18, మే 2021, మంగళవారం

శంకరం లోక శంకరం  (ముత్యాల సరాలు ) 


పర మతమ్ములు పెచ్చు పెరుగగ 

సనాతనమ్ము సన్నగిల్ల గా 

ఆది దేవుని సురలు కోరగ

అంబికా పతి యవని యందున 

ప్రభవమందెను శంకరునిగా 


మంచు మలపై నుండు  వాడట 

కాలడి యనెడి యూరు నందున 

ఆర్యమాంబకు శివ గురువునకు 

ముద్దు బిడ్డగ పుట్టినాడట 


శైశవమ్మందు పలు శాస్త్రము 

లభ్య సించెను యుక్త వయసున 

 వేద కొనలకు కృష్ణ గీతకు 

భాష్య ములెన్నొ రచన చేసెను 


సిరిని వేడెను మంత్రములతో 

 బీద రాలికి సంపదిచ్చెను 

కన్న తల్లికి శ్రమను తీర్చగ 

పూర్ణ నదినే దరికి తెచ్చెను 


చిన్న తనమునె  సన్య సించెను 

చిన్న కడవందు  నదిని నింపెను 

వినయమున గురు పదములంటెను 

 గురువు కోరిన శిష్యు డయ్యెను 


పిన్న వయసున  దేశముఁజుట్టె 

నాల్గు దిక్కుల నాల్గు మఠముల 

నిల్పె నోలిన్  పూరి ద్వారక  

బదరికా  శృంగేరి లందు  


వాదమందున పెక్కురన్  గెలిచి 

అద్వైతమ్మును ధరణి   నిలిపెను .

జగద్గురు డని ఘనత నొందెను 

ఆది శంకరుఁడవని యందున 


కోమలరావు బారువ 


తే


పసితనమ్మునే వేదాంత బ్రహ్మ సూత్ర /

ములకుకృష్ణ గీత శ్లోక ములకు భాష్య /

ముల్ బుధులు మెచ్చునట్లుముముక్ష సాధ /

నమ్ము గా వ్రాసె శంకర నామ గురుఁడు . 



-కోమలరావు 


అష్ట వర్షే చతుర్వేది 

ద్వాదశి సర్వ శాస్త్రవిత్

షోడశి కృతవాం భాష్యం

ద్వత్రిమసి మునిరభ్యగాత్ 


Attachment.png

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి