30, ఆగస్టు 2021, సోమవారం

 శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 


వె .

వెన్న తిన్న  కొంటె చిన్ని కృష్ణు డు తాను /

నోటి లోన చూపె మేటి జగతి /

కోరి భజన చేయు వారికెల్ల రకును /

వెన్నుఁ డిచ్చు శుభము    ప్రియము గాను 



డాకోమలరావు బారువ 12/8/2020 

5, ఆగస్టు 2021, గురువారం

on the eve of Bone and Joint week
 తే.గీ. 
 మనిషి దిటవుకు కారణంబెముక లరయ / 
కండ రమ్ములె గట్టికి కారణంబు / 
కాన కసరత్తు చేయండి మాన కుండ / 
అదియె ఆయువు పెంచెడి ఔషదంబు .
డా. కోమలరావు బారువ 6/8/2021

 జంధ్యాల 

తే.గీ 

బుద్ధ దేవుని భూమిలో పుట్టి నాఁడు /

కరుణ తోడ కుంతి విలాప కథను చెప్పె /

పూల కష్టాలు చెప్పెను పూస గుచ్చి /

జగమెరిగినట్టి జంధ్యాల శాస్త్రి గారు /

వందనంబులు నీకు పాపాయ్య శాస్త్రి .


డాకోమలరావు బారువ .4/8/2021

1, ఆగస్టు 2021, ఆదివారం

 జీవిత పరమార్థము 


వర్షార్థ మష్టా ప్రయతేత మాసాన్

 నిశార్థ మర్థం దివసం  యతేత 

వార్ధక్య హేతో ర్వయసా నవేనా 

పరత్ర హేతో రిహ జన్మనా  


తే.గీ 

వర్ష కాలంబు  సుఖముండ వలయు నన్న/

కష్ట పడవలె మనిషి మాసాష్టమందు /

పగలు పనిచేయ వలె రాత్రి పదిలముండ /

వార్ధకమ్మున సుఖియించ వలయు నన్న /

జీవి కష్టించ వలయును యౌవనమున /

నరుఁ డిలను శ్రమించ వలెను  పరము కొఱకు.