4, నవంబర్ 2021, గురువారం

 దీపావళి 


తే.గీ  1

ద్వాపరంబున భూదేవి  తనయుఁడు నర /

కాఖ్యుఁ డుండె జనులపాలి కంటకుండు /

వాని సంహరించ జనియె వారి జాక్షి /

సత్యఁ  గూడి  శ్రీ పతి పక్కి జక్కి నెక్కి 


తే.గీ 2

ఘోర సంగర మయ్యె నాకారి తోడ /

నా సమయమందు మూర్చిల్లె వాసు దేవుఁ /

డంత సత్య భామ ధనువు నందు కొనుచు /

నాశుగ మ్మేసె నరకుపై నాశుభాంగి.


తే.గీ 3

శరము తాకిన యంతట నరకుఁడలిగి /

యేసె పటుతర  భల్లమా యింతి   పయిని/

అంత శౌరి తెలివినొంది కాంత ను గని /

మెచ్చి , నరకు శిరము ద్రుంచె హెచ్చిన కసి 


తే.గీ 4

కొడుకని తలఁచక నరకుఁ గూల్చు  వేళ /

 క్షితి తనయు పాటు నీక్షించి ఖేద మందె /

నరకు బాధ పోయి  సుర లానంద మంద

ప్రజల కు భువిని దీపాల పండుగాయె


.వె 5

అరులను  బెదరించి హరి మధ్యలలరించి /

సృష్టి  పుష్టి విలయ చిద్విలాసు/

కమల నయను విష్ణు కడగంటి చూపులు /

పుడమి ప్రజల సతము బ్రోచు గాత



డాకోమలరావు బారువ    4/11/2021








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి