} సీ. కొమ్మ ప్రాయపు వేళ కోకకట్టిన రీతి వనములన్ని చిగిర్చి వన్నె చూపె
పువ్వుబోడి పయోదముల కెనయౌనన విరవాది గుత్తులు విరుగ బూసె
అలికులవేణి వేనలి మాకెనయౌ నేయంచు అలికులంబేగు దెంచె
విరిబోణి మృదు వాణి సరిరాదు మాకంచు పంచమములు కూసె పంచమమ్ము
} తే. వన్నె మీర లేజిగురాకు వలువ కట్టి
} యిరుల బోలు పెన్నెరులలో విరులు పెట్టి
} పరవశించి కోయిల పంచమమ్ము పాడ
} పుడమి పులకించె వనలక్ష్మి పొలయు వేళ
}
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి