అన్నా హజారే కు జోహారు ౧౬/౦౪/౨౦౧౧ 16/4/2011
కం.' అన్నా' ! అవినీతి పెరిగి
విన్నును తాకెనని జనులు విలపించన్ ,నే
నున్నా నోడకుడని నీ
వన్నము ,నీరును విడుచుట యందఱకొఱకే /
కం. ప్రాయము కాని సమ యమున
నాయువు లెక్కింపక జన సౌఖ్యంబుఁ మదిన్
బాయక పీడిత జనుల
ధ్యేయముఁ గెలిచిన' హజారె' నీకిదె జోహార్
please visit my blog .www.krbaruva.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి