రైతు -బుగత
భూమిని నమ్మిన రైతు అందరికి కూడు పెడుతున్నాడు.
భూమిని అమ్మిన బుగత అందరి నోట్లో మట్టి కొడుతున్నాడు .
భూమిని నమ్మి (దున్ని) చెమట చిందిస్తున్నాడు రైతు
భూమిని అమ్మి కాసులు చేసుకుంటున్నాడు బుగత.
బుగత మేడలు మీఁద మేడలు కడుతున్నాడు .
రైతు పాడె మీఁదకి వెళుతున్నాడు.
రైతుకు ఎరువులిచ్చేందుకు బ్యాంకులో సొమ్ములు కరువు.
బుగతకు అరువులిచ్చేందుకు ( loans ) బ్యాంకులు పరుగు పరుగు .
రైతు లోనుకు ( loans ) సవాలక్ష క్వరీసు .
బుగతకు లోనుకు ( loans ) లేవే ఎన్క్వరీసు .
రైతు దృష్టి ప్రజల కడుపు నింపడం పైన .
బుగత దృష్టి ప్రజల కడుపులు కొట్టడం పైన .
ఇన్ని చేసిన రైతుకు తిరస్కారము .
అన్ని దోచిన బుగతకు పురస్కారము .
-కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి