24, జూన్ 2022, శుక్రవారం

 

వాల్మీకి రామాయణము లో సుమిత్ర సహృదయతను తెలిపే శ్లోకము. 

అయోధ్య కాండ /40 వ సర్గ /9

శ్లో. 

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్I

అయోధ్యామటవీం విధ్ది గచ్ఛ తాత యథాసుఖమ్৷৷


మొదటి అర్ధం:


రామ= రాముడు:  దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా


లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో,  సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


తే. 

తలచు  రాముని నీ యొక్క తండ్రి గాను /

తలచు సీతను నావంటి తల్లి గాను  /

తలచు మా విపినము నయోధ్యా నగరము /

వోలె లక్ష్మణా ! వని చను మోయి హాయి . ( కోమలరావు ) 


క. 

అన్నా నీవనయము  రా 

మన్నను నాన్న వలెనన్ను మైథిలి కాగన్ 

ఎన్నుము నీమదిలో ల

క్ష్మన్నా యెన్నుము విపినము సాకేతముగన్ ( కోమలరావు ) 


క. 


అన్నా ! నీవనయము  రా /

మన్నను తండ్రి వలె సీత మామక రీతిన్ 

చెన్నుగ  విపినమయోధ్యగ    

నెన్నుము తనయా !  సుఖముగ నీవు చను మింకన్ 


అనయము = ఎల్లప్పుడు. 

విపినము = అడవి .

సాకేతము = అయోధ్యా నగరము 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి