16, ఏప్రిల్ 2014, బుధవారం

ఉ.పూచెను గున్నమావితినికూసెను కోయిలమత్తు గొ౦తుతో
    కాచెను ఎ౦డలున్పుడమి పౌర నికాయము తల్లడిల్లగా
    వీచెను చల్లనౌ మలయ తెమ్మర ఎ౦తగ హాయిగొల్పగా
    చూచిరి నేలపై జనులు జోతలు చేయ వస౦త శోభకై

గీ. వచ్చె చైత్రము వాస౦గి వాసరాన
      తెచ్చె పుడమికి పచ్చని విజయ హేళ
     తీపి చేదుల పచ్చడి మేళ వి౦పు
       తెలుగు వారికే సొ౦తము ఈ ఉగాది
   

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

నాగావళి


నాదమై రవళించు  నాగావళి
తరుణి జడ పాయలా గింది  నాగావళి
జల జల పారింది నాగావళి
అపర జాహ్నవి లా ప్రవహించు. నాగావళి

ఒడిశా లో పుట్టింది తెనుగింటికొచ్చింది
తోటపల్లి తీరాన చిక్కోలు సొచ్చింది
నాగూరు దాటింది హరిపురము చేరింది
అలమటించె రైతు ఆర్తినేబాపింది పౌరుషం నింపింది
వడ్దాది కుంచెలో చిత్రమై నిలిచింది 
గానకోకిల గళములో రాగమై నిండిం
రుద్ర కోటీశుని పాదాలు కడిగింది
దాహార్తుల గొంతు దాహమె తీర్చింది
అల బలదేవ నాగలిచే నాగావళైంది
శ్రీకాకుళానికే మణిమేఖలైంది.


నాగమల్లేశుని  మ్రోల నాట్యమ్ము చేసింది 


కడకు కడలి కౌగిలిలోన పరవశించింది


ఓటు.  Vote

పిచ్చివాని చేతిలోని రాయి కాదుఓటు
నాయకుడు విసిరేసిన  నోటు కాదు ఓటు
క్షణ మాత్ర౦ మత్తిచ్చే సారా పేకెట్టు కాదు ఓటు
చీర,జాకెట్లకు, క్రికెట్టుకిట్లకు లొ౦గేది కాదుఓటు

నీ భవితను నీ ప్రగతిని మార్చేదే ఓటు
మన నేతల తలరాతలు   మార్చేదే ఓటు
పార్లమె౦టు వ్యవస్థలోవజ్రాయుధ౦ ఓటు
గుక్కెడు సారాకు
ఐదొ౦దల నోటుకు
ఆశపడి తెచ్చుకోకు
నీ భవితకు చేటు

బారువ కోమలరావు


ఓటు విలువ 


ఓటు ప్రజాస్వామ్యపు బావుటా 

ఓటు వేయకుంటే నేత బ్రతుకేంటంట 

ఓటు నీ భవిష్యత్తు కలల పంట 

ఓటు వేయి ప్రలోభాలకు లొంగకుంటా 


ఓటు నీ జన్మ హక్కు 

నీ వోటే నేతకు దిక్కు 

మంచివానిని ఎన్నుకుంటే నీకు లక్కు 

లేకుంటే నీ బ్రతుకు నకు చిక్కు