మన లాంటి వర్ధమాన పద్య రచయితల పాట్ల గురించి గుఱ్ఱం జాషువా గారిలా ఏకరువు పెట్టారు.
ఎలానో చూద్దాము ...........
సీ.
గణబాధ రవ్వన్త గడచి మున్దుకు సాగ- తగ్గవో! యని యతిస్థానమురుము/
యతిని మచ్చికజేసి, అడుగు మున్దుకు వేయ- ప్రాసంబు కుత్తుకబట్టి నిలుపు/
ప్రాసవేదన దాటి పయనంబు సాగింప- భావంబు పొసగకిబ్బన్ది పెట్టు/
భావంబు పొసగిఞ్చి పద్యంబు ముగియింప- రసలక్ష్మి కినిసి మారాము సేయు//
తే.గీ
నిట్టి ప్రతిబన్ధకంబులనెల్ల గడచి/
గట్టుకెక్కుదమన్న- వ్యాకరణ శాస్త్ర /
మాదరింపదు శబ్దమర్యాద కాన/
రాక కవిగాని బ్రతుకు శ్రీరామరామ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి