13, డిసెంబర్ 2011, మంగళవారం

సెల్ ఫోను


                                     సెల్ ఫోను


తే.గీ .కరమున మిగుల గుట్టుగ సరిగ నమరి
         పలు రకమ్ముల లభ్యమౌ పరికరమ్ము
         ఎల్లలను దాటి తా కల్పు నెల్లజనుల
         తంతి రహితమ్ము చరవాణి ధన్యతమము

ఆ.వె   పాట ఆట దేశ వార్తల వినిపించు
           చెవుల కింపు గూర్చు  చవుల దీర్చు
            మేర మీరి వాడ మేధావి నాశమ్ము
           మేలు కీడు లిందు మేళవించు

తే.గీ. సెల్లు కొన్న నాడు కలుగు థ్రిల్లు హెచ్చు
         బిల్లు కట్టగ జేబుకు చిల్లు పడును
        ఫోను బిల్లు హెచ్చి తడిసి మోపుకాగ
        ఈ మొబైలదేలని జనుల్ ఈసడింప

3, డిసెంబర్ 2011, శనివారం

గజార్తనాదం

                      Parody    padyam


                         గజార్తనాదం
శా.లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

        ఠావుల్ త ప్పెన్ మూర్చ వచ్చెన్ తనువున్ దస్సెన్ శ్రమంబయ్యెడిన్

         నీవే తప్ప నితః పరంబెరుంగ మన్నింప దగున్ దీనులన్

         రావే ఈశ్వర   కావవే  వరద సంరక్షించు  భద్రాత్మకా
      
                           జనార్తనాదం
. *లావొక్కింతయు లేదు **ఆర్డరు విలోలంబయ్యె ప్రాణాలకు

   న్వారంటీ కరవాయె  మద్యం హెచ్చె మాఫియ రెచ్చె, క్రిమినల్స్ హెచ్చెన్

     ఉయ్ నో నన్నదర్దేన్ యు  మన్నింప దగున్ దీనులన్

     కమాన్ ఈశ్వర సేవ్ అజ్ వరద  ప్రొటెక్టజ్ భద్రాత్మకా

*Law,,** we know non other than you

13, అక్టోబర్ 2011, గురువారం

స్నేహితుల దినోత్సవము సందర్భముగా స్నేహము గురించి


సీ.   

      చెల్మినా శించి ఇంద్రుడు కాతర తక్షకు ప్రేమతో రక్ష సేసె / 

      నెయ్యమర్కజుఁ డెంచి యవనిజాత నరయించి చెలికాని యార్తి బాపె /

     కూర్మిచే శౌరి యాకుచేలుని కౌగిలిపరవశించెనో లేమితొలఁ  /

     నెయ్యమును కోరి కానీను కౌరవుండంగదేశమునకు నధిపుఁ జేసె //



 తే గీ నట్టి చెలిమికి లేవులే యెట్టి జాతి /

       భేదములు ఖేదమోదాదిభిన్న దశలు /

       కలిమిలేముల విడువక కలసి  మెలగి /

       యుండు వారెపో మిత్రులీ యుర్విలోన 


మిత్రులందరికి శుభాకాంక్షలు 

7, జులై 2011, గురువారం

అమ్మ నాన్న

అమ్మ అమ్మను  పిలుపులో వినిపించు శ్రుతి రావం
 మమ్మీ మమ్మీ అను పిలుపులో  వినిపించు శవరావం

అమ్మ అమ్మను పదము అక్షరము
మమ్మీ మమ్మీ అను పదమది క్షరము

అందుకే
మమ్మి మమ్మి అను  పలుకు  పలుకకు మీవు
అమ్మ  అమ్మా అను పిలువు  మరువకు నీవు

డాడి  డాడి  అను పదం లో ఏముంది ? '' గుణింతం
నాన్న అను పదంలో   ఉంది 'నా' దను సొంతం 

అమ్మ నాన్న శబ్దాలు వాగర్ధాలు  
వ్యర్ధం  చేయకండి ఆ ద్వంద్వ శబ్దాలు

   అందుకే 

పరభాషా వ్యామోహం వద్దు
మన భాషను మాట్లడమే ముద్దు  


16, జూన్ 2011, గురువారం

దండం (చేతి కర్ర)


