గీత రచయిత సిరివెన్నెల ( చేంబోలు) సీతారామ శాస్త్రికి అశ్రు నివాళి.
ఆ.వె.
తరలి పోయి నాఁడు సిరివెన్నెలేడకో /
కలము చేత బూని కవిత లల్ల /
కవికి యొక్క చోటు కాణాచి కాదులే /
కాన నిష్క్ర మించె తాను దివికి .
30/11/2021
గీత రచయిత సిరివెన్నెల ( చేంబోలు) సీతారామ శాస్త్రికి అశ్రు నివాళి.
ఆ.వె.
తరలి పోయి నాఁడు సిరివెన్నెలేడకో /
కలము చేత బూని కవిత లల్ల /
కవికి యొక్క చోటు కాణాచి కాదులే /
కాన నిష్క్ర మించె తాను దివికి .
30/11/2021
చాటువు - కొప్పరపు
సరసిజ వైరి వైరులను చాలగు గెల్చు కుచద్వయంబుతో
సరసిజ వైరి వైరి నగజానెడు మేలగు మధ్యమంబుతో
సరసిజ వైరి వైరినెకసెక్కెములాడెడు కప్పు కొప్పుతో /
సరసిజ గంధి వచ్చె మరుసాయకమోయన సుబ్బయాహ్వయా .
పుస్తకము
పుస్తకము కాదు హస్త భూషణము
పుస్తకము విజ్ఞానికి భోషాణము
పుస్తకము విజ్ఞానార్ణవము
పుస్తకము నీ మస్తకములో ఉంటే
జగత్తు సమస్తము నీ వెంటే
పుస్తకము తాటాకులకు మరో రూపము
పుస్తకము సరస్వతీ దేవి ప్రతి రూపము
నిరతము పుస్తకము పఠించు
నీ యొక్క విజ్ఞాన్ని పెంచు
పుస్తకము విద్యార్థికి జ్యోతి
పుస్తకము పెంచు మనిషి ఖ్యాతి
డా. కోమలరావు బారువ (ప్రాత రచన)
గో విలాపము
తే.గీ
తూర్పు దిశ యందు సూర్యుండు తొంగి చూడ/
నిదుర మేల్కాంచి ఆనాడు నేను వేగ/
పాలు పితుకంగ గోమాత పాలి కరుగ/
పలికె నిట్టుల నేత్ర బాష్పములు కురియ.
ఉ.
మా మగవారు మీరనెడి మాటల నెల్ల సహించి నేర్పుతో /
భూమిని దున్నకున్నెడల పొట్టలు నిండునె యట్టి మా పయిన్/
తామస మేల మీకు నిది ధర్మమె క్రూరపు బుద్ధి తోడ మ/
మ్మీమహిలోన గొట్టెదరు మీ నరజాతికి జాలి యున్నదే?
శా.
పాలు త్రాగు మా చిరుత పాపల జూచి సహింపలేక న/
వ్వాలుకు ద్రోసివేసి చివ్వాలున మా చనుబాలు పిండి కం/
చాలను బోసి త్రావెదరు చల్లగా బొజ్జలు నిండ మీరు మ/
మ్మేలను హింస బెట్టెదరు మీ నరజాతికి జాలియున్నదే?
తే.గీ.
అంబ అంబా యటంచును యాకటి కిని /
అరచు మా బిడ్డలను గాంచి ఆత్మలోన /
పాపమని సుంతయైనను పలుక బోరు/
జాలి లేనట్టి వారు మీ జాతి వారు.
విద్య
ఆ.వె
అన్న మెంత తిన్న నఱిగి పోవును కాదె /
నీడ నిచ్చు గూడు పాడు పడును /
తొడిగి నట్టి బట్ట తుదకు చినిగి పోవు /
చదివి నట్టి విద్య శాశ్వ తమ్ము .
డా. కోమలరావు బారువ 11/11/2021
దీపావళి
తే.గీ 1
ద్వాపరంబున భూదేవి తనయుఁడు నర /
కాఖ్యుఁ డుండె జనులపాలి కంటకుండు /
వాని సంహరించ జనియె వారి జాక్షి /
సత్యఁ గూడి శ్రీ పతి పక్కి జక్కి నెక్కి
తే.గీ 2
ఘోర సంగర మయ్యె నాకారి తోడ /
నా సమయమందు మూర్చిల్లె వాసు దేవుఁ /
డంత సత్య భామ ధనువు నందు కొనుచు /
నాశుగ మ్మేసె నరకుపై నాశుభాంగి.
తే.గీ 3
శరము తాకిన యంతట నరకుఁడలిగి /
యేసె పటుతర భల్లమా యింతి పయిని/
అంత శౌరి తెలివినొంది కాంత ను గని /
మెచ్చి , నరకు శిరము ద్రుంచె హెచ్చిన కసి
తే.గీ 4
కొడుకని తలఁచక నరకుఁ గూల్చు వేళ /
క్షితి తనయు పాటు నీక్షించి ఖేద మందె /
నరకు బాధ పోయి సుర లానంద మంద
ప్రజల కు భువిని దీపాల పండుగాయె.
ఆ.వె 5
అరులను బెదరించి హరి మధ్యలలరించి /
సృష్టి పుష్టి విలయ చిద్విలాసు/
కమల నయను విష్ణు కడగంటి చూపులు /
పుడమి ప్రజల సతము బ్రోచు గాత.
డా. కోమలరావు బారువ 4/11/2021
చెంప కాయ
తే.గీ
చెంప మీద కొట్ట నదియె 'లెంప'కాయ /
యొప్పిదముగ నుదురుఁ గొట్ట 'డిప్ప' కాయ /
'మొట్టి' కాయయగును మాడు గొట్ట గాను /
చలముమీర ప్రక్క న్ గొట్ట 'జల్ల' కాయ /
వెనుక గొట్టఁగా నది 'కొత్తెమ'నఁగ బరగ /
నైదు విధములు రహి తలమీఁద కొట్ట .(దెబ్బ)
పరమానంద శిష్యుల కథ సినిమా సన్నివేశమునుండి .....