18, జులై 2022, సోమవారం

 


సరదాగా ........


.వె 

పంకజాక్షి యొకతె పంకజాక్షుల గూడి /

పంకజముల తెచ్చి పంక జాక్షు /

పాద పంకజముల పాణి పంకజముల /

భక్తి పూజ చేసి పరవశించె .


.వె 


నీరజదళ నేత్ర నీల కంఠ సఖుని /

నీర జాక్షు వరదు నీల గాత్రు /

నీరజ ముఖులెల్ల నీరాజనలిడగ /

నీరజముల తోడ నెమ్మిఁ  గొలిచె


-కోమలరావు  18/7/2022

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి