24, ఏప్రిల్ 2011, ఆదివారం

నీతి పద్యం


నీతి  పద్యం
శ్లో.   పుస్తకం వనిత విత్తం
      పర హస్తం గతం గతః   
      అథవా పునరా యాతి 
      జీర్ణస్య , భ్రష్టాచ ,ఖండిశః  
తా.  పుస్తకము, ఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే  మరల
      తిరిగి రావు. ఒక వేళ తిరిగి వచ్చిన  చినిగి పోయి ,  చెడి పోయి గాని
     సగము గాని వస్తాయి.
దీనినే తెలుగు పద్య రూపము లో  వ్రాస్తే
ఇలా ఉంటుంది .


శ్లో.   పుస్తకం వనిత విత్తం

      పర హస్తం గతం గతః   

      అథవా పునరా యాతి 

      జీర్ణస్య , భ్రష్టాచ ,ఖండిశః  

తా.  పుస్తకముఆడది , సొమ్ము చే జారి వేరొకరికి స్వంతమైతే  మరల

      తిరిగి రావుఒక వేళ తిరిగి వచ్చిన  చినిగి పోయి ,  చెడి పోయి గాని

     సగము గాని వస్తాయి.


దీనినే తెలుగు పద్య రూపము లో  వ్రాస్తే

ఇలా ఉంటుంది .


.వె.   అందమైన వనితఅరుదైన పుస్తకం

         చేతి సొమ్ము పోతె చేర రాదు 

         తిరిగి  వచ్చెనేని  చెడినదౌచినుగును

         సగమె  వచ్చు  కాదె జగతి లోన 


డాకోమలరావు బారువ














20, ఏప్రిల్ 2011, బుధవారం

రాయలకు నీరాజనం


దక్షిణా పధము లో రాజకీయ దురంధరుడు ,సంగీత సాహిత్యంలో ఆంధ్ర భోజుడు గా అజరా మర కీర్తిని గన్న ,దేశ భాషలందు 'తెలుగు లెస్స' అని తెలుగు భాషను పొగడిన మేటి రాజు శ్రీకృష్ణ దేవరాయల  పంచ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వ్రాసిన పద్యాలు . 


           
శ్రీ కృష్ణదేవరాయల పంచ శతాబ్ది సందర్భంగా వ్రాసిన
పద్యాలు పెద్దల సవరణలతో.



తే.గీ   తుళువ వంశ కల్ప కుజమై కలన   మెఱసి/

       కన్నడ తెనుఁగు రాజ్యశిఖరపు  భూష /

       ణ ,పర రాజ నిర్మథన ఘన భుజ వీర్యు/

       కృష్ణ దేవ రాయ నృపుని కీర్తి మెత్తు.


తే.గీ
        కలము చేపట్టి కృతికన్యకలసృ జించి/

       కత్తి కేలూని  సంగర కల్పన లను/

       కృతి కదనములను ఘనుడు కృష్ణరాయ/

       లనుచు రాయల సత్కీర్తు లనునుతింతు.


కోమలరావు బారువ

                   




శ్రీకృష్ణదేవరాయలు 


సీ

ఎవడు  చెప్పినయట్టి కవనంబు రసిక రాజన్యుల నానంద జలధి దేల్చె 

ఎవడు నుడివినట్టి కవనంబు పండిత పామరాదులకు నింపై చెలంగె /

ఎవడు వ్రాసినయట్టి కవనంబు 'సాహిత్య రసికులచెవులందు రసమునింపె /

ఎవడు పల్కినయట్టి కవనంబు విద్వత్  సభలయందు మిక్కిలి ప్రణుతి కెక్కె //


తే.గీ


నట్టి ఆముక్తమాల్యద యాంధ్ర దేశ 

మందు కావ్యావతంసమై యలరు చుండె 

నట్టి కావ్యమున్ రచియించి నట్టి *కృష్ణ*

*రాయలె పుడమి  కవి రాజు రాజ రాజు*


అట్టి రాయల విరచిత కావ్య రాజ 

మైన ఆముక్త మాల్యద యాంధ్ర దేశ

మందు చిరమగు యశస్సు పొంది నట్లు   

చేసె శ్రీకృష్ణ రాయలు స్థిరముగాను 


డాకోమలరావు బారువ


రాయలు 

.వె 

రాజనంగ నతఁ డె వ్రాయ గలిగినట్టి /

కావ్య రాజము నతి శ్రావ్య ముగను /

రచన చేసినట్టి రాజన్యుడుభువిని /

రాయలె కవి రాజు రాజ రాజు .




రాయల  వారి  కల్పన 


తే.గీ మాలిక 


తే.గీ మాలిక 


మిన్ను తాకు సౌధములట  చెన్ను మీర / 

సోరణములు మూయఁగ చిక్కె  తార లంట; / 

ముత్యములబోలు నక్షత్రములవరుసలు

తరుణిముత్యాలదండతో తమకుగూడ

చిల్లులనుజేతు రచ్చటి చేడియలని

సూది పోట్లకు వెరచిన  చుక్క లపుడు 

నక్కె సరముల సందున చక్కగాను /

రాత్రి  రతి కేళి నలసిన లలన లంత  /

వాయుచర్చనుగోరి గవాక్షములను

తెరచినంతనె చుక్కలు తెరువు గనుచు

వేగ బాఱిన వట వినువీధి చేర

లలితశృంగారభావనాకలితమైన

రమ్య కల్పన చేసిన రాయలె భువి / 

రాజు కవులందును మరియు  రాజు లందు.


మిన్ను తాకు సౌధములట  చెన్ను మీర / 

సోరణములు మూయఁగ చిక్కె  తార లంట; / 

సూది పోట్లకు వెరచి  ;  చుక్క లపుడు 

నక్కె సరముల సందున చక్కగాను /

రాత్రి  రతి కేళి నల సి  లలనలపుడు  /

సోర్ణ గండ్లు తెరవ బాఱె  జుక్క లనుచు /

రమ్య కల్పన చేసిన రాయలె భువి / 

రాజు కవులందును మరియు  రాజు లందు .


డాబారువ కోమలరావు 


రమ్య కల్పన చేసిన రాయ భూప /

అందు కొనుము మా  శతకోటి   వందనములు .


తే.గీ 

కృష్ణ రాయల రసమయ కృతులు వినగ /

ముదము నొందెదరు   రసికుల్  హృదయ మందు /

కృష్ణ రాయల భీకర దృష్టు లొలయ /

వెలవెల పారుదురు పరులు  కలనమందు 


తే .

ఎన్నొ యుద్ధముల్ చేసిపేరెన్నిక గని /

రాటు దేలిన కర్కశ రాణ్మణీవు /

ఆంధ్రకవులకెల్ల మిగుల యబ్బురంబు /

నీ కవనమరయఁ గ  నవనీత మగుట.

కృష్ణ రాయ ! రణ కవన కీర్తి సాంద్ర.



.వె 

అతివ అందమైన, ద్వైతమైనను

కవన రచన యందు ; కదన రంగ/

మైన నీకు సాటి యైన వారు గలరె

 జగాన జూడ  కృష్ణ రాయ!


.వె 

రాయలనఁగ నెవడు ? రాజులందు ఘనుఁ డు /

రాయ లనఁగ కవన రాయ డతఁడు /

విష్ణు చిత్తు కథను విరచించె ఘనముగా /

నాంధ్ర మందు కవులు హ్లాద మంద .


రాయల రచన 


తే .

ఎన్నొ యుద్ధముల్ చేసిపేరెన్నిక గని /

రాటు దేలిన కర్కశ రాణ్మణీవు /

ఆంధ్రకవులకెల్ల మిగుల యబ్బురంబు /

నీ కవనమరయఁ   నవనీత మగుట.


-కోమలరావు బారువ 


శ్రీకృష్ణ రాయ కవి


.వె 

కత్తి చేత బట్టి కదనంబు చేసెను /

కలము  బట్టి చేసె కావ్య రచన /

 కదనమందు మరియు కావ్య రచనయందు /

ఘనుడు కృష్ణ రాయ కవి వరుండు .



         www.krbaruva.blogspot.com
                   
                  


18, ఏప్రిల్ 2011, సోమవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు



                                     కం. శ్రీ కరముగ 'ఖర' వర్షము 
                                           శీకరముగనేగుదెంచి తెలుగు జనులకు 
                                          'శ్రీ'కలుగన్ శాంతి నొసగు 
                                          కాకోదర రాజహారు కరుణా  పరతన్ 
                                                      
 తా. శుభము కూ ర్చే విధముగా  ఖర=వేడి /వాడి  అను సంవత్సరము  తాపాన్ని తగ్గించ టానికి  నీటి తుంపర (శీకరము)  లాగ వస్తుంది .అలాగే సర్పాని  ధరించిన శివుడి కరుణ వలన    తెలుగు వాళ్లందరికీ సంపద  మరియు శాంతి కలిగిస్తుంది.  



                                                         

16, ఏప్రిల్ 2011, శనివారం

అన్నా హజారే కు జోహారు


అన్నా హజారే కు జోహారు          ౧౬/౦౪/౨౦౧౧ 16/4/2011
కం.' అన్నా' ! అవినీతి పెరిగి
     విన్నును తాకెనని జనులు విలపించన్ ,నే
     నున్నా నోడకుడని నీ
     వన్నము ,నీరును విడుచుట  యందఱకొఱకే /

కం. ప్రాయము కాని సమ యమున 
     నాయువు లెక్కింపక జన సౌఖ్యంబుఁ మదిన్
     బాయక పీడిత జనుల
     ధ్యేయముఁ  గెలిచిన' హజారె' నీకిదె జోహార్
    please visit my blog .www.krbaruva.blogspot.com

గణపతి స్తోత్రం


         గణపతి స్తోత్రం     15/4/2011
కం. తొండము గల దేవా మా
     కండగ నీవుండి మమ్ము కావగ రావా
     చుండెలుక నెక్కి లోకుల  (ఉండ్రాలను తిని లోకుల)
     గండాలను రూపుఁ మాపు గౌరీ  తనయా    
please visit my blog at www.krbaruva.blogspot.com

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

దుర్గకు నివేదన

౧౫.౪.౨౦౧౧ 15/4/2011

                                                                   దుర్గకు నివేదన    


                                           కం. మ్రొక్కెద  నెదలో కనకపు 
                                                  ముక్కర  గల కనక దుర్గ, ముజ్జగముల తాఁ 
                                                  జక్కగ కాచెడి మాతా 
                                                  మ్రొక్కులు గొని మమ్ముఁ గావు పూర్ణేందు  ముఖీ