విశ్వామిత్రాహి పశుషు కర్డమేషు జలేషు చ
అంధే తమసి వార్దక్యే చ  దండం దశ గుణం భవేత్
తా. పక్షి, కుక్క ,శత్రువు ( కాని వాడు , దొంగ ),పాము ,పశువు,బురద ,నీటిలో ,చీకటిలో గ్రుడ్డి వానికి ,ముసలితనము లో ఇలా పది విషయాలలో    దండం  ఉపయోగకారిని .
వి=పక్షి ,శ్వ= కుక్క ,అమిత్ర = శత్రువు, అహి=పాము , పశుషు=పశువు ,
కర్డమేషు(కర్దమము)=బురద . జలేషు=నీరు , అంధే=గ్రుడ్డి వాడు , తమసి=తమము ,చీకటి , వార్దక్యే=ముసలి తనము
చేతి కర్ర గురించి  అందమైన ఆటవెలది

ఆ.వె    పాము, వేపి, పిట్ట ,పసుల పారగ దోలు 
          అంబు ,అడుసు లందు అండ గాను
         అహితు ,ముదిమి, అంధ తమములన్ తోడైన
         చేతి కర్ర  మహిమ చెప్ప  తరమె

        వేపి =కుక్క ,  అంబు = నీరు ,అడుసు = బురద ,అహితు =హితుడు కాని వాడు =శత్రువు /దొంగ


4, జూన్ 2011, శనివారం

సూక్తి


}మానవ మనుగడకు మనిషికి ఆరోగ్యము ,డబ్బు ఎంత ముఖ్యమో తోటి మనిషి సహాయము అంతే ముఖ్యము.వారిలో ఒక మంచి మిత్రుని కలిగి యుండటం అంత  కన్నా ముఖ్యము అని నేను భావిస్తున్నాను.అందుకే మంచి స్నేహితుని పొందటము చాల గొప్ప అదృష్టము . 
}
}
}
క.   వేలుగ సొమ్ములు ఉన్నన్
     మేలౌ  మిత్రుని బడయుట  మిక్కిలి కష్టం
     వీలుగ  నేస్తుని పొందిన
     చాలు నరుని జన్మ ధన్యతన్ జెందు  నిలన్
}

22, మే 2011, ఆదివారం

మామ మీసం మీద సీసము



మామ మీసం మీద సీసము


ఈ భూమి అంతమై పో తుందని భయపడే జనులకు ఓదార్పుగా,సరదాగా ఒక సీస పద్యం



సీ”  ఎవ్వాని మీసము యేపుగా పెరుగునో

                   మోమున  యూడలై సొగసు కూర్ప

      ఎవ్వాని మీసము   ఎదుగునో రొయ్యలా

                             బారుగా  రోషమ్ము పరిఢ విల్ల  

      ఎవ్వాని మీసము   యెలమి మేఘము వోలె

                           కన్పట్టు చూపరుల్ కలత నొంద    

      నెవ్వాని మీసము   నిమ్మలకాధార  

                          మైభువి ని మిగుల  యలరు చుండు  

తే.గీ  నట్టి సొగసైన  నల్లని దట్టమైన

       మామ మీసాలు  బలిమిమై భూమి నిలిపి

       పరగు  చుండ జనులు భయపడగ  నేల      

       మామ మీసాలె మహిలోన మనకు రక్ష 



13, మే 2011, శుక్రవారం

నీతి పద్యము


 మన లోకము లో నీచ మైన  పనులు చేస్తూ ఎక్కువ కాలము జీవిస్తే కాకిలా చిర కాలము జీవించే కంటే హంస లాగ జీవించాలని అంటారు .
 అదే అందముగా ఆటవెలది  పద్యంలో చెప్తే
ఆ.వె     కావు కావు మనుచు కాకి చిరమునుండు /

              అంచ రాజసముగ  నసువు బాయు /

          చెనటి   చెడ్డ పనులు చేయుచు మురియును/

           నీతిపరుడు భువిని ఖ్యాతి నొందు.

  krbaruva,blogspot.com  

5, మే 2011, గురువారం

ధనం – ఇందనం



ధనం లేకున్న కదలదు బ్రతుకు బండి
ఇందనం లేకున్న కదలదు  ఇంజను బండి

ధనమూలమిధం  జగత్తు అన్నారానాడు
ఇందనమే అన్నిటికి కీలకమన్నారీనాడు

ధనం దండిగా ఉంటే వచ్చి చేరు బందువుల్
ఇందనం  నిండుగా ఉంటే పెరుగు వాహనముల్

ధనం కొరకు జరిగాయి యుద్ధాలు ఆనాడు (collonization )
ఇందనము కొరకు యుద్ధాలు జరుతున్నయీనాడు ( gulf war)

ధనం నకు మనిషి బానిసైనాడేనాడో
ఇందనము నకు మనిసి బానిసైనాడీనాడు

ధనం ఎక్కువైతే పెరుగు దుర్య్వసనాలు
ఇందనము ఎక్కువైతే పెరుగు వాయు కాలుష్యాలు

ధనం విలువ రాను రాను శూన్యం
ఇందనము విలువ పోను పోను అనూహ్యం




         

4, మే 2011, బుధవారం

సుందరి అందం

నేనొ  వాసర వేళన్

   చెన్నుగ నేఁబోవుచుండ  చెంతన గంటిన్ 

   వాల్గంటిని గంటిన్ కనినంతనె

  తనువంత పరవ శమయ్యె తన్విన్  చూడన్


 సుందరి కన్నులు కలువలు

    సుందరి  నగు మో ము పోలు చుక్కల ఱేనిన్ /

    సుందరి నెఱి  కురులు యిరులు

   సుందరి  నెన్నడుము గగన సుమమే కనఁగన్ 


.   సుందరి నాసిక సంపెఁగ

     సుందరి వాతెఱ పగడపు సొగసును పోలున్

     సుందరి కంఠము శంఖము 

     సుందరి  మృదురావమందు సుధ లూరంగన్ 


.వె       ఆమె చనులు  మేలి బంగరు గిన్నెలు

            ఆమె కనులు వికసిత జలజములు       

            ఆమె కౌను  చూడ  నంబర  కుసుమము

            ఆమె నడక చూడ నంచ గమన

 

www.krbaruva.blogspot.com


 


1, మే 2011, ఆదివారం

వసంతాగమము


}   సీ. కొమ్మ ప్రాయపు వేళ కోకకట్టిన రీతి వనములన్ని చిగిర్చి వన్నె చూపె
       పువ్వుబోడి      పయోదముల కెనయౌనన విరవాది గుత్తులు విరుగ బూసె
         అలికులవేణి వేనలి మాకెనయౌ నేయంచు అలికులంబేగు దెంచె 
          విరిబోణి మృదు వాణి  సరిరాదు మాకంచు పంచమములు కూసె పంచమమ్ము 
}                                        తే.  వన్నె మీర లేజిగురాకు వలువ కట్టి 
}                                              యిరుల బోలు పెన్నెరులలో విరులు పెట్టి 
}                                              పరవశించి కోయిల పంచమమ్ము  పాడ
}                                             పుడమి పులకించె వనలక్ష్మి పొలయు వేళ 
}

24, ఏప్రిల్ 2011, ఆదివారం

నీతి పద్యం


నీతి  పద్యం
శ్లో.   పుస్తకం వనిత విత్తం
      పర హస్తం గతం గతః   
      అథవా పునరా యాతి 
      జీర్ణస్య , భ్రష్టాచ ,ఖండిశః  
తా.  పుస్తకము, ఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే  మరల
      తిరిగి రావు. ఒక వేళ తిరిగి వచ్చిన  చినిగి పోయి ,  చెడి పోయి గాని
     సగము గాని వస్తాయి.
దీనినే తెలుగు పద్య రూపము లో  వ్రాస్తే
ఇలా ఉంటుంది .


శ్లో.   పుస్తకం వనిత విత్తం

      పర హస్తం గతం గతః   

      అథవా పునరా యాతి 

      జీర్ణస్య , భ్రష్టాచ ,ఖండిశః  

తా.  పుస్తకముఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే  మరల

      తిరిగి రావుఒక వేళ తిరిగి వచ్చిన  చినిగి పోయి ,  చెడి పోయి గాని

     సగము గాని వస్తాయి.


దీనినే తెలుగు పద్య రూపము లో  వ్రాస్తే

ఇలా ఉంటుంది .


.వె.   అందమైన వనితఅరుదైన పుస్తకం

         చేతి సొమ్ము పోతె చేర రాదు 

         తిరిగి  వచ్చెనేని  చెడినదౌచినుగును

         సగమె  వచ్చు  కాదె జగతి లోన 


డాకోమలరావు బారువ














20, ఏప్రిల్ 2011, బుధవారం

రాయలకు నీరాజనం


దక్షిణా పధము లో రాజకీయ దురంధరుడు ,సంగీత సాహిత్యంలో ఆంధ్ర భోజుడు గా అజరా మర కీర్తిని గన్న ,దేశ భాషలందు 'తెలుగు లెస్స' అని తెలుగు భాషను పొగడిన మేటి రాజు శ్రీకృష్ణ దేవరాయల  పంచ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వ్రాసిన పద్యాలు . 


           
శ్రీ కృష్ణదేవరాయల పంచ శతాబ్ది సందర్భంగా వ్రాసిన
పద్యాలు పెద్దల సవరణలతో.



తే.గీ   తుళువ వంశ కల్ప కుజమై కలన   మెఱసి/

       కన్నడ తెనుఁగు రాజ్యశిఖరపు  భూష /

       ణ ,పర రాజ నిర్మథన ఘన భుజ వీర్యు/

       కృష్ణ దేవ రాయ నృపుని కీర్తి మెత్తు.


తే.గీ
        కలము చేపట్టి కృతికన్యకలసృ జించి/

       కత్తి కేలూని  సంగర కల్పన లను/

       కృతి కదనములను ఘనుడు కృష్ణరాయ/

       లనుచు రాయల సత్కీర్తు లనునుతింతు.


కోమలరావు బారువ

                   




శ్రీకృష్ణదేవరాయలు 


సీ

ఎవడు  చెప్పినయట్టి కవనంబు రసిక రాజన్యుల నానంద జలధి దేల్చె 

ఎవడు నుడివినట్టి కవనంబు పండిత పామరాదులకు నింపై చెలంగె /

ఎవడు వ్రాసినయట్టి కవనంబు 'సాహిత్య రసికులచెవులందు రసమునింపె /

ఎవడు పల్కినయట్టి కవనంబు విద్వత్  సభలయందు మిక్కిలి ప్రణుతి కెక్కె //


తే.గీ


నట్టి ఆముక్తమాల్యద యాంధ్ర దేశ 

మందు కావ్యావతంసమై యలరు చుండె 

నట్టి కావ్యమున్ రచియించి నట్టి *కృష్ణ*

*రాయలె పుడమి  కవి రాజు రాజ రాజు*


అట్టి రాయల విరచిత కావ్య రాజ 

మైన ఆముక్త మాల్యద యాంధ్ర దేశ

మందు చిరమగు యశస్సు పొంది నట్లు   

చేసె శ్రీకృష్ణ రాయలు స్థిరముగాను 


డాకోమలరావు బారువ


రాయలు 

.వె 

రాజనంగ నతఁ డె వ్రాయ గలిగినట్టి /

కావ్య రాజము నతి శ్రావ్య ముగను /

రచన చేసినట్టి రాజన్యుడుభువిని /

రాయలె కవి రాజు రాజ రాజు .




రాయల  వారి  కల్పన 


తే.గీ మాలిక 


తే.గీ మాలిక 


మిన్ను తాకు సౌధములట  చెన్ను మీర / 

సోరణములు మూయఁగ చిక్కె  తార లంట; / 

ముత్యములబోలు నక్షత్రములవరుసలు

తరుణిముత్యాలదండతో తమకుగూడ

చిల్లులనుజేతు రచ్చటి చేడియలని

సూది పోట్లకు వెరచిన  చుక్క లపుడు 

నక్కె సరముల సందున చక్కగాను /

రాత్రి  రతి కేళి నలసిన లలన లంత  /

వాయుచర్చనుగోరి గవాక్షములను

తెరచినంతనె చుక్కలు తెరువు గనుచు

వేగ బాఱిన వట వినువీధి చేర

లలితశృంగారభావనాకలితమైన

రమ్య కల్పన చేసిన రాయలె భువి / 

రాజు కవులందును మరియు  రాజు లందు.


మిన్ను తాకు సౌధములట  చెన్ను మీర / 

సోరణములు మూయఁగ చిక్కె  తార లంట; / 

సూది పోట్లకు వెరచి  ;  చుక్క లపుడు 

నక్కె సరముల సందున చక్కగాను /

రాత్రి  రతి కేళి నల సి  లలనలపుడు  /

సోర్ణ గండ్లు తెరవ బాఱె  జుక్క లనుచు /

రమ్య కల్పన చేసిన రాయలె భువి / 

రాజు కవులందును మరియు  రాజు లందు .


డాబారువ కోమలరావు 


రమ్య కల్పన చేసిన రాయ భూప /

అందు కొనుము మా  శతకోటి   వందనములు .


తే.గీ 

కృష్ణ రాయల రసమయ కృతులు వినగ /

ముదము నొందెదరు   రసికుల్  హృదయ మందు /

కృష్ణ రాయల భీకర దృష్టు లొలయ /

వెలవెల పారుదురు పరులు  కలనమందు 


తే .

ఎన్నొ యుద్ధముల్ చేసిపేరెన్నిక గని /

రాటు దేలిన కర్కశ రాణ్మణీవు /

ఆంధ్రకవులకెల్ల మిగుల యబ్బురంబు /

నీ కవనమరయఁ గ  నవనీత మగుట.

కృష్ణ రాయ ! రణ కవన కీర్తి సాంద్ర.



.వె 

అతివ అందమైన, ద్వైతమైనను

కవన రచన యందు ; కదన రంగ/

మైన నీకు సాటి యైన వారు గలరె

 జగాన జూడ  కృష్ణ రాయ!


.వె 

రాయలనఁగ నెవడు ? రాజులందు ఘనుఁ డు /

రాయ లనఁగ కవన రాయ డతఁడు /

విష్ణు చిత్తు కథను విరచించె ఘనముగా /

నాంధ్ర మందు కవులు హ్లాద మంద .


రాయల రచన 


తే .

ఎన్నొ యుద్ధముల్ చేసిపేరెన్నిక గని /

రాటు దేలిన కర్కశ రాణ్మణీవు /

ఆంధ్రకవులకెల్ల మిగుల యబ్బురంబు /

నీ కవనమరయఁ   నవనీత మగుట.


-కోమలరావు బారువ 


శ్రీకృష్ణ రాయ కవి


.వె 

కత్తి చేత బట్టి కదనంబు చేసెను /

కలము  బట్టి చేసె కావ్య రచన /

 కదనమందు మరియు కావ్య రచనయందు /

ఘనుడు కృష్ణ రాయ కవి వరుండు .



         www.krbaruva.blogspot.com