31, మే 2021, సోమవారం

 


నిజమైన తృప్తి .


change your way of thinking 


Two men ,both seriously ill,occupied the same  hospital room.


one man was allowed to sit up in his bed for an hour each afternoon to help drain the fluid from his lungs. His bed was next to the room's window.


The other man had to spend all his time flat on his back.

The men talked for hours o end.

They spoke of their wives and familieis ,their hoes, theirs jobs,their involvement in the military services, where they had been on vacation. 

Every afternoon when the man in the bed by the window could sit up, he would pass the time describing to his roommate all the things he could see out side the window. 

The man in the other bed began to live for those one- hour periods where his world would be broadened and enlivened by all the activity and color of the world outside. 

window overlooked a park with a lovely lake .

Ducks and swans played on the water while children sailed their model boats.

Young lovers walked arm in arm amidsy flowers of every color and a fine view of the cit skyline could be seen in the distance.

As the man by the window described all this in exquisite detail,the man on the other side of the room would close his eyes and imagine te picturesque scene. 



Days passed by and weeks rolled on 

... one morning

the day nurse arrived to bring water for  their baths.. only to find the lifeless body of the man by the window , who has died peacefully in his sleep. She was saddened and called he hospital attadants to take the body away.


As soon as it seemed appropriated, the other man asked if he could moved next to the window.

The nurse was happy to make the switch and after making sure he was comfortable , she left him alone. 

Slowly , painfully he propped himself up on one elbow to take his first loom at the real world outside .He strained to slowly turn  to look out the window beside the bed.....

But to his surpise....It faced a blank wall.

Tha man asked the nurse what could have compelled his diceased roommate who had describe such wonderful pthings out side this window. 

The nurse responded that the man was blind and could not even see the wall.

She said ' perhaps he just wanted to ancourage you. 


THERE IS TREMENDOUS HAPPINESS IN MAKING OTHERS HAPPY DESPITE  YOUR OWN SITUATION . 


Yesterday is history.

Tomorrow is mystery.

Today is God'S gift 

that's why we call it the present .



స్వీయ రచన .

ఒక ఆంగ్ల సన్నివేశమునకు పద్యాలలో కథానిక 


నిజమైన తృప్తి .


తే .

అవధరింపుడదియొక వైద్య నిలయమ్ము /

రోగు లిద్దరు చేరిరి  రోగ బాధ / 

చెలిమి యేర్పడె వారికి చెలువ మొప్ప/

వారి రోగ ములొకటైన కారణాన 


తే

ఇవ్విధంబుగా చేరి వా రిర్వు రొకరి /

కొకరుగ  గడిపిరచ్చట గుబులు గాను /                      

 కిటికి ప్రక్కనొకడు ప్రకృతిని గనుచు  ;/

చక్కి  రెండవ వాఁడును చక్క నుండె 


తే

ప్రకృతిని పరికిస్తు మొదటి వాడు ప్రక్క /

రోగికి వివరించ నతడూహ  లోన తేలి / 

వాడు  విహరిస్తు నుండగా వాని  రోగ /

ము   శమనమొం దఁగ నహము లొక కొన్ని /

గడవ నంత మొదటి వ్యక్తి  కాలుఁ జేరె  

 

 అంత రెండవ రోగి ప్రకృతి చూడనెంచి గవాక్షము  ప్రక్క కు పోయి చూడ నతనికి కిటికినకు బదులుగ నొక  అడ్డుగోడకాననయ్యె


తే

అది గనిన రోగి  యా నర్సు నడిగె నంత /

'యతడు వర్ణించె ప్రకృతి ని యంత సొంపు /

గాయనంగయనియె నామె ' కల్ల యదియ/

ఏల యనఁనాతడొకయంధుఁ డెటుల చూచు ? 


తే

ఆమె మాటలు వినియాతఁ డచ్చె రువుగఁ  /

juu నామె యిట్లు పలికె ' చూడ నాతఁ /

డింబు నీకు కల్గించంగ  నేమొ యనఁగ /

పరుల యానందముకొరకు పాటుపడుట /

ఇల  నిజమగు తృప్తియనుచు  తలచె నతడు 


ఇంబు = సంతోషము 


డాకోమలరావు బారువ   01/06/2021



Attachment.png


Attachment_1.png

28, మే 2021, శుక్రవారం



మిత్రుల గురించి పద్యాలు .


డావిజయ 



.వె.


విద్య లెన్ని నేర్వ విఱ్ఱ  వీగదు తాను/

మిత్రులన్న ప్రాణ మిచ్చుఁ దాను/

రోగులందఱ మఱి బాగుగా చూచేటి/

వినుత వైద్య రత్న ' విజయ ' చాణ



మణి కుమారికి శుభాభినందనలు 


తే.గీ 


అరువది సమముల్  నిండిన యతివ *మణికి* /

భావి కాలము సుశ్లోక  భాజనమయి /

ఆయు రారోగ్య సంపన్న మై యలరుచు /

వర్ష శతములు  పతితోడ వరలు గాక .


సమము = సంవత్సరము 

శ్లోకము  కీర్తి 

వర్ష శతములు = నూరేండ్లు 


కోమలరావు 22/5/2021


 బివియం ప్రసాద్ కి షష్ఠి పూర్తి శుభాకాంక్షలతో 


.వె

చదువులందు తనకు యెదురులేదను వాఁడు /

పరుగు లందు తనకు తిరుగు లేదు/

 'మూవిలన్న  నెపుడు ముందుండు సోగ్గాడు /

మిత్రు లన్న ప్రాణ మిచ్చు వాడు /

ఆరు పదులు దాటు యందగాడు 'బివియం'/

వరలు లే సుఖముగ వంద యేళ్ళు .


కోమలరావు బారువ 28/5/2021


పి వి సుధాకర్ .

ఆట పాటలందు నందె వేసిన చేయి /

చదువు  లందు తాను మొదట నుండు /

నాటకములు వేయ  పోటీ పడునెపుడు /

వైద్య సేవ లందు విసుగడెపుడు /

పేరుకు తగినట్టు విమల తేజుఁడు 'సుధా

కరునియశము వెల్గు కడ వరకును .


డాకోమలరావు 



18, మే 2021, మంగళవారం

శంకరం లోక శంకరం  (ముత్యాల సరాలు ) 


పర మతమ్ములు పెచ్చు పెరుగగ 

సనాతనమ్ము సన్నగిల్ల గా 

ఆది దేవుని సురలు కోరగ

అంబికా పతి యవని యందున 

ప్రభవమందెను శంకరునిగా 


మంచు మలపై నుండు  వాడట 

కాలడి యనెడి యూరు నందున 

ఆర్యమాంబకు శివ గురువునకు 

ముద్దు బిడ్డగ పుట్టినాడట 


శైశవమ్మందు పలు శాస్త్రము 

లభ్య సించెను యుక్త వయసున 

 వేద కొనలకు కృష్ణ గీతకు 

భాష్య ములెన్నొ రచన చేసెను 


సిరిని వేడెను మంత్రములతో 

 బీద రాలికి సంపదిచ్చెను 

కన్న తల్లికి శ్రమను తీర్చగ 

పూర్ణ నదినే దరికి తెచ్చెను 


చిన్న తనమునె  సన్య సించెను 

చిన్న కడవందు  నదిని నింపెను 

వినయమున గురు పదములంటెను 

 గురువు కోరిన శిష్యు డయ్యెను 


పిన్న వయసున  దేశముఁజుట్టె 

నాల్గు దిక్కుల నాల్గు మఠముల 

నిల్పె నోలిన్  పూరి ద్వారక  

బదరికా  శృంగేరి లందు  


వాదమందున పెక్కురన్  గెలిచి 

అద్వైతమ్మును ధరణి   నిలిపెను .

జగద్గురు డని ఘనత నొందెను 

ఆది శంకరుఁడవని యందున 


కోమలరావు బారువ 


తే


పసితనమ్మునే వేదాంత బ్రహ్మ సూత్ర /

ములకుకృష్ణ గీత శ్లోక ములకు భాష్య /

ముల్ బుధులు మెచ్చునట్లుముముక్ష సాధ /

నమ్ము గా వ్రాసె శంకర నామ గురుఁడు . 



-కోమలరావు 


అష్ట వర్షే చతుర్వేది 

ద్వాదశి సర్వ శాస్త్రవిత్

షోడశి కృతవాం భాష్యం

ద్వత్రిమసి మునిరభ్యగాత్ 


Attachment.png