2, నవంబర్ 2022, బుధవారం

 తరువులు 


తేటగీతి మాలిక 

అరయ తరువులు పక్షుల కాశ్రయంబు /

మానవాళికి నిచ్చు ను మంచి గాలి /

పథిక మార్గ శ్రమము నెంతొ బాపు తరువు /

ఫలములిచ్చి మనుషుల యాకలిని తీర్చు /

తరువులెండిన యగు వంట  చెఱకు మనకు /

ఇలను దున్నఁగ ఘన మగు హలము కాదె /

తరువు పాడెయౌ మనుషుల మరణ వేళ /

కాయములు కాల్చఁగ రహి కట్టె యగును /

తరువులీ భువి కెంతయు బరువులౌనె /

తరువులను  పెంచ వలె  మన తనయు లట్లు .


డాకోమలరావు బారువ 3/11/2022



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి