23, నవంబర్ 2022, బుధవారం

 స్వీయ రచన 


వె 

సమయ మున్న వేళ  సంపదలేదాయె /


సంపద కలుగంగ సమయలేమి /


సమయ సంపదలును చాలినంతయునున్న


అనుభవించ శక్తి అసలు లేదు .


.వె 


అప్పు లేని వాడె యందరి కంటెనై 

శ్వర్య వంతుడవని బరికిఁపంగ  

అప్పు చేయు మనిషి  అప్పులలో మున్గు 

నవని లోన కాన నరసి బ్రతుకు 


అప్పు = ఋణము , నీరు 


-డాకోమలరావు 




డాకోమలరావు బారువ .21/11/2022




13, నవంబర్ 2022, ఆదివారం

 



రైతు -బుగత 


భూమిని నమ్మిన రైతు అందరికి కూడు పెడుతున్నాడు

భూమిని అమ్మిన  బుగత అందరి నోట్లో మట్టి కొడుతున్నాడు .


భూమిని నమ్మి (దున్ని చెమట చిందిస్తున్నాడు రైతు 

భూమిని అమ్మి కాసులు చేసుకుంటున్నాడు బుగత


బుగత మేడలు మీఁద మేడలు కడుతున్నాడు .

రైతు పాడె మీఁదకి వెళుతున్నాడు


రైతుకు ఎరువులిచ్చేందుకు  బ్యాంకులో సొమ్ములు కరువు.

బుగతకు అరువులిచ్చేందుకు ( loans ) బ్యాంకులు పరుగు పరుగు .


రైతుకు లోనివ్వాలంటే సవాలక్ష క్వరీసు .

బుగతకు లోనివ్వాలంటే  లేవే ఎన్క్వరీసు .


రైతు దృష్టి ప్రజల కడుపు నింపడం పైన .

బుగత దృష్టి ప్రజల కడుపులు  కొట్టడం పైన .


ఇన్ని చేసిన రైతుకు తిరస్కారము .

అన్ని దోచిన బుగతకు పురస్కారము .



-కోమలరావు

  .


ముప్పదేండ్లు గడచె గొప్పగు ప్రాక్టీసు 

చేసి , కీళ్ళు సడలె చేతి వేళ్ళు 

వణకె  ;భక్తి కలిగి ( ధర్మ మెరిగి ) బ్రతుక వలె మనము 

చింత లేక శేష జీవితంబు


14/11/2022


ముప్పదేండ్లు గడచె గొప్పగు ప్రాక్టీసు 

చేసి , కీళ్ళు సడలె చేతి వేళ్ళు 

వణకె  సమయమయ్యెను రహి భక్తి 

కలిగి జీవితంబు గడప వలెను 


14/11/2022

10, నవంబర్ 2022, గురువారం

దైవ సృష్టి.       

      

 ఉప్పును సృజించితివి నీ/

వప్పుల , సహకార తరువు నవనిన్ గరిమన్ 

 గొప్పగ రెంటిని తగ నే /

ర్పొప్పన్  గల్పితివి నిన్ను పొగడన్ తరమే.      


-కోమలరావు 

5, నవంబర్ 2022, శనివారం

 తెలుగు భాష 

తే

ఇంచు రసమును రుచిలోన మించుభాష /

పాల కన్నను తెల్లని స్వచ్ఛ భాష /

పశ్చిమాదులు మెచ్చిన ప్రాచ్య భాష /

రాయలు పొగడిన  తెలుగు రమ్య భాష .


డాకోమలరావు 


ఇంచు = చెఱకు

 దాశరథి కి నివాళి 


కవిత్వ సంపదకు శరథి 

గభీరతకు మహోదధి దాశరథి 

తెలంగాణ గడ్డపై పుట్టిన ధీమణి 

నిరంకుశ పాలనకు ఎక్కుపెట్టిన గుణి 

ఆంధ్ర దేశ ఆస్థాన పీఠి నలంకరించినవాఁడు 

అలనాటి చిత్రసీమను పాటలతో నలరించినవాఁడు .

నైజాము పాలకుల తూర్పార పట్టిన ' అగ్నిధార

బడుగు పేదల వెతల కతల వాణి 'రుద్రవీణ

కవితలెన్నొ వ్రాసిఘనత కెక్కినఘనుఁడు 

బిరుదులెన్నొ గొన్న ' కవిసింహము '

రచన లెన్నొచేసి రాణ కెక్కిన కళారవి 

మన దాశరథి కృష్ణమాచార్య సుకవి .



డా కోమలరావు 

2, నవంబర్ 2022, బుధవారం

 తరువులు 


తేటగీతి మాలిక 

అరయ తరువులు పక్షుల కాశ్రయంబు /

మానవాళికి నిచ్చు ను మంచి గాలి /

పథిక మార్గ శ్రమము నెంతొ బాపు తరువు /

ఫలములిచ్చి మనుషుల యాకలిని తీర్చు /

తరువులెండిన యగు వంట  చెఱకు మనకు /

ఇలను దున్నఁగ ఘన మగు హలము కాదె /

తరువు పాడెయౌ మనుషుల మరణ వేళ /

కాయములు కాల్చఁగ రహి కట్టె యగును /

తరువులీ భువి కెంతయు బరువులౌనె /

తరువులను  పెంచ వలె  మన తనయు లట్లు .


డాకోమలరావు బారువ 3/11/2022