24, జూన్ 2022, శుక్రవారం

 సంగీత సాహిత్యాలు మోక్ష హేతువు లను భావనతో చెప్పిన ఆదిభట్ల వారి 

శ్లోకమునకు అనువాదము . 


శ్లో .

సంగీతం పుష్పముద్దిష్టం

సాహిత్యం  తద్రజఃస్మృతః

ఆస్తికత్వంఫలం ప్రోక్తం   

కైవల్యం రస మీరితం,


-- ఆదిభట్లనారాయణదాసు గారు


తే

ఫుల్ల పుష్పమై సంగీత మొప్ప ; బరగ /

తత్ప రాగమై సాహితి   తనరు చుండ 

ఆస్తికత్వమ్ము ఫలరాజ మై నెగడఁగ /

ఫలరసమ్మె కైవల్య మై  పరిఢవిల్లు .       



  డాకోమలరావు బారువ


భావము :-


సంగీత మనునది మంచి వికసించిన పువ్వైతేసాహిత్యము పుష్ప రజమైతే , తత్ఫలితముగా లభించిన ఫలముభక్తియై నెగడగ ,యా ఫలరసాస్వాదనే కైవల్యము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి