జెండాకు వందనము
సత్యాగ్రహమ్మె స్వతంత్ర సాధనమ్మనియె నొకఁ డు .
స్వతంత్రమ్ము నా జన్మ హక్కని గద్దించెనొకఁ డు.
మాకొద్దు ఈ తెల్లదొరతరమని ప్రతిఘటించెనొకఁ డు .
తెలుగు వీర లేవరాయని యెలుగెత్తెనొకఁ డు.
తుపాకీ గుండుకు తన గుండె చూపెనొకఁ డు .
గుండు తోడనె స్వతంత్రమ్ము సిద్ధించు ననియె నొకఁ డు .
చెయ్యెత్తి జై కొట్టమని నినదించెదె నొకఁడు .
అందరి త్యాగ ఫలమ్మె
మన స్వతంత్ర ఫలమ్ము
ఆ స్వతంత్ర ప్రతీక గా
పింగళి సృష్టించె త్రివర్ణ పతాకమ్ము
వందనమ్ము చేయుడీ మువ్వన్నెల జెండాకు
అమృతోత్సవ స్వతంత్ర వత్సరమున
జై హింద్
జై భారత్ .
డా. కోమలరావు బారువ.
సత్య దీక్ష సాధనమని చాటె నొకఁడు /
'తెల్ల దొరతన మేలని ' తెగడె నొకడు /
తెలుగు వీర లెమ్మనుచును తెల్పె నొకఁ డు./
గుండుకెదురుగా నొక్కడు గుండె చూపె/
ఎందరేమి చెప్పిన నేమి యందరొక్క
మూడు రంగుల రెపరెప లాడ కనుల
ముందు యాసంతస మ్మే మేమందు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి