గురువందనము
తే .
గురువు విద్యార్థి యజ్ఞాన కరువు బాపు /
గురువు వినయవిధేయత గఱపి చూపు /
గురువు తిమిరమందు వెలుగు తరణి సముఁడు /
నతులు చేసెదట్టి గురుని మతిఁ దలంచి .
డా. కోమలరావు బారువ .5/9/2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి