ఆ.వె
పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు /
గిట్టు వాఁడు మరల పుట్టు నంట /
పుట్టి గిట్ట కుండ ముక్తికై జీవుడు /
మహిని మసల వలెను మర్మ మెఱిగి .
-బారువ కోమలరావు. 01/9/2021
తే.గీ.
పువ్వులు తరుల పై వెల్గు దివ్వెలల్లె
తరుణులకు సతము ముదమును గూర్చు
నవ్వులకు ప్రతీకలు మల్లె పువ్వులంద్రు
పువ్వులు పసి పాప నవ్వులంద్రు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి