12, నవంబర్ 2021, శుక్రవారం

 గో విలాపము 

తే.గీ 

తూర్పు దిశ యందు సూర్యుండు తొంగి చూడ/

నిదుర మేల్కాంచి ఆనాడు నేను వేగ/

పాలు పితుకంగ గోమాత పాలి కరుగ/

పలికె నిట్టుల నేత్ర బాష్పములు కురియ.


మా మగవారు మీరనెడి మాటల నెల్ల సహించి నేర్పుతో /

భూమిని దున్నకున్నెడల పొట్టలు నిండునె యట్టి మా పయిన్/

తామస మేల మీకు నిది ధర్మమె క్రూరపు బుద్ధి తోడ /

మ్మీమహిలోన గొట్టెదరు మీ నరజాతికి జాలి యున్నదే


శా

పాలు త్రాగు మా చిరుత పాపల జూచి సహింపలేక /

వ్వాలుకు ద్రోసివేసి చివ్వాలున మా చనుబాలు పిండి కం/

చాలను బోసి త్రావెదరు చల్లగా బొజ్జలు నిండ మీరు /

మ్మేలను హింస బెట్టెదరు మీ నరజాతికి జాలియున్నదే


తే.గీ

అంబ అంబా యటంచును యాకటి కిని /

అరచు మా బిడ్డలను గాంచి ఆత్మలోన /

పాపమని సుంతయైనను పలుక బోరు/

జాలి లేనట్టి వారు మీ జాతి వారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి