28, ఫిబ్రవరి 2022, సోమవారం

 తేట గీతి మాలిక 


ధారుణీచక్ర మురు తర తేరు కాగ /

వేల్పు కొండయె వ్రేగైన  విల్లు కాగ /

ఆగమంబులు తేరికి హరులు గాగ /

నాగరాజు శేషుఁడు వింటి నారి కాగ /

శౌరి శత్రు నిర్దళనమౌ శరము కాగ /

వనజ భవుఁడుతాఁ సూతుఁడై వర్తిలంగ /

చెలగి త్రిపురాసురుల నీఱు చేసి నట్టి /

శంభు శాంకరీ వల్లభు సంస్తుతింతు .


-కోమలరావు  బారువ


లింగోద్భవము 


తే

నేన యధికుండ మూలంబ నేన యనుచు /

హరి విరించులు కలహించ నహము తోడ /

కండ్లు మిరుమిట్లు గొలుపంగ కాంతులొల్క /

లింగమొక్కటి వెలసె వారిర్వురి కడ .