18, జులై 2023, మంగళవారం

 సమస్య :


"పతికి గర్భ మాయె సతిని గవయ" ( కోమలరావు ) 


అవధానుల పూరణ .


ఆటవెలది .

పెండ్లి జరిగె నాడు పెద్దలందరు మెచ్చ /

వరుడు మోదమందె వధువు  గూడి /

అతివ చెప్పె గడచె యాఱైన నెలలని/

పతికిగర్భమాయె సతిని గవయ . ( శ్రీ సుసరాపు చంద్రశేఖర్ శర్మ గారు


ఆటవెలది

కాంక్ష దీర జరిగె కళ్యాణమానాడు/

కలియ రెండు మదులు కమ్ర గతిని/

వంశ కీర్తి నొంద వాసిగా మేటి భూ /

పతికి , గర్భ మాయె సతిని గవయ . (రంప సాయి కుమార్ )



నాపూరణ : 


కొడుకు లేని బ్రతుకు కొఱగానిదనుచును /

శివుని కొరకు తపము చేసె నిష్ఠ / 

కొడుకు కావలె నని కోరనా పార్వతీ /

పతికి ;గర్భమాయె సతిని గవయ .




కొడుకు లేని బ్రతుకు కొఱగానిదనుచును /

తపము చేయ శివుడు తారసిల్ల /

కొడుకు కావలె నని కోరఁగ పార్వతీ /

పతికి ;గర్భమాయె సతిని గవయ .



కవయు = కలియు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి