22, నవంబర్ 2023, బుధవారం

 శ్లో 

హసంతీం  హసంతీం 

హసంతీం వామలోచనామ్

హేమంతే యే  సేవన్తే

తే నరా దైవవంచితాః


గీ. 

నిప్పు మండెడు కుంపటిన్ , కప్పు కొనెడి/

దుప్పటిన్  వామలోచనా  గొప్ప  పొందు /

శీత వేళల కోరని జీవుడెందు /

భాగ్య హీనుడు పరికింప పదుగురందు . 


దీనిలో హసంతీ శబ్దం

మూడుమార్లు ప్రయోగించబడింది.ఒకదానికి కుంపటి,మరొకటి కంబళి,

మూడవదానికి నవ్వుతున్నఅనే విశేషణార్థం.


తా. 

కుంపటినిగాని, కంబళినిగాని

నవ్వుతూన్న అందమైన కన్నులున్న

యువతినిగాని చలికాలంలో ఎవరు ఆశ్రయించరో,

వారు దురదృష్టవంతులు - అని చెబుతున్నాడు కవి.

18, నవంబర్ 2023, శనివారం

 శ్లో 


న చోర హార్యం, న చ రాజ హార్యం, 

న భ్రాతుర్విభాజ్యం,న చ భారకారీ, 

వ్యయే కృతే వర్ధతేయేవ  నిత్యం, 

విద్యా ధనం సర్వధన ప్రధానం


ఆ.వె 

దొంగ వాడు , రాజు దోచుకోలేనిది /

అన్న దమ్ము లెవ్వ రడుగ రారు /

భార కారి  కాదు ; వ్యయముచేయ పెరుగు /

సర్వ ధనము లందు చదువు గొప్ప 


- డా. కోమలరావు బారువ 

12, నవంబర్ 2023, ఆదివారం

 దీపావళి శుభాకాంక్షలు 


గీ

ద్వాపరమ్మందు నరకుడన్ ధరణి సుతుఁడు 

సాధు వుల గాసిపెట్టు నిశాటుఁ డుండు /

వాని పోకార్చె  హరి సత్య భామతోడ /

అదియె దీపాల పండుగై యలరె జగతి .


డా.కోమలరావు బారువ 


ప్రమదలు ప్రమిదలు చేకొని /

ప్రమదం బొప్ప వెలిగించె భ్రాజిత లీలన్ /

ప్రమదామణి  సాత్రాజితి 

సమరా టోపపు వెలుగులు జయవెట్టంగన్ .


12/11/2023



20, సెప్టెంబర్ 2023, బుధవారం

 The Lotus is a symbol of purity, whilst  its roots are in the mud, the flower remains above the dirty water. Similarly, we should also live a Lotus life, unaffected by the impurities surrounding us.


.వె 

పంకజమ్ము జన్మ పంకమ్ములోనైన /

పంకజాసనునకు వాసమయ్యె /

పుట్టుకెట్టి దైన పూని నియతినున్న /

మనిషి జీవితమ్ము ఘనత కెక్కు .


డా.కోమలరావు 

*चार दिन गायब होकर देख लीजिए,*

*लोग आपका नाम भूल जाएंगे...*

*इंसान सारी ज़िंदगी इस धोखे में रहता है कि,*

*वह लोगों के लिए अहम है....*

*लेकिन हक़ीक़त यह होती है कि,*

*आपके होने ना होने से*                                                     

*किसी को कोई फ़र्क नही पड़ता है....*

*जिसकी जितनी ज़रूरत होती है,*

*उसकी उतनी ही अहमियत होती है......*


* रुकी वक़्त की गर्दिश,*

* ज़माना बदला,*

*पेड़ सूखा तो परिंदो ने*

*ठिकाना बदला......**चार दिन गायब होकर देख लीजिए,*

*लोग आपका नाम भूल जाएंगे...*

*इंसान सारी ज़िंदगी इस धोखे में रहता है कि,*

*वह लोगों के लिए अहम है....*

*लेकिन हक़ीक़त यह होती है कि,*

*आपके होने ना होने से*                                                     

*किसी को कोई फ़र्क नही पड़ता है....*

*जिसकी जितनी ज़रूरत होती है,*

*उसकी उतनी ही अहमियत होती है......*


* रुकी वक़्त की गर्दिश,*

* ज़माना बदला,*

*पेड़ सूखा तो परिंदो ने*

*ठिकाना बदला......*


నాలుగురోజులు మాయమై(కనపడకుండాఉండి చూడండి.

ప్రజలు మీపేరును మర్చిపోతారు.


మనషి తనజీవితకాలమంతా భ్రమలోనే బ్రతుకుతాడు."తాను అందరకూ కావల్సిన వాడనీ,ముఖ్యుడనీ "


కాని అసలు విషయానికి వస్తే‌ నీవు ఉన్నా లేకపోయినా ఎవరికీ ఎటువంటి వ్యత్యాసము ఉండదు  .


ఎవరు ఎంతవరకు ఉపయోగపడ్తారో అంతవరకే వారి అవసరము .


కాలగమనము ఆగదు  .ప్రపంచము మారదు  .చెట్టు ఎండిపోతే పక్షులు వేరేగూడు చూసుకున్నట్లు //


తే

నాల్గు రోజులు మనిషి కనబడ కున్న /

మనుషులంతలో వారిని మరచి పోవ /

నేనె యధికుఁ డంచు నరుడు నీల్గుచు నిత /

రులకు నేనెదిక్కని   భ్రమ లోన నుండు . 

 

.వె 


నదిని దాటు వరకె నావ వలయు నట్లు (ట్లె)  

ఎంత వరకు బంధ మంత వరకె /

మనము బ్రతికి యున్న మనములేకున్నను /

జగతి ఆగి పోదు ప్రగతి సాగు .


.వె 

చెట్టు మోడు బార చిలుక యెగయు నట్లు /

శిథిల జీర్వి నుండి జీవి పోవు /

జగతి యనఁ  బరగు జాయతే గచ్ఛతే /

కాల మాగదెపుడు కాలు లీల .