4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

 

తేటగీతి మాలిక 

భూమి భారంబు తగ్గించ పుడమి వేఁడ /

వసుధ కోర్కెకు దివ్యులు వంత పాడ /

దనుజుల దునుమాడుటకునై దానవారి /

దేవకీ దేవులకు పుట్టె తేజమలర /

కంసు భయముచే నిశరాత్రి కరుణతోడ /

తండ్రి బాలుని  వ్రేపల్లె తరలజేసె /

బాలుడంత పెరుగుచుండె వ్రజమునందు /

తల్లియై  యశోద శిశువుఁ దనుపుచుండ /

పిన్న వయసున పూతన పీచ మడఁచె /

పెక్కు దనుజుల బాలుడై యుక్కడంచె /

మన్ను తిన నోరు చూపించుమన్న చూపె /

తల్లికి పదునాల్గు జగము లెల్ల నోట /

మద్దులను గూల్చె , కాళియు మదమడంచె /

కొండనెత్తి యాఖండలు క్రొవ్వడంచె /

విశ్వగురుడైన గురునొద్ద విద్యనేర్చె /

మామకంసుని సమయించి మహిమ జూపె /

గొల్ల భామల మురిపించె పల్లెలోన /

ద్రౌపదికివలువ లొసఁగి రక్షచేసె /

ధర్మమునిలుప పార్థు రథమ్ము నడపె /

'గీత' నుడివె జనులతల  వ్రాత మార్చ /

ధరను దుష్టుల శిక్షించ తాను పుట్టె /

అట్టి కృష్ణునకనిశము నంజలింతు .



డా.కోమలరావు బారువ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి