19, ఏప్రిల్ 2015, ఆదివారం

దేవుడి సమాధానం

             దేవుడి  సమాధానం                19/4/2015
ప్రియమైన జీవాత్మకు పరమాత్మ  వ్రాయు లేఖ
నాయన, నీ లేఖకు నా సమాధానం  1 సం //  ఆలస్యము గా 
వ్రాస్తున్నాను . ఏమీ అనుకోకు , ఎందుకంటె నేరం నారదుడిది .( Postal Delay )

మీ భూమి మీద  నా బిడ్డలు ( మీ ప్రజలు)         
ఇక్కట్ట్లు పడుతున్నరని వ్రాసావు .
ఇందులో విశేషమేముంది .
మీ మీ కర్మ ఫలాలు అనుభవించటానికే 
మిమ్మల్ని  ఆ కర్మ  భూమి యైన భరత వర్షంలో  సృష్టించాను  
భూమి మీద అకృత్యాలు కలియుగ ప్రభావమేయైన ఇంత రాక్షసత్వమా?

త్రేతాయుగ , ద్వాపర యుగ రాక్షససులనే మించి పోయారే 
నరులై యుండి కౄరత్వంలో నా అవతారాన్నే (నర సింహము) మించిపోయారే.
పూర్వ కాలంలో మోక్షం కోసం తపస్సు చేస్తే 
ఇప్పుడు మీరు ముల్లె ( ధనం ), మగువ, మద్యం కోసం తపిస్తున్నారే 

గాలి ,నీరు, నిప్పు,నేల ,నింగి సృజించి
 సమ తుల్యం పాటించి సామరస్యంగా గా బ్రతకండని  చెప్తే 

అభివృద్ధి మాటున  పంచ భూతాలను  కకావికలం చేసి
 స్వచ్చ మైన గాలి నీరు లేక రోగాల బారిన పడుతున్నారు.
ఎవరో వస్తారని ఏదో  చేస్తారని 
ఎదురుతెన్నులు చూసి ఎందుకు  బా ధ పడతారు.

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి  భారత ః
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్"
అని వక్కణించిన  నేనే చెప్తున్నాను

ధర్మో రక్షతి రక్షితః 
వృక్షో రక్ష్తతి రక్షితః 
అను వాక్యాలు తు.చ. తప్పకుండ పాటించడి
సద్ధర్మ సమాజం సాధించండి 
లేకుంటే నా పునః సృష్ఠే కాదు 
అసలు సృష్ఠే ఉండదు.
తస్మాత్ జాగ్రత్త 

ఇట్లు
సృష్టి కర్త 
C/Oవిశ్వం 

18, ఏప్రిల్ 2015, శనివారం

వంశధార
వంపులు తిరిగే వంశధారకు వరదలెక్కువ
వయ్యారాల వంశధారకు ఉరవడెక్కువ
వం శ వనం లో ప్రభవించి
ఉత్తరాంధ్రలో ప్రవహించి
పుర్వాబ్ది నే పరిణయమాడిన వం శ ధార

గట్టు దాటి పుట్ట దాటి
‘గొట్టా’ బేరేజి దాటి
రైతు ఇక్కట్లను పోగొట్టే వం శ ధార             వంపులు--

కాళింగుల చరితమును  కనువిందుగా చూసి
ముఖలింగ   మూర్తిని (స్వామిని ) మ్రొక్కుతు సాగింది     వంపులు... 

బుద్ధం శరణం గచ్చామి 
స౦ఘ౦ శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
బుద్ధుని బోధలు ప్రబోధించుతు
సాలిహొండాని  పరిక్రమిస్తు
సాగర తీరం చేరె వం శ దార                వంపులు-...


www.krbaruva.blogspot.com
 
ధనం –   ఇంధనం     6/5/2011  
ధనం లేకున్న కదలదు బ్రతుకు బండి
ఇంధనం లేకున్న కదలదు ఇంజను బండి
ధనమూలమిధం జగత్తు అన్నారు ఆనాడు
ఇంధనమే అన్నిటికి కీలకమన్నారీనాడు
ధనం దండిగా ఉంటే వచ్చి చేరు బందువుల్
ఇంధనంనిండుగా ఉంటే పెరుగు వాహనముల్
ధనం కొరకు జరిగాయి యుద్ధాలు ఆనాడు
ఇంధనంకొరకు యుద్ధాలు జరుతున్నయీనాడు 
ధనం నకు మనిషి బానిసైనాడేనాడో
ఇంధనం నకు మనిసి బానిసైనాడీనాడు
ధనం ఎక్కువైతే పెరుగు దుర్య్వసనాలు
ఇంధనం ఎక్కువైతే పెరుగు వాయు కాలుష్యాలు
ధనం విలువ రాను రాను శూన్యం
ఇంధనం విలువ పోను పోను అనూహ్యం


వాన- జాణ    8/5/2013

పిలిస్తే వచ్చింది వాన 
పిలిచిన  రాలేదు జాణ
పయోదరములు కరిగితే కురుస్తుంది వాన
పైఅధరములు కలిస్తే కురుస్తుంది తేనె లసోన
వాన కురిస్తే  చెరువులు కప్పలతో నిండు
జాణ నవ్వితే వెన్నెలలు పండు
వాన సినిమా కవులకు స్పందన
జాణ మగనికి తీయని శిరోవేదన
వాన పుడమి పచ్చదనానికి , చల్లదనానికి మూలం
జాణ జాతి వృద్ధికి ,దేశ పురోభి వృద్ధికి మూలం


Komalarao 
            దేవుడికి లేఖ.     11/5/2013

   రచన  : బారువ  కోమలరావు
             శ్రీకాకుళం   
-------------------------


మహరాజశ్రీదేవుడు గారికి ,

జీవుడు నమస్కరించి వ్రాయు విన్నపము 

భూమి జనులు పెక్కు ఇక్కట్లు పడుచున్నారు.
తోటి ప్రజలను ఇక్కట్లు పెడుతున్నారు.
మానవత్వము మరిచి మృగాల వలె ప్రవర్తిస్తున్నారు.
ఇది యుగ ప్రభావమా? మనిషి రాక్షసత్వమా?లేక నీ లీలామనుష కృత్యమా?
డబ్బును ప్రేమించినంతగా మనిషి మనిషిని ప్రేమించలేటంలేదు.
డబ్బుకొరకు మానము ,అభిమానం అమ్ముకుంటున్నాము.
ఆదిలో నీ అనుగ్రహంకొరకు తపస్సు చేసేవాళ్ళము.
నేడు తప్పులు చేసి నీ అనుగ్రహం కోసం ముడుపులు కడుతున్నాము.    
కర్మభూమియైన భరత వర్షంలో
దుష్కర్మలు భరత నాట్యం చేస్తున్నాయి.
వేదాలు వల్లించాల్సిన భూసురులు   బూతులువల్లిస్తున్నారు.
రక్షణ కల్పించవలసిన  క్షత్రియులు (పరిపాలకులు) ప్రజలను భక్షిస్తున్నారు.
వ్యాపారము చేసె వైశ్యులు కల్తీ విక్రయం చేస్తున్నారు.
సేవలు చేయాల్సిన శూద్రులు సేవలు చేయించుకుంటున్నారు.
వర్ణాలు రంగులు మారాయి.
ఆశ్రమాలు  అశ్లీలాలైనాయి.

నీవు సృజించిన నీరు 'కొని' త్రాగుతున్నాము
నిషేధించిన మధువు త్రాగి తూలుతున్నాము.
కోట్లతో ఓట్లు కొని కోట్లకు పడగలెత్తుతున్నాము
ఓట్లు వేసిన వాడి నడుము విరుగ గొడుతున్నాము

రూక లేని వానికి రోగమొస్తె రోగముదే పైచేయి
డబ్బున్న వాడికి జబ్బొస్తే వాడిదేనోయ్ హాయి

వస్తువులధరలు వ్యోమనౌకలైనాయి.
సొమ్ములేమొ మరి చిల్లపెంకులైనాయి

ఋగ్యజుర్సామాధర్వణ వేదాలు నాలుగే నీకు
అతివాద,మతవాద,ఉగ్ర, వేర్పాటు వాదాలనేకం మాకు

ఏమిటి మా భవితవ్యం
చెప్పవోయి నీ ఆంతర్యం

"యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి  భారత ః
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్"

అని  చెప్పిన నీవు 

నిన్ను నీవు సృష్టించుకుంటావా
మమ్మల్ని పుట్టించటం ఆపుతావా
ఏదో ఒకటి చేయ్
నీవున్నావని ఋజువుచేయ్

ఇట్లు
వరాహకల్ప 
వైవస్వత మన్వంతర 
జంబూద్వీప 
భరత వర్ష
భరతఖండ 
కలియుగ  జీవి