29, అక్టోబర్ 2021, శుక్రవారం

 


.వె 

పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు /

గిట్టు వాఁడు మరల పుట్టు నంట /

పుట్టి గిట్ట కుండ ముక్తికై జీవుడు /

మహిని మసల వలెను మర్మ మెఱిగి .


-బారువ కోమలరావు. 01/9/2021



తే.గీ


పువ్వులు తరుల పై వెల్గు దివ్వెలల్లె 

తరుణులకు  సతము ముదమును గూర్చు 

నవ్వులకు ప్రతీకలు మల్లె  పువ్వులంద్రు 

పువ్వులు   పసి  పాప నవ్వులంద్రు 





 

 .వె

ఎందు చూడ దేవు డందు కలడఁనుచు/

చెప్పె పోతరాజు యొప్పి దముగ /

దేవుడందరందు తిరముగాకలడఁచు/

చక్కగా నుడివెను శంకరుండు.


*అహమ్ బ్రహ్మాస్మి


డాకోమలరావు బారువ. 25/8/2021 





28, అక్టోబర్ 2021, గురువారం

 


.వె 

గతము తలచి వగవ కలుగదు భాగ్యమ్ము /

గంగ పోవ సేతు గట్టి నట్టు /

నేడు తలచి మనిషి నేర్పొప్ప బ్రతుకఁగ /

నిలను మనకు సతము కలుగు సుఖము . 


డాకోమలరావు బారువ 26/10/2021

20, అక్టోబర్ 2021, బుధవారం

 కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం/

ఆరుహ్య  కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్// 


తే.గీ 

మావిచిగురు మెసవి మధుమధురముగను /

కొమ్మ మాటున కూసెడి కోయిలవలె /

రామ రామేతి రామేతి రామ రామ

యనుచు పలికెడి వాల్మీకి కంజలింతు  

16, అక్టోబర్ 2021, శనివారం

 వి   దశమి శుభాకాంక్షలు


.వె 


వివిధ రూపులెత్తి  విఘ్నములన్ బాపి /

యము నొసఁగు నట్టి చండి గౌరి /

శము నిచ్చి ప్రోచి నట్టి శుభ దినము /

దశమియెల్లరకు ముదమ్ము గూర్చు .


కందము 


భక్తిని గొల్చెద మనమున/

శక్తిని , శర్వాణి ,కాళి , శాంభవి చండిన్ /

ముక్తి ప్రదాయని హ్రీం చి /

చ్ఛక్తి ని సతతమ్ము బ్రోచు చాముండి శివన్// 

5, అక్టోబర్ 2021, మంగళవారం

 *అక్షరార్చన* ( *విశ్వనాథవారి* గుఱించి ఉత్పలమాలిక) రచన: *పేరి* *రవికుమార్* ………………………………. శారద దివ్యవీణ స్వరసంపుటితమ్ముల పల్కువేళ త/ న్త్రీ రవముల్ చతుర్ముఖుని తృప్తునిజేయ, తెనుంగుభాషలో/ నా రమణీయనాదములనాకృతి జేసి కవిత్వమౌ వచః / శ్రీరససిద్ధరూపముగ జేసి తదద్భుతకృష్టి జూచి రం/ గారు ముదమ్మునందునొక కల్పన చేసె విరించి, రాముడై / శ్రీరవివంశమందవతరించిన శ్రీహరి దివ్యగాథ తా/ నీ రసనాగ్రమందు పలికించెదనంచు, మఱింతలో హరుం/ డోరగజూచి భేదమొకటున్నదొ మాకన, బ్రహ్మ, లేదులే/ దీ రచనాధురంధరుడు కృత్స్నమభేదము వ్రాయునన్నచో/ వేరుగ కూడి దేవతలు వేలుగ మాకును తీర్పగా పనుల్/ పేరుకుపోయి యున్నవని పేర్మి వచింప, పల్కులన్ని ప్రో/ వై రవళింప దిక్కులను, వైదిక ధర్మకళా రసజ్ఞ వాక్/ స్ఫార వినూత్నభావ పరిభాస మధుస్వన కావ్యగీతికా/ కార విమర్శనాంచిత ప్రగాఢమనోమయ ధీప్రకాశమై / తీరుగ సత్కవీశ్వరపు తేజమొకండు, తెలుంగునాట జా/ ల్వారిన, *విశ్వనాథ* కవివై యవతారము దాల్చినావు స్వా/ మీ! రుచిరాక్షరాకృతుల మేటిగ కూర్చిన శిల్పివీవు, నీ/ దౌ రచనా ప్రపంచమున ధార్మిక చింతన లేనిదేది? శ్రీ/ భారతభూమిపీఠమగు భాసురధర్మసమగ్రరూపమా/ కారము జేసి *వేయిపడగల్* సృజియించిన, తెల్గువారికిన్/ భారతమయ్యె; భారతము వ్రాసిన తిక్కన *విష్ణుశర్మతో* / చేరి పఠింపనాంగ్లమను చేడియ చెక్కిళులందు మచ్చలన్/ దీరిచి చూపినావు కద; తెల్గుపొలంతుక యత్తచేతిలో/ నారడులోర్వజాలక హృదంతరమందు చలించి దుఃఖమే/ పారగ నీరుగా కరగి పారిన *కిన్నెరసాని* క్రొత్త సిం/ గారములన్ హొయల్ రసజగత్తునకిచ్చెను నీదుచేతనిం/ పారి; *పురాణవైరమున* భారతదేశచరిత్ర యంత తా/ ర్మారవ, గ్రంథమాలను సమగ్రచరిత్ర ఖగోళశాస్త్రమా/ ధారముగా లిఖించితివి; తావక ధీద్యుతి సోకినంత *కా* / *శ్మీరము* *నేపళమ్ముల* విశిష్టచరిత్రలు స్పష్టమయ్యె; ఝం/ కారము *మ్రోయుతుమ్మెద* ప్రకల్పితగాథను నాదరూపమోం/ కారమునొందు వైఖరులు కన్పడు; వ్యంగ్యము వర్ణనాచమ/ త్కారము *హాహహూహు* కథగా; తనుధర్మము స్పర్శలక్షణాల్/ తీరని ప్రేమదాహ పరిదీనమనఃస్థితు *లేకవీరగా* / కోరికలేని ప్రేమకథకూరుపులో నటనాస్వరూప ధా/ రారమణీయమౌ *తెఱచిరాజుగ* శాశ్వతధర్మరూప సం/ సారము వీడి చిత్తమున సాగుచు *చెల్యలికట్ట* దాటు స్వే/ చ్ఛారతి దుష్ప్రభావములు; సంఘ *సముద్రపుదిబ్బ* లో మహా/ కారణకార్యమూలముల కన్నులజూపితివిట్టిరీతిగా/ సౌరభముల్ వినూత్నముగ జల్లును నీ నవలాబ్జముల్; ప్రభా/ సారపు పద్యకావ్యముల శబ్దమునర్థము మేళవించి, లో/ నారసి కూర్చినావు, మహ *దాంధ్రప్రశస్తియు* *పౌరుషమ్ము* నీ/ ధారుణిమాత దాల్చును శతమ్ముల వర్షములున్ కిరీటమై/ దోరగమ్రుగ్గు పండ్లు *శశిదూతము*, *కోకిలపెండ్లి* గాథ, *శృం* / *గారపువీథి* వర్ణనలు; కాలమునందున *తెల్గు* నాట వే/ ర్వేరుగ రూపుచెందు *ఋతు* రీతుల చిత్రణలున్; భవన్మన/ స్తీరమునంటి పారు హరదేవునిపైగల భక్తి పద్యమం/ దారములెన్ని వర్ణముల తావుల పూచెనొ; నాదదేహునా/ గౌరిమనోవిభున్ హరుని కౌశలమొప్ప బహుప్రకారు ఛం/ దోరసవాహినీఝరులతోనభిషిక్తుని చేసినావహో! / శ్రీరఘురామచంద్రుకథ- జీవునివేదన తండ్రియాజ్ఞయున్/ చేరి మహత్వతత్త్వమున జేసిన కావ్యము *కల్పవృక్షమై* / పారమెఱుంగలేని ఘనవార్నిధిలోని యనర్ఘరత్నభాం/ డారములొక్కచోట ప్రకటస్ఫుటమైనటు, తావియబ్బి బం/ గారము పోతపోసికొని కన్పడినట్లు, తెలుంగుజాతి యా/ చారములెల్లనానుడులు, సామెతలిచ్చటి వంటకాల్ రుచుల్/ సారపు దేశిపద్యముల సర్వము పండెడి పంటభూమిగా/ తోరపు కావ్యధర్మముల త్రోవ మెఱుంగులు దిద్ది, యాంధ్రభా/ షారమణీయసారముగ, శబ్దజగత్ప్రతిబింబమోయనం/ గా రచియించినావు! కవిగా మరి వ్యక్తిగ సాటిలేని సం/ స్కారము కల్గి నిత్యకవిగా తపమొందిన సత్యమౌ కళా/ కారుడవీవునచ్చమగు కైతకు రూపము నీవు, నీ యలం/ కారము నీదు సొంతము, నగమ్ముల కొల్వ పయోధికొక్క ప్రా/ కారము కట్ట సాధ్యమె జగత్కవి! నీ కవితాస్వరూపమె/ వ్వారికినైన పూర్ణముగ వర్ణన జేయ తరంబె, కావ్యసం/ సార ఋణమ్ములన్- ఋషుల, సత్కవులందున నీవు నిండుగా/ తీరిచినావు; నీ ఋణము దీర్ప, గళమ్మిది శ్వాసతోడ సం/ పూరితమొందునంతకును, పూనిన దీక్షను, తెల్గునాట నో/ రారగ విశ్వనాథ కవిరాణ్మణి! నీ కృతులన్ పఠించెదన్ //

3, అక్టోబర్ 2021, ఆదివారం

 నేడు లాల్  బహదూర్ శాస్త్రి స్మృతిదినము


తే. గీ
దేశ రెండవ నేతగా  తేజరిల్లి/
పల్కెఁ జై జవాన్ జై కిసాన్  పటు రవముగ/
నీతికి నిలబడిన గొప్ప  నేత యతఁడు
భారతీయుఁడు లాల్ బహదూరు శాస్త్రి/
అంజలించెద నేతకు నశ్రు ఝరుల.

౨/౧౦/..

తే. గీ

దేశ రెండవ నేతగా  తేజరిల్లి/

పల్కెఁ జై జవాన్ జై కిసాన్  పటు రవముగ/

నీతికి నిలబడిన గొప్ప  నేత యతఁడు

అంజలించెద శాస్త్రికి అశ్రు ఝరుల.