ధనం లేకున్న కదలదు బ్రతుకు బండి
ఇందనం లేకున్న కదలదు ఇంజను బండి
ధనమూలమిధం జగత్తు అన్నారానాడు
ఇందనమే అన్నిటికి కీలకమన్నారీనాడు
ధనం దండిగా ఉంటే వచ్చి చేరు బందువుల్
ఇందనం నిండుగా ఉంటే పెరుగు వాహనముల్
ధనం కొరకు జరిగాయి యుద్ధాలు ఆనాడు (collonization )
ఇందనము కొరకు యుద్ధాలు జరుతున్నయీనాడు ( gulf war)
ధనం నకు మనిషి బానిసైనాడేనాడో
ఇందనము నకు మనిసి బానిసైనాడీనాడు
ధనం ఎక్కువైతే పెరుగు దుర్య్వసనాలు
ఇందనము ఎక్కువైతే పెరుగు వాయు కాలుష్యాలు
ధనం విలువ రాను రాను శూన్యం
ఇందనము విలువ పోను పోను అనూహ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి