జీవిత పరమార్థము
వర్షార్థ మష్టా ప్రయతేత మాసాన్
నిశార్థ మర్థం దివసం యతేత
వార్ధక్య హేతో ర్వయసా నవేనా
పరత్ర హేతో రిహ జన్మనా చ.
తే.గీ
వర్ష కాలంబు సుఖముండ వలయు నన్న/
కష్ట పడవలె మనిషి మాసాష్టమందు /
పగలు పనిచేయ వలె రాత్రి పదిలముండ /
వార్ధకమ్మున సుఖియించ వలయు నన్న /
జీవి కష్టించ వలయును యౌవనమున /
నరుఁ డిలను శ్రమించ వలెను పరము కొఱకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి