22, ఏప్రిల్ 2021, గురువారం

 తేట గీతి మాలిక 


వినుత నీలమేఘశ్యామ విష్ణువీవ /

దుష్ట యక్షిణి తాటకి దునిమి తీవ /

తాటకేయుల శరముల తరిమి తీవ  /

గాధి  కొమరుని యాగంబు  గాచి తీవ /

శాప పీడితాంగి యహల్య తాప హరణ /

శంభు చాపము ద్రుంచితి జగము మెచ్చ /

సుదతి సీతఁ జేపట్టిన సుగుణ రామ/

రామ శ్రీరామ  సాకేత రామ రామ .


డాకోమలరావు బారువ


శ్రీరామనవమి శుభాకాంక్షలు 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి