11, ఆగస్టు 2022, గురువారం

 శ్లో 

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం

ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాష్మహే


తే

జ్ఞాన శక్తి కి నిలయంబవైన దేవ /

అమలిన స్ఫటికాకృతి  లరినట్టి /

సర్వ విద్యలకున్రహి స్థంభ మైన 

అశ్వ కంధరా ! నా నతులందు కొనుమ .


డాకోమలరావు  12/8/2022

8, ఆగస్టు 2022, సోమవారం

 .వె 

చెళ్ల పిళ్ల వారి చెల్లియో చెల్లకో/

పద్య గుళిక లొప్పె ప్రజల నోళ్ళ /

పద్య మున్న వరకు బ్రతుకును వేంకట /

శాస్త్రి తెలుగు నేల  శాశ్వతముగ .


డాకోమలరావు 8/8/2022

7, ఆగస్టు 2022, ఆదివారం

 జెండాకు వందనము 


సత్యాగ్రహమ్మె స్వతంత్ర సాధనమ్మనియె నొకఁ డు .


స్వతంత్రమ్ము  నా జన్మ హక్కని గద్దించెనొకఁ డు


మాకొద్దు  తెల్లదొరతరమనిప్రతిఘటించెనొకఁ డు .


తెలుగు వీర లేవరాయని యెలుగెత్తెనొకఁ డు


తుపాకీ గుండుకు తన గుండె చూపెనొకఁ డు .


గుండు తోడనె స్వతంత్రమ్ము సిద్ధించు ననియె నొకఁ డు .


చెయ్యెత్తి జై కొట్టమని నినదించెదె నొకఁడు .


అందరి త్యాగ ఫలమ్మె

 మన స్వతంత్ర ఫలమ్ము 


  స్వతంత్ర ప్రతీక గా 

పింగళి సృష్టించె త్రివర్ణ పతాకమ్ము 


 వందనమ్ము చేయుడీ మువ్వన్నెల జెండాకు 

 అమృతోత్సవ స్వతంత్ర వత్సరమున 



జై హింద్ 

జై  భారత్ .


డాకోమలరావు బారువ. 7/8/2022

3, ఆగస్టు 2022, బుధవారం

 వీరులకు జోహార్లు 


తే. 

మంచు కొండల మాటున మలగి మలగి /


ప్రాణముల్ మాతృ భూమికై  పణము పెట్టి /


శత్రు మూకల చండాడి శాంతి నింపి /


నట్టి వీరులారా!యివే వందనములు .


డా. కోమలరావు. బారువ 27/7/2022