10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

 గణపతి 

తే.గీ 

పసుపు ప్రతిమ యుసురు పొంది పాప డయ్యె /

వాడు శిరము పోయి  కరి వదను డైన  /

కరి ముఖుండు విఘ్నముల పో కార్చి సతము /

సకల జగముల రక్షించి సాకు గాక .

 భార్య 


.వె 


భార్య భారమనుచు భావించకెప్పుడు/


కష్ట సుఖము నందు  కలిసి యుండు /


విధి యొసంగి నట్టి    ప్రియ వయస్య పతికి /


ఆధి వ్యాధు లందు నౌషధంబు .


డాకోమలరావు బారువ  11/9/2021


.వె 

కాల మహిమ చేత  నాలి తీరది మారు/


కాలు  తరమె దాట   కాల మహిమ /


కాలు డైన నేమి  కాలాంతకుండైన /


ఆలి మీరి బ్రతుక  జాల గలడె.


కాలుడు = యముడు 

కాలాంతకుడుశివుడు


-కోమలరావు

[9:08 AM, 7/12/2021] 


.వె

ఆలి లేని బ్రతుకు పేలవమైతోచు

ఆలి తోటి బ్రతుకు మేలు కూర్చు 

ఆలి యున్న వేళ  నాదరించకయున్న 

ఆలి పోయి నాక డీలు పోవు 




8, సెప్టెంబర్ 2021, బుధవారం

 


భానుమతి 

.వె 

భాను మతిని చూడ భావముప్పొంగులే /

పాట వినగ మనసు పరవశించు /

భాను మతియనంగ బహుముఖ నైపుణీ /

తెలుగు చలన చిత్ర వెలుగు దివ్వె /

6, సెప్టెంబర్ 2021, సోమవారం

 గురు పూజ 


గురుః బ్రహ్మ గురుః విష్ణు     


గురు దేవో మహేశ్వరః           


గురు సాక్షాత్ పరం బ్రహ్మ     


తస్మై శ్రీ గురవే నమః           


--


వె

అరయ గురువు బ్రహ్మ యండ్రీ  జగతి లోన /

భువిని గురువు శ్రీధవుండు నెంచ /

చూడ నొజ్జ మరియు శూలపాణి పృథివి /

గాన గురుని  పూజ ఘనత మనకు .


గురువు నేర్పిన విద్యలు కూడు బెట్టు

గురువు నేర్పిన విద్యలు   గుణము నిచ్చు 

జ్ఞాన ఖనియైన  గురువు చే జ్ఞాన మబ్బు 

కాన  దేవుడు గురువే  జగాన చూడ 


డా .కోమలరావు బారువ