తెలుగు వారి దేవుడు - మన్యము వీరుడు .
------------------------------------
పాండ్రంగిలో పుట్టిన గాండ్రించిన పులి
చదువు స్వల్పమైన దేశ భక్తి యనల్పము
పన్ను కట్టమన్న తెల్లవాడి
వెన్ను విరిచిన వాడు
రంప చోడ వరము పై చేసెను దాడి
బ్రిటిషు వాడి గుండెలలో కలిగించె నలజడి
భరత మాత ముద్దు బిడ్డ, బాణముపట్టిననేత .
బ్రిటిషు వాడి గుండెలలో పేలిన ఫిరంగి మ్రోత .
భరతమాత విముక్తికై ప్రాణమిచ్చిన త్యాగి .
గుడాల్ గుండుకు గుండె చూపిన యోగి .
అల్లూరి రామ రాజు అమరుడైనాడు.
తెలుగు వారి గుండెలలో దేవుడైనాడు .
డా. కోమలరావు బారువ 4/7/2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి