రాఘవ పాండవీయం /పింగళి సూరన/1 :౧
స్తోత్రము
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే
శారదా శారదామ్బోజ వదనా వదనామ్బుజే
సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్
జ్ఞానాందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే
సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్
@@@@@@@@@@@@
సభాయైనమః
రామోత్సవాల సందర్భము స్వాగతము
నిర్వాహకులకు కృతజ్ఞతలు
స్త్రీలకు అభరణములు అందాన్ని యిస్తాయి .
కావ్యమునకు శబ్దాలంకరమైన యమక ప్రయోగము రచనకు అందమునిచ్చును.
శ్లేష
ఒకే పదము అర్థ భేదముతో మరల మరల ప్రయోగింపబడుట యమకము .
హరి ముఖము , హరి పలుకులు ,ఆమె హరి మధ్య , నెలత జడ హరి బోలు
మ్రోగింది కల్యాణ వీణ ----కలవరించి ---- కల. వరించి
అచ్చెరువున - అచ్చెరువున --సప్తపది
తొలి చూపు తోరణమయ్యె కల్యాణ కారణమాయె
అపరిమితానురాగ సుమనో లసయై చిగురాకుఁజేతులన్/
దపసిని గౌఁగిలించె వనితా యిదె రంభ దలంప రంభ దా /
నపరిమితానురాగ సుమనోలసయై చిగురాకుఁ జేతులన్ /
దపసిని గౌఁగిలించు టుచితంబెకదా యన నవ్వె రంభయున్.
వసు --------వాజ్ఞ్మ్యము / సృష్టి అవతారికలో
మహిమున్వాగనుశాసనుండు సృజియింపం గుండలీంద్రుండు ద/
న్మహనీయ స్థితి మూలమై నిలుప శ్రీనాథుండు ప్రోవన్మహా/
మహులై సోముఁడు భాస్కరుండు వెలయింపన్ సొంపువాటించు నీ/
బహుళాంధ్రోక్తి మయ ప్రపంచమునఁ దత్ప్రాగల్భ్యమూహించెదన్.
కవిరాజమనోరంజనం అబ్బయ
భంగముఁజెంది సింధుపతి పాఱె నుతించెను మాగధుండు కా/
ళింగుడు మనమెల్ల వదలెన్ వనవాసముచేసె మత్స్యుఁ డా/
త్మాగబలంబు లేమి,బెగడందె విదేహుఁడు కుంతలుండు,దా/
నింగితమెంచిచిక్కువడియెన్,నరనాయకుమేటిధాటికిన్.
రాఘవపాండవీయము , హరిశ్చంద్ర నలోపాఖ్యానము ,,అచలాత్మజా పరిణయము .(శ్రీవేంకటాచార్య )
వేంకటగిరి సంస్థానీధీశుడు .
ఆకువీటి తిమ్మప్రభువు నకంకితమిచ్చెను .
ప్రభావతీ ప్రద్యుమ్నము , కళాపూర్ణోదయము , గరుడ పురాణము
శా.
రెండర్థంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా/
కుండుం ; దద్గతిఁ గావ్యమెల్లనగునే నోహో యనంజేయదే/
పాండిత్యంబున ? నందునుం దెనుఁగుఁ గబ్బంబద్భుతమండ్రు ద/
క్షుండెవ్వండిల రామ భారత కథల్జోడింప భాషా కృతిన్.
రామాయణం 24000 --. భారతము . లక్ష 600. పద్యాలు. శ్లోకాలు
రామాయణం --- ఉత్తర కాండ లేని.
భారతం - ఉపాఖ్యానాలు , సౌప్తికాది పర్వాలు లేని
రామాయణం అయోధ్య. భారతం. హస్తినాపురి.
దశరథుడు పాండురాజు.
నీలుడు ధృష్టద్యుమ్నుడు
సుగ్రీవుడు కర్ణుడు
ఆంజనేయుడు భీముడు.
.
4. ఆశ్వాసాలు
రామాయణం | భారతం |
పిల్లలు లేమి | పిల్లలు లేమి |
వేట | వేట |
రామలక్ష్మణుల జననం | పాండవుల జననం |
శివ ధనుర్భంగం | మత్స్య యంత్ర భేదన |
అరణ్య వాసం | అరణ్య వాసం |
రాముని పై శూర్పనఖ మోహం | అర్జునునిపై ఊర్వశి మోహం |
అంగద రాయబారం | శ్రీకృష్ణ రాయబారం |
రామ రావణ యుద్ధం | కురుక్షేత్ర యుద్ధం |
పట్టాభిషేకం | పట్టాభిషేకం |
చెప్పబోయే అంశము
నాలుగు ఆశ్వాసములు
మొదటి ఆశ్వాసము
35 padyaalu
శివ ధనుర్భంగము తరువాత పరశురాముని ప్రవేశ ఘట్టంలో -- నారదుని ఆగమనం
భా. పాండవులకు నీతి బోధ చేయుటకు నారదుని ఆగమనం
ఖాండవ వన దహన సమయంలో -. లక్ష్మణుని ప్రసంగం
ఖాండవ
63 వ పుట నుండి
1 .ఆ. 1/1
వెలయు నఖిల భువన ములలోనవారణ /
నగరిపు రమతల్లి నాఁ దనర్చి /
రాజ్య లక్ష్మి మిగులఁ బ్రబల నయోధ్య నా/
రాజ వినుతిఁ గనిన రాజధాని.
అయోధ్య = యుద్ధము చేయనశఖ్యమైనది
2. క. 1/2
ఆ పట్టణ మేలెడి పృథి/
వీ పాలుఁడు భ్రుకుటి మాత్ర విముఖిత సమదా/
టోపారి పంక్తి రథుఁడు/
ద్దీపించు నుదారనీతి ధృతరాష్ట్రుఁడనన్ .
సమదాటోపము= గర్వాతిశయము
విముఖిత = పరాన్ముఖుల జేయు
పంక్తి రథుడు= పది దిక్కులయందు అప్రతి హతమగు. రథ గమనం గలవాడు.
ధరింపబడిన రాజ్యము గలవాడు.
గర్వాతిశయం కలిగిన
అరి పంక్తి = శత్రువుల
రథుండు= రథము లు కలవాడు
3. చ.1/3
తెలివి నతి ప్రగల్భుఁడ సదృగ్బలుఁడా తఁడు భీష్మ చాప కౌ/
శలమె సహాయమై యమర శత్రులనేఁ పడఁపన్వలంతియై /
నిలుకడ నేలె విశ్వధరణిం దన మిత్ర కులంబు వైభవో /
జ్వలతఁ దలిర్పఁ బౌరవసు సంతతి రాజుల కెల్ల హెచ్చుగన్.
రామా :
అసదృక్ బలుండు = సాటి లేని బలము కలవాడు
వలంతి = సమర్థుడు
నిలుకడన్ = శాశ్వతముగా
మిత్ర కులము = హితుల సమూహము
భార :
అ, సదృక్ బలుడు = దృష్టి సహితుడు కాని వాడు
బాహ్య చక్షువులు లేకపోయిన --- జ్ఞాన చక్షువులు కలవాడు
4. క. 1:4
సుబల తనయ గుణ మహిమం/
బ్రబలి తనకుదార ధర్మ పాలన లీలన్/
సొబగంది వన్నెఁ దేఁగా/
విబుధ స్తుతుఁ డవ్విభుండు వెలసెన్ ధరణిన్ .
రామా :-
గొప్ప బలము తోడను మంచి గుణముతోడను ప్రబలి ధర్మ పరిపాలనము దనకు వన్నె తేగా , దేవతులచేస్తుతింపబడువాడు
భార:-
దార ధర్మ= భార్యా ధర్మము యొక్క ( పతివ్రతాచారముల వలన )
5. క. 1/5
పాండు రాజు గురించి
అని నీడు లేని కడిమిం /
దనరారు నతిప్రతాపి త దనుజుఁడతఁడు/
ర్విని గల నృపతుల నందఱఁ /
దనకరి గాఁపులగఁ జేసెఁ దర్పస్ఫురణన్ .
రామా:-
అతిప్రతాపిత = మిక్కిలి తపింప జేయబడిన
6. సీ.1: 7
ధృతిఁ గుంతి మద్ర భూపతుల నెయ్యపుఁ గన్య కలనన వాలుఁ దూపుల జయించి/
యలరారు నతను జయ శ్రీల వరించె యవన సౌరాష్త్ర. భూధవులఁ గెలిచె,/
ద్రవిడ కళింగ సాల్వ విదర్భ వసుధాది పతుల నోడించి కప్పములఁ /
జోళ నేపాళ పాంచాల కేరళ మత్స్య. వత్స భూపతుల గర్వం బడంచె//
గీ.
శకయుగంధర ఘూర్జరాశ్మంత సింధు/
లాట భూపాల ముఖ్యుల నోటువఱచె/
జగతిఁ గోసల కేకయ మగధు ల తన/
యలవరించిన యాజ్ఞలో మెలఁగ జేసె.
రామా.
ధృతి = ధైర్యంతో
కోసల, కేకయ, మగధుల తనయల. వరించి నయాజ్ఞలో
భార .
ధృతిన్ = సంతసముతో
కుంతి. మాద్రి ని
నెయ్యపు = ప్రీతిపాత్రమైన కన్యల
మగధులు + అ +తన. యలవరించిన = విస్తారమయిన
దశరథునకు సంతానం లేదు
జైత్ర యాత్రకు. - వేటకు
7. మ. 1:11
జవవద్ఘోటక పాటిత క్షితి రజ స్సంక్రాంతి చే నింకుసిం /
ధువులం గ్రమ్మఱ నుర్వికిందివికిఁ దోడ్తోనించెఁ దన్నాగముల్/
నవ నిర్యన్మద నిర్ఝరౌఘమున శుండాశీకరోర్ధ్వ ప్రవ/
ర్ష విధిం దాననుజేసి సింధురముల న్బ్రఖ్యాతి గాంచెన్గరుల్ .
- వచనం .
ఇట్లు యధేచ్ఛభోగంబులఁ బ్రవర్తిల్లి నొక్కనాఁడు తన మనంబున
వేటకు...
9. క. 1: 16
అతి వినయాన్విత కుంతియు /
ధృతి మహిమాద్రియు నగుచు నతి ప్రీతితరం/
గిత మతులై తను గొలువఁగఁ /
జతుర మృగయులేఁగుదేరఁ జనియెన్వనికిన్.
కుంతియు =కుంతియము - ఈటెలు ధరించినవాడును, ధైర్యవంతుడును , పర్వతము (అద్రి )
భార..
ధృతిమహి = ధైర్యమునకు స్థానమైన
దశరథుడు -- తమసా నది. ఒడ్డున,
పాండురాజు - హిమాలయ పర్వత సమీపమున
10. వచనం /1:17
ఇట్లు చని చని వివిధ మృగంబులన్ వేటాడుచు ం దిరిఁగి
11. క /1:18
నెలకొనియె వేఁటతమి న/
బ్బలియుఁడు శిశిర నగ రుచిర పరిసర మహిమం/
గల తమస తీర సికతా/
విలసనములు డెందమునకు విందొనరింపన్.
రామా.
నెలకొను = స్థిర పడు
శిశిర నగ = చల్లని చెట్లు , రుచిర= అందమగు ,
మహిమం = మాహాత్మ్యము
భార . హిమత్పర్వత సమీపంలో , మహిమం= మహిన్
తమ. సతీ రసికత.
రామా. మునిదంపతుల కుమారుని కొట్టుట. శ్రవణుడు
*కిందముడు*
12. సీ / 1: 20
పుడమి ఱేఁడీ రీతిఁ గడఁగి డెందము మృగ వ్యాపార ఖేలన మభిలషింపఁ/
గానలోఁ దారు మృగంబుల కై వడిఁ గైకొని యసమాస్త్ర కర్మ కలనఁ/
దనరు చొక్కపు రాణ ముని దంపతులు దమ కంబు దేర నెయ్యంబు మీఱ/
ననిచినఁ దత్ప్రియ. తనయుండ వారిత కారుణ్యుఁడై పూని కలశమంబు ,//
గీ.
మగ్నముగఁ జేయుచప్పుడు భుగ్న హృదయుఁ/
డగుచు విని శిత శర విశేషాభిహతిని /
ద్రెళ్ల నేసె నాఘనులస దృష్టి నియతి/
బ్రుంగఁ గేవల సారంగ బుద్ధిఁజేసి.
రామా.
కడంగి = యత్నించి
ఒక్క పురాణ ముని దంపతులు
అవారిత కారుణ్యుడు
శర విశేష = శబ్ద ఘాతియను బాణ విశేషము
లసత్ దృష్టి = అంతర్దృష్టి ; నియతిన్ = విధి చేత , బ్రుంగన్ = నశించగా
భార.
వారిత కారుణ్యుడు
రాణ = అనురాగము
కలశమంబు = శాంతము
సదృష్టి = మంచి చూపు , నియతిన్ ,
బ్రుంగన్= నశించగా
క. 1: 25
13. ఏనుం గని కర మరయక /
బూనితిఁ గా కిట్టి యెడలఁ బొసఁగునె యేయం/
గానమె కాలనియమగతి/
తో నావేఁట ముని యుగముఁ ద్రుంగించెఁ దుదిన్.
రామా. ముని ఉగము / యుగము= ముని బాలుని ఆయువు. ( వయస్సు. జంట )
భార. కాన మెకాలు అని ,= సాధారణ మృగములని,
యమ గతి తోన్ = యముని ప్రేరణతో
14. చ.1:27
ఘన శర వేదన ల్బలియఁ గా వన కుంభి వ్రాలియున్న య/
మ్ముని యుగళంబు దొట్రు వడముంచితి నాతలి దండ్రు లన్మహా /
ఘనది; నిఁ కేమన న్నెఱయ గానని కన్నుల వారి వృద్ధులం/
దనరఁ దదంఘ్రి చే ర్పునను ధార్మికుఁ డాయన నమ్రవక్త్రుఁడై .
రామా:-
అఘము= పాపము , దుఃఖము
భార:-
కన్నుల వారి వృద్ధి చెంద
15. గీ. 1:30
కాంతతోడఁ గూడఁ గాన నిట్టటు చన/
లేని యీ యవస్థఁ బూనియున్న/
మాకుమారు ప్రాపుఁ బోకార్చె నేఁ డు నీ/
దైన ప్రౌఢిమహిమ భానుకులుఁడ.
రామా. కానన్ = చూడజాలను , ప్రాపు. = అండ
ప్రౌఢి మహిమ= నీ చాతుర్య మహిమ ,
భార. హిమ భాను కులుడు
16. ఆ . 1:31
ఎందు వేఁట రారొ? యితరు లేమనసుతో/
దార సంగసుఖముఁ దప్పఁ ద్రోచి /
తకట! పాండురాజ యశ మెన్న వైతతి/
క్రూర దశ రథేశ కులము రోయ .
రామా. అతి క్రూర , దశరథేశ ,
పాండుర. అజ. రాజు యశము
భార.
దార.
రథేశ కులము = రథికుల కులము
17. గీ. 1: 32
నిజ శరీర మెట్లట్ల యా నృపుని మేను /
నాత్మజాయాస మాగం బైన యపుడ/
ప్రాణములు వాయునట్లుగఁ బరమశోక/
వశత శపియించి మృతినొందె వనితతోడ.
రామా . ఆత్మజ. ఆయాస
భార. జాయ సమాగమము
రాఘవ పాండవీయము
18. మ. 1: 33
యతి యెంతేఁ దన యార్తి జేడ్వడిన వాడై యాత్మజాయాసమా/
గతమైనప్పుడ మేనుఁ బాయుమని యల్కన్నన్ను శాపించె సం/
తతిలేకుండెడి చో ఁ దదాశామిగులం దాఁబోవుటెట్లేనియున్/
ధృతిమైనోర్వఁ గవచ్చు నామదికిఁ జింతింపంగనంచెన్నుచున్.
రామా:-
యార్తి = దుఃఖము
భా:-
19. క. 1: 35
జనపతి దాన నతివ్యధ /
మనస్కుఁ డై యిట్టి దయ్యె మత్సుచరిత వా/
సన యిఁక నేమని నిజ పురి/
కిని జనియెదననుచు నాత్మ కిల్బిష శంకన్ .
రామా. ఇంకన్ , నేన్ , మని = ధన్యుడనై శాపం వరముగా పరిణమించిందని
భార. నిజపురికి ఏమని పోగలవాడనని
20. శా 1: 47
వేయుం జెప్పెడిదేమి? మౌని వర సద్వృత్తంబుచే నేమిటం/
జేయన్ రాదు; పితౄణమో క్షము సుతశ్రీదక్కఁ దత్ప్రాప్తికిం
న్ధీయుక్తింగన నొండు త్రోవగలదేనిన్వేడెదన్ దేవర/
న్యాయంబొప్ప ఘటింపు నాకురు కులంబవ్యాతిన్వర్తిలన్ .
రామా . పుత్ర లేమిని గురించి వసిష్ఠునికి చెప్పి బాధ పడుట
అవ్యాహతి = భంగములేకుండ
భార.
కుంతితో చెప్పుట
మౌని వర సద్వృత్తంబు చేన్ = ఎలాంటి ముని వృత్తి చేసియైనను
పితౄణము మోక్షము = పుత్ర లాభమున గాని పితరుల ఋణము తీరదు.
అవ్యాహతి = నాశము
కుంతి సమాధానము -- కురు వంశము కోడలి నై. అన్యుని చేత పుత్రుని వడయుమందురా?
21. చ. /1/ 50
అననతఁడిట్లనుం గలఁక నందఁగ నేటికిఁ దొల్లి యీ క్రమం/
బునననపత్యులౌ నృపులు పుత్రులఁ గానరె? యెందఱేని బెం/
పెనయ సుతేష్టిఁ జేసి , నినునే నియమించుచున్న వాఁడ నె/
మ్మనమున జింత దక్కి సుసమాహిత వృత్తి నొనర్పు మవ్విధిన్.
రామా.
సుతేష్టి = పుత్ర కామేష్టి ని
సు సమాహిత వృత్తిన్= సమాధాననునికితో ,
అవ్విధిన్ = ఆయిష్టి న్
భార .
అనన్ = కుంతి. ఈలాగున చెప్పగా
సుతేష్టిఁ జేసి = పుత్ర వాంఛచే
దేవరన్యాయము
22. క. 1: 51
అవినింద్య మతి వసుమతీ/
ధవ గుర్వాదేశమునను దానెద్దానిన్ /
సవరించిన నది యిష్టము/
నవిలంబిత నొసఁగు. సందియము వల దెందున్
రామా : దూషింపదగని మనసు కలవాడు
భార .
అతివ , సు మతీ ధవ =భర్త. గుర్వాజ్ఞ = గొప్ప ఆజ్ఞ,
అవినింద్యము = దూష్యము గానేరదు.
23 సీ. 1: 53
దశరథ/ వసిష్ఠుడు .........పాండు / కుంతి
వ. అదియు ---- ఆయజ్ఞమును / ఆ
దేవర న్యాయము వలన
సీ
అలఘుపావన గుణోజ్జ్వల దృశ్య శృంగార చితమై సుపుత్ర సంసిద్ధిఁ జేయుఁ/
గావున దత్కర్మ కలనకు వరియింప వలయు నాతనిఁ దెచ్చు వైపుఁ జూడు /
మనుడు ** బూర్వముననేఁ గనిన సుమంత్రోపదేశ మొక్కటి యిప్డు దీనికొనరి యున్నది మీతలంపొకటి , పొల్లగునె పు/
త్రేష్టికి వేల్పుల నేనిచటికి//
గీ.
దానఁ దెత్తునో? యనఘ నా తండ్రి యాజ్ఞ /
యతిశయమున సాక్షాదీశ్వరాంశమవు త/
పస్వివరు నిను మాధవుఁ బలెభజించి /
కంటి నీమంత్ర శక్తినీ గరిమమెఱయ.
** దశరథుని మాటలు ....అనఘ
కుంతి తో. .
నే చెప్పిన దేవర న్యాయము ,
పావన , గుణ ఉజ్జ్వల = ప్రకాశించుదాన. , సంబుద్ధి
దృశ్య = చూపునకు , శృంగార = శృంగార రస జనకమగులాగున , చితమై = చేయబడినదై , సుపుత్ర సంసిద్ధిన్ , చేయును , కావున
24. చ. 1: 56
అనయముఁ దత్త్వబోధమున నంచిత ధర్మ నిరూఢియందు స/
త్యనియతిఁ బెద్దయండ్రు విబుధావళిలో పల నమ్మహాత్ముఁ బా/
వన గుణ శాంతతో రుచిర వర్ణ్య నిసర్గమనః ప్రసాదుఁ డై/
తనరెడువాని మంత్ర విధి దక్ష మతిన్భజియించి తేఁదగున్.
రామా.
శాంతతో
రుచిర =అందమగు, వర్ణ్య = పొగడబడిన నిసర్గ= పూర్ణమైన
భార.
అనన్ , యమున్ = యముని
శాంత తా ఉరు = శాంతత్వముతో కూడిన , మిక్కిలి ,
చిర వర్ణ్య = చిరకాలము పొగడబడిన
నిసర్గ= స్వభావ సిద్ధమైన
25. చ. 1: 60
ఋశ్య శృంగుడు యజ్ఞము చేయుట
ప్రజాపతి దర్శనము - పాయస పాత్ర నిచ్చుట
ధరణిపుఁడుండె నంత బహుధామునిసన్మను హూయమానుఁడై/
పరమ సమృద్ధిఁ బర్వెడు విభావసు నందనురూప కాంతిని/
ర్భరుఁ గొదలెల్ల దూరముగఁ బాయ సభాజన గౌరవానమ/
త్కరు ఘను నొక్కనిం బ్రమదగౌరవ మొప్పఁగఁ గాంచిసన్నిధిన్.
రామా.
బహుధా= అనేక విధములుగా, సన్మను= గొప్ప మంత్రము చేత , హూయమానుడై= వేల్వబడు, విభావసు నందు= అగ్నియందు,
పాయస భాజన = పాయస పాత్ర చేతంకలిగి
గౌరవ = బరువుచే
భార.
బహు ధాముని =మిక్కిలి తేజస్సు గల వానిని,
సన్మను హూయమానుడు = మంత్రము చేత పిలువ బడిన వాడు,
విభావసు నందనుడు = యముడు
సభాజన = సంతోషపెట్టుట యొక్క అతిశయము చే
కర సంజ్ఞతో పిలుచు. వానిని
26. గీ. 1: 61.
అప్పుడా యార్య సభయాత తాద్భుత ప్ర/
మోద మందాక్ష వృత్తిఁ గేల్మొగిచి యుండె/
నంత రారమ్ము మనుజప యజ్ఞ ఫలం/
నొసఁగెదఁ గొనుమని విభావసూద్భవుండు.
రామా.
ఆర్య సభ, ఆతత ,
భార.
ఆర్య , సభయ
27. మ. 1:62
నిరతిం బార్థివ గేహినీ జనులకు న్సేవింప నిమ్మిందువం/
శరమా స్ఫూర్తికిఁ బట్టుఁ గొమ్మ సకల క్ష్మా భారధుర్యంబన /
న్స్థిర మై మించు తనూజలాభ మొదవు న్నీకంచు నిచ్చెంగృపన్/
వరముం బాయస మస్త కల్మషము దివ్య శ్రేష్ఠుఁ డత్యాదృతిన్. --- ప్రీతితో
రామా.
ఇందున్ వంశ రమా స్పూర్తికిన్ ,
అస్త=
అస్త కల్మషము. పాపములఁ పోగొట్టు నదియునైన
అత్యాదృతిన్ = మిక్కిలి ప్రీతితో
భార.
పార్థివ గేహినీ = కుంతీ , నిరతిన్ = ఆసక్తితో , జనులను సేవించుటకు ,
ఇమ్ము = స్థానమగునది ,
28. సీ/ 1/ 63
అట్లిచ్చి యతఁడు దా నంతర్హియుండయ్యె నది యెల్ల విని గాఢ హర్షుఁడగుచు /
జనవరుండు నిజాగ్రసతికి సౌభాగ్యంపు నడకల కేకయ నందనకుఁ గ/
రంబు గౌరవ మహిమంబంచితా నంత భావంబునం బర్వఁ బరమనియతి /
మను సుమిత్రకు లసన్మావతికి భవ్య దౌహృదోదయ నిమిత్తంబులైన //
గీ.
యా సగములోన నరయర యవ్యగ్ర /
బుద్ధి గోర్కులెల్ల బూరితముగ/
నొసఁగఁ బంచె నెంతయును దత్పరిగ్రహ /
జనుల, వారునట్లు సలిపి రెలమి.
భార :
సౌభాగ్య నడకల కు ఏక యైన కుంతికి ,
సుమిత్ర కుల = మిత్ర కోటిలో , సన్మానవతి = గౌరవము కలదానికి ,
నిజాగ్రసతికి , ఆస గములన్ = ఆసల సమూహమున్ , లోనన్ , అరయన్= లోలోపల తెలియలాగున , రయ= వేగమునందు , వ్యగ్ర= తొందర పడుచున్న , బుద్ధిన్ , కోర్కెలెల్లన్, ఎంతయున్ , పూరితముగన్ = పూర్ణమగునట్లు , జనులను , ఆజ్ఞాపించెను .
29. క. 66
విభు నగ్ర మహిషికయ్యెడఁ/
ద్రిబువనముల యంద జాత రిపునామకుఁడై/
యభినుతిఁ గాంచు కుమారుఁడు//
ప్రభవించె మహాయశోభి రాముఁడనంగన్.
రామా:-
ముల్లోకంలందు శత్రువను పేరు లేని వాడై
భార:- యజాత శత్రువను కుమారుడు
30. క. 69
అమితోన్నతిఁ గనియె నృప/
ప్రమదమను గుణ ప్రసన్న పవనుని వలనం/
గొమరు మిగులబలియు సుగం/
ధము గలవిరి సోన సుర పథంబునఁ దొరఁగన్.
రామా .
నృప= దశరథుని యొక్క ,ప్రమదము= సంతోషము
దశరథుని సంతోషము అనుగుణ మంద మారుతము వీచుటచే , దట్టమగు పుష్పవర్ష మా కసమునుండి కురియుటచేయౌన్నత్యమును బొందెన్.
భార.
నృప ప్రమద. = కుంతి ,
మను జపము = మంత్ర జపము చేత ఋష్య వాచకమైన మన్యు పదమునకు ద్విత్వము లోపించిన పదము
ప్రసన్న = అనుగ్రహించిన , పవనుని వలన కొమరున్
31. క 70
అరిభీమ నాముఁడీతఁడు/
కరమరుదుగఁ గొనునృపాళిఁ గడు నొడిచి మహా/
సురుల వధించుననేకుల /
దురమున నను విబుధ సన్నుతులు వినఁబడియెన్.
రామా. శత్రువులకు భయంకరుడు
32. క. ౭౧
అమరనగరమున నపుడు/
త్తమ నీతి విచిత్ర వీర్య తనయ జ్యేష్ఠ/
త్వమునఁ దనరారు నృపస/
త్తముని యతివ శత సుతాప్తిఁ దద్దయు వెలసెన్.
దశరథుని గొప్ప తనమును జూచి దేవతలు పొగడిరి.
33.. సీ 72
దుర్యోధనుండన ......
33a
వెండియుఁ బతికోర్కి పొదల /
రెండవ సతి యన వరగుణ రేఖ దనరుచున్/
గండెసఁ గెడు సుత రత్నము/
పాండురమణి శుక్తివోలెఁ బడసె హరికృపన్ .
రామా :
రెండవ సతి= కైక
గండెసగెడు = మగఁటిచే ప్రకాశించెడు
పాండుర మణి = ముత్యపు మణి
హరి= విష్ణువు
భార:
రెండవసతియన = రెండవ గౌరియన
పాండు రమణి = కుంతి
హరి = ఇంద్రుడు
34 క. 73
భూకాంతు మన్ననలు గడుఁ/
జేకుఱ నాముదిత బుధర చిత నుతి భరతుం/
గైక మహా వీరత్వా/
స్తోకునినర్జునసమాఖ్యు సుతుఁగనియలరెన్.
రామా --
ఆముదిత= సంతోషించిన
అర్జున = శుభప్రదమైన ; సమాఖ్యున్ = కీర్తి వంతుని
భార -. ఆముదిత = కుంతీ
నుతిభర = స్తోత్రాతిశయము చేత ,
తుంగైక = ఘనమై , ఏక= ముఖ్యమగు
35 సీ. 74
ఇవ్విధంబునఁ గాంచి హృదయేశు మన్ననఁ బెనుచుచునుండన బ్బి సరుహాక్షి/
కొండొక సవతియు గురుతర ధర్మ ర క్షణ శీలతన్మను గుణవిధేయ/
రక్షో ఽరి వైద్యవర ప్రాప్త రూపుల లక్ష్మణ శత్రుఘ్ను లను గరంబు/
వినయసౌభ్రాత్రాది ఘనతరంసుగుణరే ఖను మించుతనయులఁ గవలఁ గనియె//
గీ.
నొప్పుమీఱ * నాసత్య వీర్యోదయులగు/
నట్టి చతురాత్మజులు సురూపాభిరాము/
లై నకుల సహదేవ పదతి విశ్రు/
తాత్మ వర్తనులై మించి రవనిలోన.
రామా :
ఆసత్య = మిక్కుటమగు సత్యమునకును , వీర్య = పరాక్రమమునకు
ఉదయులు అగునట్టి = స్థానము లగు నట్టి ,
ఇనకుల ....
భార :
చతుర = సమర్థులైన ,
నకులుడు సహదేవుడు అను పదములచే
ద్వితీయా శ్వాసము
36 . క. 2:2
దేవాంశభవులఁ బుత్రుల/
నీవిధమునఁబడసి ముదిత హృదయుఁడగుచు ధాఁ/
త్రీవరుఁడు పెనుచుచుండె యఁ
థా విధిసంస్క్రియలు ముని కదంబము నడుపన్.
దేవ= విష్ణువు యొక్క అంశతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి