సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః కుచద్వయమ్/
ఏకమాపాత మధురమన్యదాలోచనామృతమ్.
ఆ. వె
శారద కుచములయి సంగీత సాహిత్య /
ముల్ ప్రణుతి వహించె భువిని మిగుల /
వింత గొల్పు నొకటి విన్నంత మనసుకు /
చింత చేయ నొకటి వింత గొలుపు .
భావము :-
సంగీత సాహిత్యాలు సరస్వతీ దేవి యొక్క రెండు పాలిండ్లైతే
సంగీతము విన్న వెంటనే చెవులకు మధురానుభూతిని కలిగిస్తుంది .
సాహిత్యము కొంచెము ఆలోచన చేస్తే మధురానుభుతిని కలిగిస్తుంది .
బిడ్డకు తల్లి పాలు ఎలాగైతే ఆనందాన్ని ఆహ్లాదాన్నిచ్చులాగున.
డా. కోమలరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి