ఓనీటి చుక్కా! పదవిని బట్టి విలువ!
ఉ: "స్థాన విశేష మాత్రమున 'తామఱపాకున నీటిబొట్ట'! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన నింత గర్వమా?
మానవతీ శిరోమణుల మాలిక లం దునఁ గూర్ప వత్తువో?
కానుక లీయవత్తువొ? వికాసము నిత్తువొ? విల్వ నిత్తువో?
చాటుపద్యం-- నందితిమ్మన-- రాయల యాస్థాని!
ఓనీటి చుక్కా! తామఱపాకుపై నిలచి నేను ముత్యాన్నని డాబులు కొట్టబోకు. తెలియని వారు నిన్ను ముత్య
మనుకొనినంత మాత్రమున నీకంతగర్వమా? నీవేమైనా ఆడవారి పూమాలలలో నలంకరింప దగియున్నావా? కానుకలిచ్చుటకు పనికివత్తువా? నీవల పరిసరములకేదైన వికాసము కలుగునా? అమ్ముకొందమనిన నీకేమైన విలువయున్నదా? గాలివాటుకు నీటిలోకిజారితివా? ఇకనీపనిశూన్యము. ఇంతదానికంత మిడిసిపడుటయేల? మేలుగాదుసుమా?"-అని హెచ్చరిక!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి