగురు, కదలిక

2)
శా.

ఓ రాజన్య మహేంద్ర యో మణిగణప్రోతాసి వాతాశనా/
ప్రారజ్యత్కటిచక్ర యో ముఖరశార్ఙ్గ క్రూర బాహార్గళా/ 9 విశేషణాలు
యో రుక్మాచలకల్ప యో కవచితవ్యూఢాంగ కావంగదే/
యో రాహుత్తశిరోమణీ నిరవధిప్రోద్యత్ప్ర తాపారణీ.
Voice 002

ప్రారజ్య= ప్రకాశిస్తున్న, ముఖర= ధ్వని,క్రూర= కఠినమైన, వ్యూఢాము=దాల్చిన

3)మనోరమ వర్ణించిన రాక్షసుడు

సీసం

విసుమానములు గాఁగ వసతోడఁ బెనవెట్టి! నెట్టెంబుగాఁ బ్రేవుఁజుట్టినాఁడు/

బండికందెనచాయ బైసిమాలిన మేన! మెదడుగందపు రొంపి మెత్తినాఁడు/

కునఖంపుడాచేతి పునుక కప్పెర నిండఁ ! బ్రాణికోటుల నల్ల బట్టినాఁడు /

కొకిబికి వేసంపు గూనిమూఁపుల మీద! మూఁడు పంగల యీఁటె మోపినాఁడు//

నిట్టతాడనఁ బొడవుచే నిక్కి నాఁడు/
నిడుదకోఱలమిడిగుడ్ల నెగడి నాఁడు/
నరవరోత్తమ నేఁడుమూనాళ్ళ నుండి /
యుసుఱు గొన వెంటఁ దిరిగెడు నసుర యొకఁడు.
Voice 003

విసుమానములు= ఎగుడుదిగుడు,వస= ఒక రకమైన క్రొవ్వు.
నెట్టెము= గుండ్రముగ,
బైసిమాలిన= సొంపు లేని యొడలు,
కునఖంపు=పుప్పి గోళ్ళు,కొకిబకికి=వికృతరూపము,

" అస్త్ర హృదయ విద్య " పినాకపాణి>స్వాయంభువు>వశిష్ఠునకు>మాతాతకు>మాతండ్రికి> నాకు

4)

మహాస్రగ్ధర. (సతతనసరరగ)

గళగర్తక్రోడ నిర్యత్కహకహనినదోగ్డాఢ హాసంబుభూభృ/

ద్బిలముల్ మ్రోయింపఁ గాదంబినిగతిని బొగల్ వెంప మిన్నెల్ల మైగాఁ ,/

జలితాస్యక్రూరదంతక్షత రదన వసన క్షారకీలాలవేల్ల/

జ్జ్వలన జ్వాలాభ జిహ్వాంచలుఁడగుచు గదన్ జాళెముల్ ద్రిప్పుచున్.
Voice 004


క్రోడ= అంతర్భాగము,జాలెము= గుండ్రముగా


5)

నింగి నొరయు రాకాసి మన్నీనిమేని/
నీడఁ జీకటిఁ గొనె నవనీతలంబు/
చంద్రికలు గాంచె నట్టహాసముల వెడలు/
నిశిత దంష్ట్రల చే నవనీతలంబు.
Voice 005


6)

పంచచామరము. (జరజరజగ)

పలాశి డాశి రాజుఁ జూచి పల్కె నోరి నోరి కీ/
పొలానఁబెన్పొలానలేకపోవ నీవు దోఁచి తౌ/
బలా బలాలి తోడఁ బాలఁ బట్టి బిట్టు చుట్టి నిన్/
హళాహళిన్ హలాహాలాభ యౌ బుభుక్షఁదీర్చెదన్.
Voice 006

ఆనన్= తినుటకు
హళాహళిన్ = ఆత్రముతో

7)

నీడఁ గడవఁ బాఱ నేలకు వెలిగాఁగ/
నడుగు వెట్టి తిరుగ నాత్మ మొఱఁగి /
యొకటిఁ దలఁప నరుల కొదవ నొదవదే/
కరణి మృత్యుదేవిఁ గన్నుఁ బ్రామ.
Voice 007

ఒదవినన్= దొరకినను, ఒదవదు= సామర్థ్యముండదు.


ధైర్య గుణం.


8)

సీసం

గళితశృంఖల మైన గంధనాగమువోలెఁ! బ్రజలపైఁబేరెముల్ వాఱి పాఱి/

కలశాబ్ధి మథియించు కైటభాంతకలీల! జవమొప్ప జేతులుసాఁచి చాఁచి/

కనలూను కీనాశ కాసరమ్మును బోలెఁ ! గమిచి తట్టువగుంపుఁ జమరి చమరి/

యమృతాపహరణార్థ మరుగు పక్షిస్వామి! గతిఁ బుళింద శ్రేణిఁ గమిచి కమిచి/ కమిచి= మ్రింగి


సెలవులు బిగించి నేత్ర దంష్ట్రికలు మెఱయ/

నిడుదమొగమెత్తి మీసల నెత్తు రొలుకఁ/

బటబటఁ గపాలపంక్తులఁ బగుల గొఱికి/

బలము నెల్లను గడియలోపలన మ్రింగె.
Voice 008


9)
లయవిభాతి. ( నసననసననసననసగ)


ధగధగని దేహరుచి నిగనిగని కుందనపుఁ ! దగడుఁ దెగడన్ జిగురుజిగినెగచు మోవిన్/

నగవు నిగుడన్ గురులపొగరు మగుడన్ నయన! యుగళి వెలిదామరల మగలమగలై డా/

లెగయ మృగనాభిభుగభుగ లెసఁగ జామరలు! మగువ లిడ మౌళిమణి మిగులఁగ వెలుంగన్/

దెగలు గలహారములజిగి చెలఁగఁగా గొదమ! మొగులఁ దగుయానమున గగనచరుఁడయ్యెన్/
Voice 009
తగడు= బంగారపు ఱేకు,
తెగలు= పొడవైన ,

10)


ఆయుర్వేద చికిత్స

కాయ చకిత్స,బాల చికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, దంష్ట్రా చికిత్స, జరా చికిత్స, వృష చికిత్స, -- 8 అంగాలు

రాక్షసుడవు కమ్మని శపించాడు.
నీ కుమార్తెను మ్రింగబోవ , నొకానొక మహానుభావుని బాణవహ్ని జ్వాలలచే నీ యసుర దేహము దహించుకొని పోవ దివ్యరూపమును పొందెదవు.


ఇందీవరాక్షుడు స్వరుచిని మేరుపర్వతంమీదనున్న తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి మనోరమనిచ్చి పెండ్లిచేసెను.

11)
సూర్యాస్తమయం

మత్తేభము


వికసిల్లం బ్రజ చక్రపాలనము గావించెన్ గరవ్యాపృతిన్/
కకుబంతంబుల నాక్రమించెఁ బొసఁగంగానేర్చె వర్ణాళిఁగాం/
తికిఁ బాపెన్ బెరరాజకోటిఁ దుదిశాంతిన్ బొందె దైవంబు సే/
తకుఁ దాపంబిఁక నేలనంగ నినుఁడ స్తప్రాప్తుఁడయ్యెన్ గడన్..
Voice 010

ఇనుడు = సూర్యుడు/రాజు

సూర్యుడు ప్రజలనే చక్రవాకములువిలసిల్లగ మహీతలమును తన కిరణాలతో నాక్రమించి, ఒక్కటైన శ్వేతవర్ణాన్ని పెక్కు రంగులుగా విభజించి, చంద్రుని యొక్క ( రాజు) కాంతిని బాపి సాయంకాలానికి వేడి తగ్గి, అంతా దైవలీలగా తలంచి సూర్యుడు అస్తమించాడు.

రాజుపరముగ

రాజు జనులు విలసిల్లగ భూమిని పరిపాలించి తన చేతులను
దిక్కుల అంచులవరకువ్యాపింపజేసి ఆక్రమించెను.వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి,శత్రు రాజులకాంతిబాపి, చివరకు దైవలీలకు శాంతింబొందెను. అనగారాజు మృతినొందెను.

12)


అక్కట నాయెడన్ మిగుల నక్కఱ గల్గి చరించు నెచ్చెలుల్/
చిక్కి మునీంద్ర శాపహతిఁ జెంది దుర్దమ రోగబాధలన్/
బొక్కుచునున్నవారు వనభూములఁ దద్దశ మాన్పవేని నా/
కెక్కడి సౌఖ్యమన్నఁ దరళేక్షణఁజూచి స్వరుచియిట్లనున్.
Voice 011


మననోరమ తన చెలికాండ్రను శాపవిముక్తలను చేయమనుట.

మందారుడను విద్యాధరుని కుమార్తెను,
విభావసి నా పేరు .
మృగపక్షి జాతుల భాషలు వచ్చును.

కళావతి - పారుడను బ్రహ్మర్షి కుమార్తెను.
పారుడు+ పుంజికస్థల.
• పద్మ అను విద్య తెలిసినదానను.

దేవాపి అను ఖేచరుడు

13)

గంగాతరంగిణీ రంగత్తరంగశీ!కర శీత సైకతోత్కరములందు/

మందారమాకందమకరంద తుందిలేం!దిందిరానంద కృన్నందనములఁ/

గాంత నిశాకాంతకాంత వితర్దికా! క్రాంత భూభృద్బృంద కందరముల/

మసృణ బిసాహార మాంసల హంసికా! సంసదాసార కాసార తటులఁ/

దమక తమక ప్రియుండని తమక మెసఁగఁ/
బడఁతు లుప్పొంగఁ గ్రీడించెఁ బద్మినీ ప్ర/
భావ ఘటితాన్నపాన్న భూషావిశేష/
మాల్య వస్త్రానులేప సామగ్రిఁ జెంది..
Voice 012

తుందిల=మదించిన, ఆనందకృత్= ఆనందాన్నిచ్చే, మసృణ= మృదువైన,

సంసద్= ప్రోగుల యొక్క,

14)

అరవిందాక్షులుఁ దాను నిట్లభిమత వ్యాపారముల్ సల్పుచున్/
ధరణీశుండొక చోటఁ గాంచె లఘుశీత స్వచ్ఛ వాఃపూరమున్/
వరకీరవ్రజ చంచుపాటిత తట వ్యాకీర్ణ మందార కే/
సర మాకందవినిస్సరిత్ఫల రసాసారంబుఁ కాసారమున్..
Voice 013

వినిస్సరత్= ఎక్కువగా కారుచున్న

15)

అందొక యంచలేమ గహనానిల సంచలదూర్మి మాలికా/
మందవిహార సౌఖ్యమున మత్తిలి దవ్వులనున్న చక్రవా/
కిం దగఁ జేరఁ బిల్చి పరికించితె యెంతతపం బొనర్చి రీ/
యిందు నిభాస్యలుం పతియు నేకమతిన్గవగూడి యుండఁగాన్..
Voice 014

-----
చక్రవాకి సమాధానము
ఒకనికి చాలమంది సుందరులయందును, చాల మంది సుందరుల యందు
ఒక్క పురుషునికి ప్రేమ యుండుట కష్టము.కావున వీనీయందు ఈ సతులకు గాని, ఈ సతులయందు ఈతనికి గాని యెం మాత్రం ప్రేమ యుండదు.


16)

పలుకులు వేయు నేమిటికి భాగ్యసమన్విత నీన మద్విభుం/
డిలఁ గలధన్యుఁడంచు నెలుఁగెత్తి వరూథినిపట్టి ముందటన్/
బలుకు రథాంగమానవతి పల్కు లతండిల జంతుమండలీ/
విలసదశేషభాషలఁ బ్రవీణుఁడు గాన నెఱింగి సిగ్గునన్..
Voice 015


తరువాత 100 సంవత్సరాలు ముగ్గురు భార్యలతో సమానంగా మసలుకొని.

ఒకసారి ఉద్యానవనం లో

17)
మగలేడిని చూస్తాడు

కాంచెన్ భూవిభుఁడొక్కనాఁడు కనకాఖర్వ ప్రభామంజులా/
స్యాంచన్మేచకరత్న విభ్రమ సనాథానూన దృగ్రోచులన్/
మించుంబ్రాయపులేటిపిండు తనుఁ గూర్మిం జుట్టిరాఁ దద్వనో/
దంచద్భూమిఁజరించు నొక్క హరిణోత్తసంబు నింపారఁగాన్..
Voice 016

సనాథ= కూడిన
18)

మగలేడి ఆడలేళ్ళతో

హుంకారంబొనరించి వే తలఁగుఁడోహో నేను స్వారోచినే/
పంకేజాక్షులతోడ నెల్లప్పుడు దర్పస్ఫూర్తిఁ గ్రీడింప ల/
జ్జాంకూరంబడఁగించినారు తలపోయన్ నాకు రోఁతయ్యె మీ/
రింకన్ బోయి వరింపుఁడొక్కరుని భోగేచ్ఛన్ నివారించితిన్.
Voice 017



పెక్కుమందితో సంగమించేవానికి ఇహముపరములందున మేలు జరుగదు.


19)


అరయ నిట్టి రోఁతలకు నాలయముల్ జలజాక్షు లేటికిన్/
వీరలతోడిసంగమింక వీడెద నంచు దలంచి తోన దు/
ర్వారములై న కోరికలవంక వివేకము చొప్పు దక్కియిం/
పారఁగ నాఱు సురహోయనముల్చరించెఁ గ్రమ్మఱన్.
Voice 026



600 సంవత్సరాలు సుఖ జీవనంచేసి,స

మనోరమయందు విజయుని,
విభావసి యందు మేరునందనుని,
కళావతి యందు విభావసుఁడను( ప్రభాసుడ) పుత్రులను పొంది, ఒకనాడు వేటకు వెళ్తాడు.

20)

శాసిత శత్రుఁ డానృపతిచంద్రుఁడు తూణధరుండు సజ్యబా/
ణాసన పాణిపంకజుఁడు నై మృగసంఘములెల్లఁబెల్లు సం/
త్రాసము నొందఁ గ్రూరతనరణ్యమునన్మృగయా కుతూహో/
ల్లాసమునన్ జరించెఁ జలలక్ష్య విభేద విధావథానుఁడై.
Voice 018

తూణ= దొన
21)


సీసం

జంభారి భిదుర సంరంభంబు వీక్షించి! జరుగునంజన మహాశైలమనఁగ/
ఝఁఝాప్రభంజనాస్ఫాలనంబున కుల్కి! యరుగు సంవర్తకాలాభ్రమనఁగ/
గఠినకంఠేకాల కంఠమూలము పాసి! వెస వచ్చునుజ్వలక్ష్వేళ మనఁగ/
గలుష ధూర్వహఖలోత్కరముపైఁ బఱతెంచు! దండధర క్రూరదండమనఁగ/

తే.గీ

ఘుర్ఘురారావ సంఘాత ఘూర్ణమాన/
సప్తపాథోధి పాథః చండ నక్ర/
తిమితిమింగల మగుచు నభ్రము మహియుఁ/
గ్రమ్ముకొని వచ్చునొకయేకలమ్ముఁగనియె..
Voice 019



22)

కని మౌర్వీ నినదంబు సేయుచు భుజంగ క్రూరనారాచమున్/
దనదోర్దండ కృతాంతదండనిభ కోదండంబునం గూర్చి బో/
రన నేయన్ దమకించుచుండ నొకసారంగాంగనారత్నమ/
జ్జననాథాగ్రణిఁజేరి పంచజనభాషా ప్రౌఢిమై నిట్లనున్.
Voice 020


బోరన= వేగంగా, తమకించుచుండన్= తొందరపడుచుండగా,

స్వరుచి. వనదేవతను నాల్గవ భార్యగా పొందుట
23)
స్వారోచి


కాంచెన్ బుత్త్రు విశాలవక్షుఁ బృథువక్షఃపీఠి విభ్రాజితున్/
బంచాస్యోద్భట శౌర్యధుర్యఘనశుంభద్బాహుఁ దేజోనిధిం/
బంచాస్త్ర ప్రతిమాను మానఘను సామ్రాజ్యైకహేతు ప్రభూ/ అరవిందము,అశోకము,మందారము, చూతము,
తాంచల్లక్షణ లక్షితున్ సుగుణరత్నానీకరత్నాకరున్.. నీలోత్ఫలము
Voice 021


24)

నీలమేఘముడాలు డీలుసేయఁగఁ జాలు! మెఱుఁగుఁజామన చాయ మేనితోడ/
నరవిందములకచ్చులడగించు జిగిహెచ్చు! నాయతంబగుకన్ను దోయితోడఁ/
బులుఁగురాయని చట్టుపల వన్నె నొరపెట్టు! హొంబట్టు జిలుఁగు గెంటెంబు తోడ/
నదయార్కబింబంబు నొఱపు విడంబంబు! దొరలంగ నాడు కౌస్తుభముతోడ /

జయజయ ధ్వని మౌళి నంజలలు సేర్చు/
శర్వ శతధృతశతమన్యు శమన శరధి/
పాలకైలబిలాది దేవాలి తోడ/
నెదుటఁ బ్రత్యక్షమయ్యె లక్ష్మీశ్వరుండు..
Voice 022

అచ్చు= అతిశయము
చట్టుపల వన్నె = పక్షముల రంగు, నొర= సమానము,
గెంటెము = జమిలి నేతబట్ట


25)

కవిరాజ విరాజితము. ( నజజజజజజవ)


జయజయ దానవ దారణ కారణ శార్ఙ్గరథాంగ గదాసి ధరా/
జయజయ చంద్రదినేంద్ర శతాయుతసాంద్ర శరీర మహఃప్రసరా/
జయజయ తామరసోదర సోదర చారుపదోఙ్ఝిత గాంగఝరా/
జయజయ కేశవ కేశినిషూదన శౌరి హరీ దురితాపహరా/

తామరసఉదర= తామరపుప్వులోని ఎఱ్ఱని ఎరుపునకు,
సోదర= సమానమైన ,
పద= పాదములనుండి,
ఉఙ్ఝిత= వదలబడిన
Voice 023


26)


కోరిక నీ స్వారోచిషు/
చారిత్రము వినిన వ్రాయఁ జదివిన ధనధా/
న్యారోగ్య పుత్త్రవంతులు/
నై రూఢిగఁ గంద్రు పిదప నమరత్వంబున్..
Voice 024


ప్రవరుని శీలము

వరూథుని లాంటి మోహము

స్వరుచి వంటి రాజు




8, ఫిబ్రవరి 2018, గురువారం

చెట్టు ఆవేదన     ( ముత్యాల సరాలు)

విత్తు నందున ఉండు దానను
సృష్టి ఆదిన బ్రహ్మ యట్లుగ
తపము చేసిన బ్రహ్మ యనంగ
ఆపము గ్రోలి పాదపము నై

చిన్ని యాకులాచ్ఛాదములు గ
చిన్ని సుమములె కలాపములుగ
పెరుగు చుందును పృథివి యిల్లుగ
ఫలము లిత్తును పుడమి జనులకు

అహము లందున మీరు వదలిన
గాలి పీలిచి నేను బ్రదుకుదు
నిశల యందున ఉసురు నిల్ప
మంచి గాలిని మీకు నిత్తును

చిన్న తనమున పలక నౌదును
పెరుగు వయసున పేప రౌదును
పొలము దున్నగ హలము నౌదును
బరువు మోయగ బండి నౌదును

మీరు ఉండగ గూడు నిత్తును
నిదాఘ వేళ నీడ నిత్తును
మీదు నిద్రకు మంచ మౌదును
అంత్య దశలో పాడె నౌదును

పరుల హితమును కోరు కొందును
వంట చెఱకై కాలి పోదును
యజ్ఞ మందున సమిథ నౌదును
చతుర్థములకు   మూలమౌదును


ఇన్ని చేసిన ఏమి కోరను
నన్ను పెంచి మీరు పెరుగుడు I
నన్ను కరుణతో మీరు బ్రోవుడు
భువిని మీరు శుభము బ్రతుకుడు